• English
  • Login / Register

2019 రెనాల్ట్ క్విడ్ VS మారుతి ఎస్-ప్రెస్సో ఇంటీరియర్స్ ని పోల్చడం జరిగింది: చిత్రాలలో

మారుతి ఎస్-ప్రెస్సో కోసం dhruv attri ద్వారా నవంబర్ 07, 2019 10:46 am సవరించబడింది

  • 39 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఈ రెండు ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌లలో ఏది ఎక్కువ ఇష్టపడే క్యాబిన్ ని కలిగి ఉంది?

2019 Renault Kwid vs Maruti S-Presso Interiors Compared: In Pics

ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో స్థలం మరియు లక్షణాల పరంగా రెనాల్ట్  క్విడ్ ఖచ్చితంగా బెంచ్‌మార్క్‌లను సెట్ చేశాడు. అయితే, ఇప్పుడు మారుతి ఎస్-ప్రెస్సో రూపంలో దీనికి గట్టి పోటీ ఎదురయ్యింది. మొత్తంగా పోలికలు చూస్తున్నాము, అయితే ప్రస్తుతానికి మేము రెండు కార్ల క్యాబిన్ లను పోలుస్తూ దేనిలో ఎక్కువ సేపు ఉండడానికి ఇస్టపడుతున్నామో తెలుసుకుంటున్నాము.

డాష్బోర్డ్:

రెండు కార్లు ఆల్-బ్లాక్ డాష్‌బోర్డ్ కలర్ స్కీమ్‌ను కలిగి ఉన్నాయి, అయితే ఎస్-ప్రెస్సో ఫంకీ బాడీ కలర్-కోడెడ్ యాక్సెంట్స్ పొందుతుంది, క్విడ్ సెంట్రల్ కన్సోల్ కోసం క్లాసియర్-లుకింగ్ పియానో బ్లాక్ ఫినిషింగ్‌ ను ఉపయోగిస్తుంది.

స్టీరింగ్ వీల్: క్విడ్ లెథర్ తో చుట్టబడిన స్పోర్టియర్-లుకింగ్ యూనిట్‌ ను పొందుతుంది, అయితే ఎస్-ప్రెస్సో వాగన్ఆర్ మరియు ఇగ్నిస్ లో ఉండే స్టీరింగ్ వీల్ ని దీనిలో కూడా కలిగి ఉంటుంది. రెండు కార్లు త్రీ-స్పోక్ యూనిట్ ని పొందుతాయి, కాని మారుతి మాత్రమే బ్లూటూత్ మరియు టెలిఫోనీ కోసం స్టీరింగ్-ఇంటిగ్రేటెడ్ కంట్రోల్స్ ని పొందుతుంది.

 

టచ్‌స్క్రీన్: క్విడ్ ఇక్కడ  ట్రైబర్ లో ఉన్నట్టుగా  8-అంగుళాల యూనిట్‌ తో ఉంటుంది, అయితే ఎస్-ప్రెస్సో వాగన్ఆర్ లో ఉన్నట్టుగా  7-అంగుళాల యూనిట్‌ తో ఉంటుంది. రెండూ ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీని పొందుతాయి. కానీ క్విడ్ రియర్‌వ్యూ కెమెరా సపోర్ట్‌ ను కూడా కలిగి ఉంటుంది, ఇది మారుతిలో లేదు. 

ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్: 

డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇక్కడ ఒక ప్రామాణిక అమరిక, అయితే ఎస్-ప్రెస్సో సెంట్రల్ కన్సోల్‌ లోని టచ్‌స్క్రీన్‌ పై ప్రత్యేకంగా ఉంచబడుతుంది. క్విడ్ లో కూడా ఇది చక్కగా అమర్చబడి ఉంటుంది, కాని ఇంటిగ్రేటెడ్ డాట్ మ్యాట్రిక్స్ స్క్రీన్‌ ను పొందుతుంది.

ఎయిర్ కాన్ వెంట్స్:

ఎస్-ప్రెస్సో రెండు చివరల బాడీ కలర్ తో ఉండే A.C వెంట్స్ ని కలిగి ఉంటుంది, అయితే క్విడ్ వాటిని క్రోమ్‌ తో కలిగి ఉంటుంది. సెంట్రల్ వెంట్స్ పోల్చి చూస్తే సాధారణంగా ప్లెయిన్ గా కనిపిస్తాయి, కాని రెండు కార్లలోనూ ఒకే విధమైన ఆకారం మరియు పరిమాణాన్ని కలిగి ఉంటాయి.

 AMT షిఫ్ట్:

రెండు కార్లు 5-స్పీడ్ AMT ని ఎంపికగా పొందుతాయి, కాని S- ప్రెస్సో షిఫ్టింగ్ కోసం రెగ్యులర్ స్టిక్ పొందిన చోట, క్విడ్ రోటరీ డయల్‌ ని ఉపయోగిస్తుంది.

సీట్లు:

రెండు కార్లు సీట్ల కోసం ఫాబ్రిక్ అప్హోల్స్టరీని ఉపయోగిస్తాయి మరియు అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్ లను కలిగి ఉండవు.

వెనుక వరుస:

రెనాల్ట్ క్విడ్ యొక్క టాప్ RXT (O) వేరియంట్ (ప్రస్తుతానికి చిత్రం అందుబాటులో లేదు) పవర్ విండోస్ (ఆప్షనల్), వెనుక ఆర్మ్‌రెస్ట్ తో కూడా లభిస్తుంది. మారుతి ఎస్-ప్రెస్సోలో అలాంటి ఎంపిక లేదు. రెండు కార్లు నాన్-అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్ లను అందిస్తాయి.

బూట్ స్పేస్: రెనాల్ట్ క్విడ్ 279 లీటర్ల బూట్ స్పేస్ ని కలిగి ఉంది, కాని ఎస్-ప్రెస్సో కూడా వెనకబడి ఏమీ లేదు, అది 270 లీటర్ల వద్ద బూట్ స్పేస్ ని కలిగి ఉంది. రెండు కార్లు అదనపు నిల్వ స్థలం కోసం ఫోల్డబుల్ రియర్ బ్యాక్‌రెస్ట్ ని పొందుతాయి.

మరింత చదవండి: మారుతి ఎస్-ప్రెస్సో ఆన్ రోడ్ ప్రైజ్

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Maruti ఎస్-ప్రెస్సో

Read Full News

explore similar కార్లు

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience