2024 Hyundai Creta New vs Old: ప్రధాన వ్యత్యాసాల వివరణ
హ్యుందాయ్ క్రెటా యొక్క డిజైన్ మరియు క్యాబిన్ నవీకరించబడ్డాయి, అంతేకాక ఇందులో మరెన్నో కొత్త ఫీచర్లను అందించారు.
హ్యుందాయ్ క్రెటా ఎట్టకేలకు ఫేస్ లిఫ్ట్ భారతదేశంలో విడుదల అయింది. హ్యుందాయ్ ఈ SUV కారుకు అనేక ప్రధాన నవీకరణలు చేశారు. రెండవ తరం క్రెటా విడుదల అయిన మూడు సంవత్సరాల తరువాత మొదటిసారి నవీకరించబడింది. ఈ కాంపాక్ట్ SUV కారులో ఏం నవీకరణలు జరిగాయో ఇక్కడ చూడండి:
ఫ్రంట్
2020 లో విడుదల అయిన ప్రీ-ఫేస్ లిఫ్ట్ మోడల్ తో పోలిస్తే 2024 క్రెటా ఫ్రంట్ డిజైన్ చాలా కొత్తగా ఉంటుంది. ముందు భాగంలో హ్యుందాయ్ వెన్యూను పోలిన కొత్త డిజైన్ గ్రిల్ (హ్యుందాయ్ వెన్యూలో మాదిరిగానే) లభిస్తుంది. అంతే కాకుండా ఇందులో వెడల్పాటి DRLలు మరియు నిలువు లేఅవుట్లో దీర్ఘచతురస్రాకార హెడ్లైట్లు ఉన్నాయి. దీని ఫ్రంట్ బంపర్ ఇప్పుడు మరింత పవర్ ఫుల్ గా కనిపిస్తుంది.
ఇది కూడా చూడండి: 5 చిత్రాలలో వివరించబడిన కొత్త హ్యుందాయ్ క్రెటా E బేస్ వేరియంట్
మరోవైపు, పాత క్రెటా (ప్రీ-ఫేస్ లిఫ్ట్ వెర్షన్), ముందు ప్రొఫైల్ లో మరింత కర్వ్డ్ డిజైన్ లో ఉంటుంది, దీని షార్ప్ లైన్స్ బానెట్ పై వరకు ఉంటాయి. త్రిభుజాకార హెడ్ ల్యాంప్ యూనిట్ లో మల్టీ పార్ట్ LED DRLలు ఉండగా, బంపర్ మరియు స్కిడ్ ప్లేట్ సన్నగా ఉన్నాయి.
సైడ్
సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే ఇక్కడ పెద్దగా మార్పులు చేయలేదు. కొత్త హ్యుందాయ్ క్రెటా యొక్క బాహ్య లేఅవుట్ మునుపటి మాదిరిగానే ఉంటుంది. విండో లైన్లు మునుపటి మాదిరిగానే ఉంటాయి. క్రెటా ఫేస్ లిఫ్ట్ కూడా ప్రీ-ఫేస్ లిఫ్ట్ మోడల్ మాదిరిగానే C-పిల్లర్ ఫినిషింగ్ ను పొందుతుంది.
ఇందులో కొన్ని మార్పులు చేశారు. 17-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, దీని డిజైన్ సరికొత్తగా మారింది. ఇది ఇప్పుడు వృత్తాకార ఫ్యూయల్ క్యాప్ మూతకు బదులుగా చతురస్రాకార ఫ్యూయల్ క్యాప్ మూతను పొందుతుంది.
రేర్
క్రెటా వెనుక డిజైన్ మునుపటి కంటే కొత్తగా ఉంటుంది. ముందు భాగం మాదిరిగానే వెనుక కూడా స్ట్రెయిట్ లైన్స్ ఉంటాయి. ఇక్కడ అతిపెద్ద మార్పు కనెక్టెడ్ LED టెయిల్ లైట్లు, ఇవి మునుపటి వెర్షన్‌లో టెయిల్‌ల్యాంప్‌లు ప్రీ-ఫేస్‌లిఫ్ట్ హెడ్‌లైట్లు మరియు DRLల స్ప్లిట్ డిజైన్‌ను ప్రతిబింబిస్తాయి.
ఇది కూడా చదవండి: 2024 హ్యుందాయ్ క్రెటా భారతదేశంలో తదుపరి N లైన్ మోడల్ కావచ్చు
కొత్త క్రెటా SUV వెనుక భాగంలో రీడిజైన్ చేయబడిన బంపర్ తో పాటు స్కిడ్ ప్లేట్ కూడా లభిస్తుంది.
డాష్బోర్డ్
2024 హ్యుందాయ్ క్రెటా యొక్క డ్యాష్ బోర్డ్ మునుపటి కంటే కొత్తగా కనిపిస్తుంది. క్యాబిన్ లోపల, డ్యూయల్-టోన్ బ్లాక్ మరియు గ్రే కలర్ థీమ్తో లేయర్డ్ ఎలిమెంట్లు ఉంటాయి. ప్రీ-ఫేస్ లిఫ్ట్ క్రెటా యొక్క క్యాబిన్ రెండు కలర్ థీమ్ లలో ఉంటుంది: ఆల్ బ్లాక్ మరియు బీజ్ తో బ్లాక్.
కొత్త హ్యుందాయ్ క్రెటా కారులో అతిపెద్ద మార్పు కొత్త స్క్రీన్ సెటప్. పాత క్రెటా కారులో 10.25 అంగుళాల టచ్స్క్రీన్ మరియు 7-అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండేది, ఇప్పుడు దాని స్థానంలో డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ 10.25-అంగుళాల డిస్‌ప్లే (టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే) వచ్చింది.
హ్యుందాయ్ యొక్క కొత్త SUVలో కొత్త సెంటర్ కన్సోల్ కూడా లభిస్తుంది, ఇది ఇప్పుడు గ్లాస్ బ్లాక్ ఫినిష్ మరియు డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ కోసం కొన్ని నియంత్రణలను పొందుతుంది.
సీట్లు
2024 క్రెటా సీట్లు కూడా రీడిజైన్ చేయబడ్డాయి. ప్రీ-ఫేస్ లిఫ్ట్ క్రెటా SUV లో క్యాబిన్ థీమ్ ప్రకారం బ్లాక్ మరియు బీజ్ కలర్ సీట్లు ఉండేవి, కొత్త క్రెటాలో డ్యూయల్-టోన్ బ్లాక్ మరియు గ్రే లెదర్ సీట్లు ఉన్నాయి.
వెనుక సీట్లలో కూడా ఫ్రంట్ సీట్ల ట్రీట్ మెంట్ లభిస్తుంది.
ఈ కారులో ఇప్పటికీ పనోరమిక్ సన్ రూఫ్ లభిస్తుంది. ఇందులో ఉన్న లైట్ కలర్ క్యాబిన్ థీమ్ కారణంగా ఇది ప్రీ-ఫేస్ లిఫ్ట్ మోడల్ కంటే దీని క్యాబిన్ మరింత ఓపెన్ గా కనిపిస్తుంది.
ధర
ఎక్స్-షోరూమ్ ధర |
|
2024 హ్యుందాయ్ క్రెటా |
ప్రీ-ఫేస్ లిఫ్ట్ హ్యుందాయ్ క్రెటా |
రూ.11 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు |
రూ.10.87 లక్షల నుంచి రూ.19.20 లక్షలు |
హ్యుందాయ్ క్రెటా టాప్ వేరియంట్ ధర రూ.80,000, బేస్ వేరియంట్ ధర రూ.13,000 పెరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇవి కొత్త హ్యుందాయ్ క్రెటా యొక్క ప్రారంభ ధరలు, రాబోయే నెలల్లో వీటి ధరలు పెరగనున్నాయి. 2024 క్రెటా స్పెసిఫికేషన్లు, వేరియంట్ల వారీగా ధర మరియు ఫీచర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
మరింత చదవండి: క్రెటా ఆన్ రోడ్ ధర