భారతదేశంలో తదుపరి N లైన్ మోడల్ కానున్న 2024 Hyundai Creta
హ్యుందాయ్ క్రెటా కోసం rohit ద్వారా జనవరి 18, 2024 02:54 pm ప్రచురించబడింది
- 1.8K Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
కొత్త క్రెటాలో పంచీ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఎంపికను తిరిగి తీసుకువచ్చారు, కానీ డిజైన్ మరియు ట్రాన్స్మిషన్ ఎంపికలలో కొన్ని లోపాలు ఉన్నాయి. హ్యుందాయ్ వాటిని SUV యొక్క N లైన్ వెర్షన్ కోసం రిజర్వ్ చేస్తున్నారని మేము భావిస్తున్నాము.
2024 హ్యుందాయ్ క్రెటా పనితీరు పరంగా సెగ్మెంట్ లీడర్గా మారింది. అప్డేటెడ్ డిజైన్ ఇన్సైడ్-అవుట్ మరియు 160 PS 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపికతో పాటు కొత్త డిజైన్, కొత్త ఫీచర్లతో దీన్ని పరిచయం చేశారు. కియా సెల్టోస్ మాదిరిగా కాకుండా, హ్యుందాయ్ క్రెటా టర్బో-పెట్రోల్ వెర్షన్ లో ఎటువంటి దృశ్య వ్యత్యాసాలను కనిపించవు. అయితే, టర్బో-పెట్రోల్ ఇంజన్ టాప్ మోడల్ కు మాత్రమే పరిమితం చేయబడింది. క్రెటా N లైన్ మోడల్ రూపంలో ఈ పంచీ పవర్ట్రెయిన్ తో కంపెనీ త్వరలో అనేక కొత్త వేరియంట్ల ఎంపికలను అందించవచ్చని మేము భావిస్తున్నాము.
మా నమ్మకానికి కారణం ఏమిటి?
-
ఔత్సాహికుల కోసం మాన్యువల్ ఎంపిక
రిఫరెన్స్ కొరకు హ్యుందాయ్ వెర్నా యొక్క టర్బో-మాన్యువల్ కాంబో చిత్రం ఉపయోగించబడింది.
క్రెటా N లైన్ ను భారతదేశంలో విడుదల చేయవచ్చని మేము అనుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కొత్త క్రెటా టర్బో-పెట్రోల్ ఇంజన్ తో 7-స్పీడ్ DCT గేర్ బాక్స్ తో మాత్రమే లభిస్తుంది. అయితే వెర్నా మరియు అల్కాజార్ కూడా అదే ఇంజన్ తో 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఎంపికతో అందించబడుతుంది. ఈ ట్రాన్స్ మిషన్ ను క్రెటా N లైన్ లో ఇవ్వవచ్చు.
-
మరింత ప్రాప్యత
రెండవ కారణం ప్రస్తుతం హ్యుందాయ్ క్రెటాలోని టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఫుల్ ఫీచర్ లోడెడ్ SX (O) వేరియంట్లో మాత్రమే లభిస్తుంది, దీని ధర రూ. 20 లక్షలు. ఈ ఇంజిన్ తో క్రెటా N లైన్ ను విడుదల చేయవచ్చని మేము నమ్ముతున్నాము, ఇది వినియోగదారులకు టర్బో ఇంజిన్లతో అనేక వేరియంట్ల ఎంపికలను ఇస్తుంది. వెన్యూ, వెన్యూ N లైన్ లలో కూడా ఇలాంటిదే కనిపిస్తుంది.
-
డిజైన్ అప్‌గ్రేడ్‌లు
ప్రీ-ఫేస్ లిఫ్ట్ క్రెటాను టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ తో అందించినప్పుడు, ఇది సాధారణ మోడల్ నుండి భిన్నంగా ఉండటానికి క్యాబిన్ మరియు ఎగ్జాస్ట్ పై కలర్ హైలైట్స్ ఇవ్వబడింది. అయితే, కొత్త క్రెటా యొక్క టర్బో వేరియంట్లలో అటువంటి కొన్ని అప్‌గ్రేడ్‌లు ఇవ్వబడలేదు. క్రెటా N లైన్ లో కాస్మోటిక్ అప్‌గ్రేడ్‌లు, 'N లైన్' బ్యాడ్జింగ్, బ్రేక్ క్లిప్పర్స్ తో కూడిన స్పోర్టీ అల్లాయ్ వీల్స్, బ్లాక్ క్యాబిన్ మరియు డ్యూయల్ ఎగ్జాస్ట్ లు ఉంటాయి, ఇవి ప్రామాణిక మోడల్ కు భిన్నంగా ఉంటాయి.
-
క్రెటా N లైన్ అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉంది.
రిఫరెన్స్ కోసం బ్రెజిల్-స్పెక్ హ్యుందాయ్ క్రెటా N లైన్ చిత్రం ఉపయోగించబడింది.
క్రెటా SUV N లైన్ మోడల్ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో అమ్మకానికి అందుబాటులో ఉంది. హ్యుందాయ్ క్రెటా N లైన్ ప్రస్తుతం కొన్ని దక్షిణ అమెరికా మార్కెట్లలో విక్రయించబడుతోంది (ఇండియా-స్పెక్ అవతారంలో కానప్పటికీ), ఇది స్పోర్టియర్ వెర్షన్ లో కూడా ఇక్కడ కూడా విడుదల కావచ్చని మేము భావిస్తున్నాము.
ఇది కూడా చూడండి: హ్యుందాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్ vs కియా సెల్టోస్: మైలేజ్ పోలిక
పవర్ట్రైన్ వివరాలు
2024 హ్యుందాయ్ క్రెటా N లైన్ అదే 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ (160 PS/ 253 Nm) ఇంజిన్తో ప్రామాణిక మోడల్గా లభిస్తుంది, ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ DCT (డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్) ఎంపికతో అందించబడే అవకాశం ఉంది. ప్రామాణిక క్రెటాలో మరో రెండు ఇంజన్ ఎంపికలు ఉన్నాయి. N లైన్ వెర్షన్ యొక్క సస్పెన్షన్ ను నవీకరించవచ్చు, తద్వారా దాని హ్యాండ్లింగ్ సాధారణ మోడల్ కంటే పదునైనదిగా ఉంటుంది.
ఆశించిన ధర మరియు విడుదల తేదీ
హ్యుందాయ్ క్రెటా N లైన్ రాబోయే కొన్ని నెలల్లో విడుదల అయ్యే అవకాశం ఉంది, దీని ధర రూ. 17.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఇది కియా సెల్టోస్ GTX+ మరియు X-లైన్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. స్కోడా కుషాక్, వోక్స్వాగన్ టైగూన్ మరియు MG ఆస్టర్ లకు స్పోర్టీ ప్రత్యామ్నాయంగా కూడా దీనిని కొనుగోలు చేయవచ్చు.
మరింత చదవండి : క్రెటా డీజిల్
0 out of 0 found this helpful