2023 Tata Nexon క్రియేటివ్ vs టాటా నెక్సాన్ క్రియేటివ్ ప్లస్: వేరియంట్ల పోలిక

టాటా నెక్సన్ కోసం ansh ద్వారా సెప్టెంబర్ 29, 2023 01:08 pm ప్రచురించబడింది

 • 98 సమీక్షలు
 • ఒక వ్యాఖ్యను వ్రాయండి

నెక్సాన్ క్రియేటివ్ అనేది టాటా SUV యొక్క ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికల కోసం అందించబడిన దిగువ శ్రేణి వేరియంట్.

2023 Tata Nexon

 • టాటా నెక్సాన్ స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్ మరియు ఫియర్‌లెస్ అనే నాలుగు వేర్వేరు వేరియంట్‌లలో లభిస్తుంది.

 • రెండు ఇంజన్ ఎంపికలను పొందుతుంది: అవి వరుసగా 120PS, 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ మరియు రెండవది 115PS, 1.5-లీటర్ డీజిల్ యూనిట్.

 • ఇది రెండు ఇంజన్‌లతో కూడిన ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలకు దిగువ శ్రేణి ఎంపిక.

 • ఫీచర్ల జాబితాలో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు (ప్రామాణికంగా) మరియు 360-డిగ్రీ కెమెరా వంటి అంశాలు ఉన్నాయి.

 • నెక్సాన్ క్రియేటివ్ వేరియంట్‌ల ధర రూ. 11 లక్షల నుండి రూ. 14.30 లక్షల వరకు ఉంది (పరిచయ, ఎక్స్-షోరూమ్).

ఇటీవల ప్రారంభించబడిన టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ కొత్త డిజైన్ ను అలాగే అనేక ఫీచర్ అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది. ఇది 4 వేర్వేరు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది, వీటిని టాటా పర్సోనాస్ అని పిలుస్తుంది మరియు ప్రతి ఒక్కటి, ఉప-వేరియంట్‌లతో లభిస్తుంది. నెక్సాన్ SUVతో అందించబడిన పెట్రోల్ మరియు డీజిల్ పవర్‌ట్రెయిన్‌ల పూర్తి పరిధిని, మధ్య శ్రేణి క్రియేటివ్ పర్సోనా పొందుతుంది. ఇది ఇంకా మూడు వేరియంట్‌లుగా విభజించబడింది: అవి వరుసగా క్రియేటివ్, క్రియేటివ్+ మరియు క్రియేటివ్+ S, ఇవి వాటి లక్షణాల జాబితా పరంగా బిన్నంగా ఉంటాయి. ఇక్కడ, మేము మూడు నెక్సాన్ క్రియేటివ్ వేరియంట్‌లను పోల్చి చూసాము.

ఎక్స్టీరియర్

2023 Tata Nexon Sequential LED DRLs

వేరియంట్

క్రియేటివ్

క్రియేటివ్+ (క్రియేటివ్ వేరియంట్ లో కంటే అధికంగా)

క్రియేటివ్+ s (క్రియేటివ్ + వేరియంట్ లో కంటే అధికంగా)

 

ముఖ్యాంశాలు

 • ద్వి-ఫంక్షనల్ LED హెడ్‌ల్యాంప్‌లు

 • సీక్వెన్షియల్ LED DRLలు

 • కారు రంగు బంపర్స్

 • కారు రంగు డోర్ హ్యాండిల్స్

 • రూఫ్ రైల్స్

 • కనెక్టెడ్ టెయిల్స్ ల్యాంప్స్

 • 16-అంగుళాల అల్లాయ్ వీల్స్

 • ఏవీ లేవు

 • ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ (వాయిస్ అసిస్టెడ్)

ఓవరాల్ లుక్ విషయానికి వస్తే, మూడు వేరియంట్లు దాదాపు ఒకే విధంగా కనిపిస్తాయి. ముందు, సైడ్ మరియు వెనుక ప్రొఫైల్‌లు ఒకే డిజైన్ ఎలిమెంట్‌లను కలిగి ఉంటాయి, అయితే నెక్సాన్ క్రియేటివ్+ S వేరియంట్ ఇతర రెండు వేరియంట్‌లతో పోలిస్తే అదనంగా ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ను పొందుతుంది, వేరియంట్ పేరులో ఉన్న “S” అంటే ఇదే.

ఇంటీరియర్

2023 Tata Nexon Steering Wheel

వేరియంట్

క్రియేటివ్

క్రియేటివ్+ (క్రియేటివ్ వేరియంట్ లో కంటే అధికంగా)

క్రియేటివ్+ s (క్రియేటివ్ + వేరియంట్ లో కంటే అధికంగా)

ముఖ్యాంశాలు

 • డ్యూయల్ టోన్ క్యాబిన్

 • ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో 2-స్పోక్ స్టీరింగ్ వీల్

 • డోర్ హ్యాండిల్స్‌పై క్రోమ్ ఇన్‌సర్ట్‌లు

 • ఫాబ్రిక్ అప్హోల్స్టరీ

 • లెదర్ గేర్ నాబ్

 • వేరియంట్-నిర్దిష్ట డాష్‌బోర్డ్ ఇన్‌సర్ట్‌లు

 • వెనుక పార్శిల్ ట్రే

 • ఏవీ లేవు

ఎక్ట్సీరియర్ లాగానే, మూడు వేరియంట్ల ఇంటీరియర్ కూడా ఒకేలా ఉంటుంది. మీరు మూడు టాటా నెక్సాన్ క్రియేటివ్ వేరియంట్‌లలో డ్యూయల్-టోన్ క్యాబిన్, ఫాబ్రిక్ సీట్లు మరియు లెదర్ టచ్‌ని పొందుతారు, అయితే క్రియేటివ్+ నుండి, మీరు వెనుక పార్శిల్ ట్రేని కూడా పొందుతారు. మీరు వేరియంట్ కోసం -ఎక్స్‌క్లూజివ్ ఓషన్ బ్లూ ఎక్స్‌టీరియర్ కలర్‌లో పొందినట్లయితే, దానికి సరిపోలే డ్యాష్‌బోర్డ్ ఇన్‌సర్ట్‌లను కూడా పొందుతారు.

లక్షణాలు

2023 Tata Nexon 10.25-inch Touchscreen Infotainment System

వేరియంట్

క్రియేటివ్

క్రియేటివ్+ (క్రియేటివ్ వేరియంట్ లో కంటే అధికంగా)

క్రియేటివ్+ s (క్రియేటివ్ + వేరియంట్ లో కంటే అధికంగా)

ముఖ్యాంశాలు

 • 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

 • వైర్డు ఆండ్రాయిడ్ ఆటో & యాపిల్ కార్‌ప్లే

 • 7-అంగుళాల సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే

 • 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్

 • టచ్ నియంత్రణలతో ఆటో AC

 • ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు

 • కూల్డ్ గ్లోవ్‌బాక్స్

 • ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ ORVMలు

 • వెనుక AC వెంట్లు

 • పుష్ బటన్ స్టార్ట్-స్టాప్

 • పాడిల్ షిఫ్టర్‌లు (ఆటోమేటిక్ వేరియంట్‌లు)

 • 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

 • వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లే

 • ఆటో ఫోల్డింగ్ ORVMలు

 • ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు

 • క్రూయిజ్ నియంత్రణ

 • రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు

 • ఎత్తు సర్దుబాటు చేయగల ఫ్రంట్ సీట్‌బెల్ట్

ఇక్కడ, మూడింటి మధ్య వ్యత్యాసం మరింత ముఖ్యమైనది. నెక్సాన్ క్రియేటివ్+ వేరియంట్ నుండి, మీరు వైర్‌లెస్ కనెక్టివిటీని పొందడమే కాకుండా మరింత సౌలభ్యం అలాగే సౌకర్యవంతమైన ఫీచర్‌లతో పెద్ద టచ్‌స్క్రీన్‌ను పొందుతారు. అయితే, క్రియేటివ్+ S వేరియంట్, క్రియేటివ్+ వేరియంట్‌ కంటే అదనంగా ఒకే ఒక ఫీచర్‌ను మాత్రమే పొందుతుంది.

భద్రత

2023 Tata Nexon Airbag

వేరియంట్

క్రియేటివ్

క్రియేటివ్+ (క్రియేటివ్ వేరియంట్ లో కంటే అధికంగా)

క్రియేటివ్+ s (క్రియేటివ్ + వేరియంట్ లో కంటే అధికంగా)

ముఖ్యాంశాలు

 • 6 ఎయిర్‌బ్యాగ్‌లు

 • EBDతో ABS

 • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC)

 • టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS)

 • హిల్ హోల్డ్ అసిస్ట్

 • ట్రాక్షన్ కంట్రోల్

 • యాంటీ-గ్లేర్ IRVM

 • వెనుక పార్కింగ్ కెమెరా

 • పైన మౌంట్ చేయబడిన వెనుక వైపర్ మరియు వాషర్

 • ఆటో-డిమ్మింగ్ IRVM

 • ముందు పార్కింగ్ సెన్సార్లు

 • 360-డిగ్రీ కెమెరా

 • బ్లైండ్ వ్యూ మానిటర్

 • ఏవీ లేవు

భద్రత పరంగా అన్ని వేరియంట్‌లు- 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి ముఖ్యమైన భద్రతా లక్షణాలను పొందుతాయి, అయితే క్రియేటివ్+ వేరియంట్ నుండి, మీరు 360-డిగ్రీ కెమెరా ప్రయోజనాన్ని కూడా అదనంగా పొందవచ్చు.

ధర

2023 Tata Nexon

వేరియంట్

క్రియేటివ్

క్రియేటివ్+ 

క్రియేటివ్+ s 

పెట్రోల్ MT

రూ.11 లక్షలు

రూ.11.70 లక్షలు

రూ.12.20 లక్షలు

పెట్రోల్ AMT

రూ.11.70 లక్షలు

రూ.12.40 లక్షలు

రూ.12.90 లక్షలు

పెట్రోల్ DCT

రూ.12.20 లక్షలు

రూ.12.90 లక్షలు

రూ.13.40 లక్షలు

డీజిల్ MT

రూ.12.40 లక్షలు

రూ.13.10 లక్షలు

రూ.13.60 లక్షలు

డీజిల్ AMT

రూ.13 లక్షలు

రూ.13.80 లక్షలు

రూ.14.30 లక్షలు

* అన్ని ధరలు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ

టాటా నెక్సాన్ క్రియేటివ్ వేరియంట్ రూ. 11 లక్షల నుండి మొదలై రూ. 14.30 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. సాధారణ క్రియేటివ్ వేరియంట్ దానికదే సంపూర్ణంగా అనేక అంశాలతో రూపొందించబడింది, అయితే మీరు పెద్ద టచ్‌స్క్రీన్ మరియు 360-డిగ్రీ కెమెరా వంటి కొత్త టాటా నెక్సాన్ యొక్క కొన్ని ముఖ్యమైన అంశాలను పొందాలనుకుంటే, మీరు రూ. 80,000 వరకు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంకా, సన్‌రూఫ్ మీకు ప్రాధాన్యత అయితే, మీరు నెక్సాన్ క్రియేటివ్+ వేరియంట్‌పై రూ. 50,000 ఎక్కువగా చెల్లించాలి.

ఇది కూడా చదవండి: 2023 టాటా నెక్సాన్ vs హోండా ఎలివేట్: స్పెసిఫికేషన్‌ల పోలిక

ఈ మూడింటి మధ్య, నెక్సాన్ క్రియేటివ్+ సాధారణ క్రియేటివ్ వేరియంట్‌ కంటే ప్రీమియంను సులభంగా సమర్థిస్తుంది మరియు ఇదే మా సిఫార్సు ఎంపికగా ఉంటుంది.

2023 టాటా నెక్సాన్ ధర రూ. 8.10 లక్షల నుండి రూ. 15.50 లక్షలు (పరిచయ, ఎక్స్-షోరూమ్) వరకు ఉంది మరియు ఇది కియా సొనెట్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి బ్రెజ్జా అలాగే మహీంద్రా XUV300 వంటి వాటికి ప్రత్యర్థిగా కొనసాగుతుంది.

మరింత చదవండి : టాటా నెక్సాన్ AMT

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన టాటా నెక్సన్

Read Full News
Used Cars Big Savings Banner

found ఏ కారు యు want నుండి buy?

Save upto 40% on Used Cars
 • quality వాడిన కార్లు
 • affordable prices
 • trusted sellers

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

కార్ వార్తలు

 • ట్రెండింగ్ వార్తలు
 • ఇటీవల వార్తలు

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

 • లేటెస్ట్
 • రాబోయేవి
 • పాపులర్
×
We need your సిటీ to customize your experience