డీలర్‌షిప్‌లకు చేరుకున్న 2024 Maruti Dzire, త్వరలో టెస్ట్ డ్రైవ్‌లు ప ్రారంభం
మారుతి డిజైర్ కోసం shreyash ద్వారా నవంబర్ 13, 2024 09:25 pm ప్రచురించబడింది
- 213 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
నెలవారీ సబ్‌స్క్రిప్షన్ బేసిస్ కింద మారుతి కొత్త తరం డిజైర్‌ను అందిస్తోంది. ధర రూ. 18,248 నుండి ప్రారంభం.
-
ఎక్ట్సీరియర్ మార్పులలో, దీని కొత్త గ్రిల్, LED లైటింగ్ సెటప్ మరియు కొత్త డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
-
కొత్త మారుతి డిజైర్‌లో 9-అంగుళాల టచ్‌స్క్రీన్, ఆటో AC మరియు వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లు అందించబడ్డాయి.
-
ఈ సెడాన్ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు (ప్రామాణికంగా), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) మరియు రియర్ పార్కింగ్ సెన్సార్ వంటి భద్రతా ఫీచర్లు అందించబడ్డాయి.
-
ఇది కొత్త 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో 5-స్పీడ్ MT మరియు AMT గేర్‌బాక్స్ ఎంపికను కలిగి ఉంది.
-
5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడిన తక్కువ అవుట్‌పుట్ (70 PS/102 Nm)తో ఆప్షనల్ CNG పవర్‌ట్రెయిన్‌ను కూడా పొందుతుంది.
-
కొత్త తరం మారుతి డిజైర్ ధర రూ. 6.79 లక్షల నుండి రూ. 10.14 లక్షల మధ్య ఉంది (పరిచయ ఎక్స్-షోరూమ్ పాన్ ఇండియా).
మారుతి యొక్క ఇటీవల విడుదలలో 2024 మారుతి డిజైర్ ఒకటి. ఈ వాహనం యొక్క ధర రూ. 6.79 లక్షల నుండి రూ. 10.14 లక్షల మధ్య ఉంది (పరిచయ ఎక్స్-షోరూమ్ పాన్ ఇండియా). ఇప్పుడు కొత్త మారుతి డిజైర్ కారు షోరూమ్‌లకు చేరుకోవడం ప్రారంభించింది మరియు ఈ కారు టెస్ట్ డ్రైవ్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. కొత్త తరం మారుతి డిజైర్ ఎలా ఉంది మరియు దాని ప్రత్యేకత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం:
డిజైన్
ఫోటోలో కనిపిస్తున్న డిజైర్ కారు యొక్క కొత్త గాలంట్ రెడ్ ఎక్ట్సీరియర్ షేడ్ ఇది. వెలుపలి భాగంలో, హారిజాంటల్ స్లాట్‌లతో కూడిన పెద్ద గ్రిల్, LED DRLలతో కొత్త హెడ్‌లైట్లు మరియు కొత్తగా రూపొందించిన డ్యూయల్-టోన్ 15-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వెనుక వైపున, ఇది Y- ఆకారపు LED అంతర్గత లైటింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన కొత్త టైల్‌లైట్‌ను కలిగి ఉంది.
తాజా వెర్షన్లో, 2024 మారుతి డిజైర్ కారు లుక్స్ పరంగా స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ నుండి పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది.
ఇది కూడా చూడండి: 2024 మారుతి డిజైర్ డ్రైవ్: మీరు తెలుసుకోవలసిన 5 విషయాలు
ఇంటీరియర్ మరియు ఫీచర్లు
కొత్త మారుతి డిజైర్ స్విఫ్ట్ లాంటి డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌ను కలిగి ఉంది. అయితే, డాష్‌బోర్డ్‌లో ఇది డాష్‌బోర్డ్‌లో ఫేక్ వుడెన్ ఇన్‌సర్ట్‌లతో పాటు క్యాబిన్ లోపల బ్లాక్ మరియు బీజ్ కలర్ థీమ్‌ను పొందుతుంది
కొత్త తరం డిజైర్ సెడాన్‌లో 9-అంగుళాల టచ్‌స్క్రీన్, ఆటో AC, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సింగిల్ పేన్ సన్‌రూఫ్‌ను కలిగి ఉన్న భారతదేశపు మొదటి సబ్‌కాంపాక్ట్ సెడాన్ కారు ఇదే. ప్రయాణీకుల భద్రత కోసం, ఇది 6 ఎయిర్‌బ్యాగ్‌లు (ప్రామాణిక), 360-డిగ్రీ కెమెరా (సెగ్మెంట్-ఫస్ట్), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) మరియు రియర్ పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్లతో అందించబడింది.
పెట్రోల్ మరియు CNG వేరియంట్లలో లభ్యం
ఇది 2024 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌తో కొత్త 1.2-లీటర్ 3 సిలిండర్ Z సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది, దీని స్పెసిఫికేషన్లు క్రింది విధంగా ఉన్నాయి:
ఇంజన్ |
1.2-లీటర్ 3-సిలిండర్ Z సిరీస్ పెట్రోల్ ఇంజన్ |
1.2-లీటర్ 3-సిలిండర్ Z సిరీస్ పెట్రోల్+CNG |
పవర్ |
82 PS |
70 PS |
టార్క్ |
112 Nm |
102 Nm |
ట్రాన్స్‌మిషన్ |
5-స్పీడ్ MT, 5-స్పీడ్ AMT |
5-స్పీడ్ MT |
క్లెయిమ్ చేసిన ఇంధన సామర్థ్యం |
24.79 kmpl (MT), 25.71 kmpl (AMT) |
33.73 km/kg |
ధర శ్రేణి మరియు ప్రత్యర్థులు
2024 మారుతి డిజైర్ టాటా టిగోర్ మరియు హ్యుందాయ్ ఆరాతో పోటీపడుతుంది. ఇది కాకుండా, ఇది కొత్త తరం-హోండా అమేజ్‌తో కూడా పోటీపడుతుంది. మారుతి తన డిజైర్ కారును సబ్‌స్క్రిప్షన్ బేసిస్ కింద నెలకు రూ. 18,248 ప్రారంభ ధరకు అందిస్తోంది. రిజిస్ట్రేషన్, మైంటెనెన్స్, ఇన్సురెన్స్ మరియు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లో చేర్చబడ్డాయి.
ఆటోమొబైల్ ప్రపంచం నుండి తక్షణ అప్‌డేట్‌లను పొందడానికి కార్దెకో వాట్సాప్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి.
మరింత చదవండి: మారుతి డిజైర్ AMT
0 out of 0 found this helpful