2023 Tata Harrier Facelift మొదటి టీజర్ విడుదల, అక్టోబర్ 6న ప్రారంభం కానున్న బుకింగ్ؚలు
టాటా హారియర్ కోసం rohit ద్వారా అక్టోబర్ 04, 2023 05:58 pm సవరించబడింది
- 399 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
టీజర్‌లో టాటా హ్యారియర్ స్ప్లిట్ LED హెడ్ؚలైట్ సెట్అప్ మరియు SUV ముందు భాగం వెడల్పు అంతటా ఉన్న పొడిగించిన LED DRL స్ట్రిప్ కనిపించాయి
-
2019లో ఆవిష్కరించినప్పటి నుండి హ్యారియర్ పొందిన మొదటి భారీ నవీకరణ ఇది.
-
హ్యారియర్ ఫేస్ؚలిఫ్ట్ బుకింగ్ؚలను టాటా అక్టోబర్ 6 నుండి ప్రారంభించనుంది.
-
కొత్త అలాయ్ వీల్స్ సెట్, డైనమిక్ టర్న్ ఇండికేటర్‌లు మరియు కనెక్టెడ్ LED టెయిల్‌లైట్ؚలతో వస్తుంది.
-
క్యాబిన్ అప్ؚడేట్ؚలలో భారీ టచ్ؚస్క్రీన్ మరియు 2-స్పోక్ؚల స్టీరింగ్ వీల్ ఉండవచ్చు.
-
ఇందులో ఉన్న ఫీచర్‌లలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ؚలు, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే మరియు ADAS ఉన్నాయి.
-
పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలు రెండిటితో అందించవచ్చు.
-
హ్యారియర్ ఫేస్ؚలిఫ్ట్ؚను టాటా నవంబర్ؚలో విడుదల చేయవచ్చు, ధరలు రూ. 15 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయని అంచనా.
టాటా హ్యారియర్ ఫేస్ؚలిఫ్ట్ త్వరలోనే విడుదల కానుంది. ఈ కారు తయారీదారు నవీకరించిన SUV మొదటి టీజర్ؚను విడుదల చేయడం ద్వారా ఇది నిర్ధారించారు, దీని బుకింగ్ؚలు కూడా అక్టోబర్ 6 నుండి ప్రారంభం అవుతాయని వెల్లడించారు.
టీజర్ؚలో కనిపించిన వివరాలు
ఇది టీజర్ వీడియోలో నవీకరించిన SUV ముందు భాగం కొంత సేపు మాత్రమే కనిపించింది. సవరించిన మరియు నిలువుగా అమర్చిన స్టాక్డ్ స్ప్లిట్ LED హెడ్ؚలైట్ సెట్అప్, నాజూకైన గ్రిల్ మరియు ఇండికేటర్ؚలు, బోనెట్ అంతటా ఉన్న కొత్త LED DRL స్ట్రిప్ؚలను చూడవచ్చు. ఈ నవీకరణలు అన్నీ కొత్త టాటా నెక్సాన్ మరియు టాటా నెక్సాన్ EVలకు చేసిన మార్పులకు అనుగుణంగా ఉన్నాయి.
దీని ప్రొఫైల్ మరియు వెనుక భాగం టీజర్ؚలో చూపించలేదు. మునుపటి టెస్ట్ మోడల్‌లో కొత్త అలాయ్ వీల్స్ సెట్, డైనమిక్ టర్న్ ఇండికేటర్‌లు మరియు కనెక్టెడ్ LED టెయిల్‌లైట్లు ఉండటాని చూడవచ్చు.
మరిన్ని క్యాబిన్ నవీకరణలను పొందింది
ప్రస్తుతానికి టాటా కొత్త హ్యారియర్ క్యాబిన్ؚను ఇంకా చూపించలేదు, కానీ ఇది పునరుద్ధరించిన హ్యారియర్ క్యాబిన్ؚ విధంగా ఉంటుందని భావిస్తున్నాము. మార్పులలో రీడిజైన్ చేసిన డ్యాష్ؚబోర్డు మరియు బ్యాక్-లిట్ టాటా లోగోతో కొత్త 2-స్పోక్ؚల స్టీరింగ్ వీల్ ఉండవచ్చు.
దీనిలో అందిస్తున్న కొత్త ఫీచర్‌లలో భారీ టచ్ؚస్క్రీన్ సిస్టమ్, పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్ లెస్ ఫోన్ ఛార్జింగ్, ఆటో క్లైమేట్ కంట్రోల్ మరియు క్రూయిజ్ కంట్రోల్ ఉండవచ్చు.
ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), 360-డిగ్రీ కెమెరా మరియు అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ؚలు (ADAS) ప్రయాణీకుల భద్రతను చూసుకుంటాయి.
ఇది కూడా పరిశీలించండి: రహస్య చిత్రాలలో మళ్ళీ కనిపించిన టాటా పంచ్, వెల్లడైన కొత్త వివరాలు
పెట్రోల్ పవర్ؚట్రెయిన్ؚను కూడా పొందుతుంది
టాటా హ్యారియర్ ఫేస్ؚలిఫ్ట్ కొత్త 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (170PS/280Nm)తో వస్తుందని అంచనా. మాన్యువల్ మరియు DCT ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్‌లతో అందించబడుతుందని భావిస్తున్నాము.
దీని ప్రస్తుత 2-లీటర్‌ల డీజిల్ యూనిట్ (170PS/350Nm) కూడా నవీకరణను పొందవచ్చు. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ ఎంపికలు రెండిటినీ కొనసాగించవచ్చు.
ఇది ఎప్పుడు విడుదల అవుతుంది?
నవీకరించిన హ్యారియర్ ను కారు తయారీదారు నవంబర్ 2023న విడుదల చేస్తారని భావిస్తున్నాము. ప్రస్తుత మోడల్ ధర కంటే దీని ధర కొంత ఎక్కువ ఉండవచ్చు, ప్రస్తుత మోడల్ ధర రూ. 15.20 లక్ష్ల నుండి రూ. 24.27 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకు ఉంది. టాటా హ్యారియార్ ఫేస్ؚలిఫ్ట్ మహీంద్రా XUV700, MG హెక్టార్, జీప్ కంపాస్ మరియు హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ హ్యారియర్ వేరియెంట్ లతో పోటీ పడుతుంది.
ఇక్కడ మరింత చదవండి: టాటా హ్యారియర్ డీజిల్