అక్టోబర్ 6 నుండి బుకింగ్స్ ప్రారంభంకానున్న 2023 Tata Safari Facelift, టీజర్ విడుదల

టాటా సఫారి కోసం rohit ద్వారా అక్టోబర్ 05, 2023 04:21 pm ప్రచురించబడింది

  • 499 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

అక్టోబర్ 6 నుండి బుకింగ్స్ ప్రారంభంకానున్న 2023 టాటా సఫారీ ఫేస్ లిఫ్ట్ టీజర్ విడుదల

Tata Safari facelift teased

  • 2021 ప్రారంభంలో విడుదలైన మూడవ తరం సఫారీ, దాని మొదటి పెద్ద నవీకరణ పొందనుంది.

  • అక్టోబర్ 6 నుంచి నవీకరించిన ఈ SUV బుకింగ్లు ప్రారంభం కానున్నాయి.

  • ఇందులో స్ప్లిట్ LED హెడ్లైట్లు, పొడవైన LED DRL, కొత్త 19 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి.

  • క్యాబిన్లో పెద్ద టచ్స్క్రీన్ మరియు బ్యాక్లిట్ టాటా లోగోతో కొత్త 2-స్పోక్ స్టీరింగ్ వీల్ లభిస్తుంది.

  • డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఆరు ఎయిర్బ్యాగులు, ADAS వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.

  • ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది.

  • ప్రస్తుత మోడల్ కంటే ప్రీమియం ధర ఎక్కువ ఉండవచ్చు, సఫారీ ధర ప్రస్తుతం రూ .15.85 లక్షల నుండి రూ .25.21 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ఉంది.

టాటా హారియర్ ఫేస్ లిఫ్ట్ తో పాటు నవీకరించిన 3-రో SUV టీజర్ ను కార్ల తయారీ సంస్థ విడుదల చేయడంతో, టాటా సఫారీ ఫేస్ లిఫ్ట్ త్వరలోనే విడుదల అవుతున్నట్టు తెలుస్తోందో. టాటా సఫారీ బుకింగ్స్ అక్టోబర్ 6 నుంచి ప్రారంభంకానున్నాయి.

టీజర్ లో ఏం కనిపించింది?

టీజర్ చూసినట్లయితే, ఈ SUV యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ లో కొన్ని మార్పులు జరిగినట్టు అలాగే టాటా హారియర్ ఫేస్ లిఫ్ట్ లో కూడా ఇలాంటి కొన్ని నవీకరణలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్సర్ట్స్, స్లీక్ ఇండికేటర్, బానెట్ వెడల్పు వరకు విస్తరించిన LED DRL స్ట్రిప్, కొత్త టాటా నెక్సాన్ మరియు టాటా నెక్సాన్ EV మాదిరిగా వర్టికల్ స్టాక్డ్ స్ప్లిట్ LED హెడ్లైట్లతో కొత్త గ్రిల్ లభిస్తుంది.

టీజర్ లో సైడ్ మరియు రేర్ గురించి గ్లింప్స్ ఇవ్వనప్పటికీ, కొంతకాలం క్రితం టెస్టింగ్ సమయంలో కనిపించిన కొత్త సఫారీలో పెద్ద 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, డైనమిక్ టర్న్ ఇండికేటర్లు మరియు కనెక్టెడ్ LED టెయిల్ లైట్లు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: 2023 టాటా హారియర్ ఫేస్ లిఫ్ట్ ఫస్ట్ టీజర్ విడుదలైంది, అక్టోబర్ 6 నుండి బుకింగ్లు ప్రారంభంకానున్నాయి

క్యాబిన్ లో నవీకరణలు ఉండనున్నాయి

Tata Safari cabin

 రిఫరెన్స్ కోసం, సఫారీ యొక్క ప్రస్తుత వెర్షన్ లోని క్యాబిన్ చిత్రం ఇవ్వబడింది

టాటా సఫారీ SUV యొక్క క్యాబిన్ వివరాలు ఇంకా వెల్లడించనప్పటికీ, క్యాబిన్ లో కూడా నవీకరణలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టాటా కొత్త సఫారీలో కొత్త డ్యాష్ బోర్డ్ మరియు నెక్సాన్ ఈవీ వంటి బ్యాక్ లిట్ టాటా లోగోతో కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ ను అందించాలని భావిస్తున్నారు. 

 కొత్త టాటా సఫారీ క్యాబిన్లో పెద్ద టచ్స్క్రీన్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ మరియు రెండవ వరుస సీట్లు (రెండవది 6-సీట్ల వెర్షన్లో మాత్రమే), పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, క్రూయిజ్ కంట్రోల్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ మరియు ఆటో క్లైమేట్ కంట్రోల్ అందించాలని కార్ల తయారీ సంస్థ భావిస్తున్నారు. సఫారీలో ఆరు ఎయిర్ బ్యాగులు, 360 డిగ్రీల ఫోన్ కెమెరా, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, అడాప్టివ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఉండనున్నాయి.

హుడ్ కింద ఏమి ఉంటుంది?

Tata Safari facelift grille

టాటా 3-రో SUVలో అదే 2-లీటర్ డీజల్ ఇంజన్ (170PS/350Nm) 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో జతచేయబడుతుంది. ఇది టాటా యొక్క కొత్త 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్తో పనిచేస్తుంది, ఇది 170PS శక్తిని మరియు 280Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ తో మాన్యువల్ మరియు DCT గేర్ బాక్స్ ఆప్షన్లను చూడవచ్చు.

ఇది కూడా చదవండి: 360 డిగ్రీల కెమెరాతో 10 అత్యంత సరసమైన కార్లు: మారుతి బాలెనో, టాటా నెక్సాన్, కియా సెల్టోస్ మరియు ఇతరులు

ధర మరియుప్రత్యర్థులు

ఫేస్ లిఫ్టెడ్ సఫారీ ఈ నవంబర్ లో షోరూమ్ లకు రావచ్చు. ప్రస్తుత మోడల్ కంటే ప్రీమియం ధర ఎక్కువ ఉండవచ్చు, సఫారీ ధర ప్రస్తుతం రూ .15.85 లక్షల నుండి రూ .25.21 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ఉంది. కొత్త సఫారీ MG హెక్టర్ ప్లస్, మహీంద్రా XUV700 మరియు హ్యుందాయ్ అల్కాజార్ లతో పోటీపడుతుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన టాటా సఫారి

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience