• English
  • Login / Register

530 కిలోమీటర్‌ల మైలేజ్‌ను అందించగల వోల్వో C40 రీఛార్జ్ ఆవిష్కరణ; ఆగస్ట్ؚలో విడుదల

వోల్వో సి40 రీఛార్జ్ కోసం sonny ద్వారా జూన్ 15, 2023 07:20 pm ప్రచురించబడింది

  • 35 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఇది బాగా ప్రజాదరణ పొందిన XC40 రీఛార్జ్ తోటి వాహనంగా, అవే ఫీచర్‌లతో కానీ అధిక డ్రైవింగ్ రేంజ్ؚతో వస్తున్న ఆకర్షణీయమైన వాహనం

Volvo C40 Recharge

వోల్వో C40 రీఛార్జ్ స్వీడిష్ కారు తయారీదారు భారతదేశంలో అందిస్తున్న సరికొత్త వాహనం. ఇది ఆవృష్కరించబడింది మరియు ఆగస్ట్ؚలో అమ్మకాలు ప్రారంభమవుతాయి. ధరలు నిర్ణయించిన తరువాత బుకింగ్ؚలు మొదలవుతాయి మరియు డెలివరీలు సెప్టెంబర్ నుండి జరుగుతాయి. 

XC40 రీఛార్జ్ తరువాత, ఈ లైన్అప్ؚలో వస్తున్న రెండవ పూర్తి ఎలక్ట్రిక్ మోడల్ ఇది. C40 అనేది XC40 మోడల్ కూపే-స్టైల్ వర్షన్ అని చెప్పవచ్చు, నాజూకైనా SUV వాహనాలకు ఉన్న ప్రజాదరణను క్యాష్ చేసుకోవడానికి దీన్ని డిజైన్ చేశారు.  

పవర్ؚట్రెయిన్ వివరాలు

XC40 రీఛార్జ్‌లో ఉన్నట్లు గానే C40 రీఛార్జ్‌లో కూడా 78kWh సామర్ధ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్ؚతో వస్తుంది కానీ మరింత ఏరోడైనమిక్ డిజైన్ కారణంగా WLTP క్లెయిమ్ చేసిన 530కిమీ అధిక రేంజ్‌తో వస్తుంది. ఇందులో కూడా స్పోర్టీ డ్యూయల్-మోటార్ AWD సెట్అప్ ఉంది, ఇది 408PS పవర్ మరియు 660Nm టార్క్‌ను అందిస్తుంది. C40 రీఛార్జ్ 0-100kmph వేగాన్ని కేవలం 4.7 సెకన్‌లలో అందుకుంటుంది.

150kW ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో, ఇది బ్యాటరీని 10 నుండి 80 శాతం వరకు 27 నిమిషాలో ఛార్జ్ చేస్తుంది. 

సుపరిచితమైన క్యాబిన్ 

వోల్వో C40 రీఛార్జ్ؚకు ఎటువంటి మోడల్-ప్రత్యేక మార్పులు చేయలేదు. డ్యాష్ మధ్యలో అదే 9-అంగుళాల వర్టికల్లీ-ఓరియెంటెడ్ ఇన్ఫోటైన్ؚమెంట్ టచ్ؚస్క్రీన్ మరియు 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేతో వస్తుంది. టాప్ ఎండ్ వేరియెంట్‌లో మాత్రం పూర్తిగా ఎలక్ట్రికల్ؚగా అడ్జస్ట్ చేయగలిగిన ముందు సీట్లు (హీటెడ్ మరియు కూలింగ్ ఫంక్షన్‌తో), డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్ؚరూఫ్ మరియు ప్రీమియం హర్మన్ కర్డన్ సౌండ్ సిస్టమ్ؚతో వస్తుంది. 

ఇది భారతదేశంలో అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్స్ؚను (ADAS) అందిస్తున్న మొదటి బ్రాండ్‌లలో ఒకటి. అంతేకాకుండా, C40 రీఛార్జ్‌లో కొలిజన్ అవాయిడెన్స్ మరియు మిటీగేషన్, లేన్ కీపింగ్ ఎయిడ్, పోస్ట్ ఇంపాక్ట్ బ్రేకింగ్, డ్రైవర్ అలర్ట్ మరియు రన్-ఆఫ్ మిటిగేషన్ వంటి ఫీచర్‌లు ఉన్నాయి. ఇతర భద్రత అంశాలలో ఏడు ఎయిర్ؚబ్యాగ్ؚలు మరియు 360-డిగ్రీల కెమెరా ఉన్నాయి. 

పోటీదారులు 

వోల్వో C40 రీఛార్జ్ ధర రూ.60 లక్షల (ఎక్స్-షోరూమ్) కంటే ఎక్కువ ఉంటుందని అంచనా. ప్రస్తుతానికి దీనికి ప్రత్యక్ష పోటీదారులు లేకపోయినా హ్యుందాయ్ అయోనిక్ 5, కియా EV6, BMW i4 మరియు తన తోటి వాహనం అయిన XC40 రీఛార్జ్ వంటి EV ఆఫరింగ్ؚలతో పోటీ పడునుంది.

was this article helpful ?

Write your Comment on Volvo సి40 రీఛార్జ్

explore మరిన్ని on వోల్వో సి40 రీఛార్జ్

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
×
We need your సిటీ to customize your experience