2018 మారుతి సుజుకి స్విఫ్ట్ వేరియంట్స్ వివరణలు
మారుతి స్విఫ్ట్ 2014-2021 కోసం cardekho ద్వారా మార్చి 29, 2019 11:59 am ప్రచురించబడింది
- 24 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మారుతి సుజుకి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆటో ఎక్స్పో 2018 లో స్విఫ్ట్ ను విడుదల చేసింది.డిజైర్ మాదిరిగా, స్విఫ్ట్ కూడా నాలుగు వేరియంట్లు అయిన L, V, Z మరియు Z + లలో అందించబడుతుంది. అలానే స్విఫ్ట్ కారు డిజైర్ తో ఇంజన్లను కూడా పంచుకుంటుంది, ఇది 1.2 లీటర్ పెట్రోల్ మరియు 1.3 లీటర్ డీజిల్ ఇంజన్లతో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా 5-స్పీడ్ AMT (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్) తో కొనసాగుతుంది.
లక్షణాల పరంగా, స్విఫ్ట్ 2018 EBD తో ABS మరియు బ్రేక్ అసిస్ట్, డ్యుయల్ ఎయిర్బ్యాగ్స్ మరియు ISOFIX చైల్డ్ సీటు యాంకర్స్ ని ఈ పరిధిలో ప్రామాణికంగా పొందుతుంది. ఇది ఫోర్డ్ ఫిగో మరియు హ్యుందాయ్ గ్రాండ్ i10 తో పాటూ ఇతర కార్లతో కూడా పోటీ కొనసాగిస్తుంది.
వివరాలు లోనికి వెళ్ళే ముందు,2018 స్విఫ్ట్ యొక్క స్పెక్ షీట్ పరిశీలించండి.
కొలతలు (L X W X H) |
3840mm X 1735mm X 1530mm |
వీల్బేస్ |
2450mm |
గ్రౌండ్ క్లియరెన్స్ |
163mm |
సీటింగ్ సామర్థ్యం |
5 |
బూట్ స్పేస్ |
268 లీటర్లు |
ఇంజన్: దాని ముందు దాని వలే కొత్త స్విఫ్ట్ 1.2 లీటర్ పెట్రోల్ మరియు 1.3 లీటర్ డీజిల్ ఇంజన్లతో అందించబడుతుంది.
ఫ్యుయల్ |
పెట్రోల్ |
డీజిల్ |
ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ |
1197cc |
1248cc |
ట్రాన్స్మిషన్ |
5MT / 5AMT |
5MT / 5AMT |
గరిష్ఠ శక్తి |
83PS @ 6000 rpm |
75PS @ 4000 rpm |
గరిష్ట టార్క్ |
113Nm @ 4200 rpm |
190Nm @ 2000 rpm |
క్లెయిమ్ చేసిన ఇంధన సమర్థత |
22kmpl |
28.4kmpl |
రంగు ఎంపికలు: కొత్త స్విఫ్ట్ సాలిడ్ ఫైర్ రెడ్, పెరల్ ఆర్కిటిక్ వైట్, మెటాలిక్ సిల్కీ సిల్వర్, మాగ్మా గ్రే, మిడ్నైట్ బ్లూ మరియు ప్రైమ్ లుసెంట్ ఆరెంజ్ వంటి ఆరు రంగులలో అందించబడుతుంది.
మారుతి సుజుకి స్విఫ్ట్ Lxi / Ldi: కొన్ని ప్రాథమిక లక్షణాలను కోల్పోతుంది
పెట్రోల్ |
డీజిల్ |
|
ధర (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) |
రూ. 4.99 లక్షలు |
రూ. 5.99 లక్షలు |
క్రింది లక్షణాలను పొందుతుంది:
ప్రామాణిక భద్రతా లక్షణాలు |
ఎయిర్‌కాన్ |
టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ |
మాన్యువల్ అడ్జస్టబుల్ ORVM (అంతర్గత) |
బ్లాక్ ORVM కవర్లు |
కవర్లు లేకుండా స్టీల్ వీల్స్ |
పవర్ విండోస్ లేవు |
'L' అనేది కొత్త స్విఫ్ట్ యొక్క బేస్ వేరియంట్ గా ఉంది మరియు ఇది కూడా పరికరాల పరంగా చాలా ప్రాథమికంగా ఉంది. మారుతి సుజుకి స్విఫ్ట్ లో వేరియంట్స్ అన్నింటిలోనీ ఒక టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ అందించడానికి బాగా కృషి చేసారు, అలాగే దీనిలో హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు కూడా ఉండి ఉంటే మరింత బాగుండేది. ఈ లక్షణం గనుక ఉండి ఉంటే ఏ వేరియంట్ ఎంచుకున్నా కూడా డ్రైవర్ పొట్టిగా ఉన్నా లేదా పొడవుగా ఏ ఆకరంలో ఉన్నా కూడా సరైన పొజిషన్ లో సీటు ని అడ్జస్ట్ చేసుకొని సౌకర్య్వంతమైన డ్రైవింగ్ ని పొందే అవకాశం ఉండేది. ఫ్రంట్ పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ మరియు కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు L (O) అవుట్గోయింగ్ స్విఫ్ట్ వేరియంట్ లో ఉన్నాయి, కానీ ఇప్పుడు ప్రామాణికంగా అందించబడవు.
తీర్పు:
స్విఫ్ట్ యొక్క పెట్రోల్ ధర పాత L(O) వేరియంట్ తో గనుక పోల్చి చూసినట్లయితే రూ.19,000 పెరిగింది. కొత్త స్విఫ్ట్ పాత వెర్షన్ లో అందించే కొన్ని ప్రాధమిక లక్షణాలు కూడా ఇప్పుడు అందించకపోవడంతో కొంచెం నిరాశ చెందాల్సి వస్తుంది.
స్విఫ్ట్ యొక్క డీజిల్ 2018, స్విఫ్ట్ యొక్క Ldi (O) వేరియంట్ ధర దాని పాత దాని కంటే ధర రూ.21,000 తక్కువ ఉంది. అందుచే కొత్త స్విఫ్ట్ కొనుగోలుదారులకు అంత బాద కలిగించదు. కానీ ఇప్పటికీ, మీరు కొత్త స్విఫ్ట్ యొక్క బేస్ వేరియంట్ కొనుగోలు చేయాలనుకుంటే,ఇది పూర్తిగా రోజువారీ వాడుకకు అనుకూలంగా ఉండేలా మ్యూజిక్ సిస్టమ్, వీల్ కవర్లు (అల్లాయ్ వీల్స్ ఉంటే) మరియు ఫ్రంట్ పవర్ విండోస్ వంటి ప్రాథమిక అవసరాలను పొందేందుకు కొన్ని వేల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉండండి.
మారుతి సుజుకి స్విఫ్ట్ Vxi / Vdi / Vxi AMT / Vdi AMT: అవసరాలు ధర వద్ద వస్తాయి
పెట్రోల్ |
డీజిల్ |
|
ధర (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) |
రూ. 5.87 లక్షలు (MT) / రూ. 6.34 లక్షలు (AMT) |
రూ. 6.87 లక్షలు / రూ. 7.34 లక్షల (AMT) |
L నుండి వ్యత్యాసం |
రూ. 88,000 |
రూ. 88,000 |
L వేరియంట్ పై అదనపు లక్షణాలు:
సూచనలు కలిగిన బాడీ-రంగు ORVM లు |
పూర్తి వీల్ కవర్స్ |
స్టీరింగ్-మౌంటెడ్ నియంత్రణలతో ఆడియో ప్లేయర్ |
హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు |
కీలెస్ ఎంట్రీ |
సెంట్రల్ డోర్ లాకింగ్ |
పవర్ విండోస్ (ముందు మరియు వెనుక) |
ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVMs |
స్విఫ్ట్ యొక్క V వేరియంట్ చాలా మంది ప్రజల కనీస అవసరాలను నెరవేరుస్తుంది మరియు కొనుగోలుదారులకు ఇంకొక శుభవార్త ఏమిటంటే రెండు ఇంజిన్లతో పాటు AMT ఆప్షన్ ని అందిస్తుంది.ఇదిలా ఉన్నా కూడా ఆధునిక హ్యాచ్బ్యాక్ గా ఇంకా సరిపోదు. ఈ అపఖ్యాతి పోవాలంటే పుష్ బటన్ స్టార్ట్ / స్టాప్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రికల్లీ-ఫోల్డబుల్ ORVM వంటి లక్షణాలు దీనిలో అందించబడాలి. ఈ లక్షణాలన్నీ కూడా తదుపరి వెర్షన్ స్విఫ్ట్ Z లో అందుబాటులో ఉన్నాయి.
తీర్పు
స్విఫ్ట్ V వేరియంట్ కొనుగోలుదారులకు కావలసిన అన్ని అవసరాలని తీరుస్తుంది, కానీ బేస్ వేరియంట్ మీద ప్రాథమిక సదుపాయాలకు రూ.88,000 ఎక్కువ ధరను కలిగి ఉంటుంది. స్విఫ్ట్ మైనస్ పాయింట్లు అయిన ఎలక్ట్రికల్ సర్దుబాటు ORVM లు, స్టీరింగ్ నియంత్రణలు మరియు ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీట్లు లేకపోయినా మీరు పరవాలేదు అనుకుంటే మాత్రం మీరు బేస్ వేరియంట్ కోసం వెళ్లి, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, కీలెస్ లేక ఎంట్రీ మరియు ఆడియో సిస్టమ్ ను మారుతి సుజుకి నుంచి అమర్చుకోండి.ఇవి రూ.35,000 కంటే ఎక్కువ ఖర్చు చేయవు. అలాగే సీటు కవర్లు పొందండి మరియు మీరు ఇంకా కొంత డబ్బు ఆదా చేసుకోగలుగుతారు. ఈ సలహా ఇచ్చిననదుకు మాకు తరువాత ధన్యవాదాలు తెలుపుకుంటారు!
స్విఫ్ట్ AMT కొనుగోలుదారులు తమ బడ్జెట్ ను విస్తరించుకొని మరియు Z వేరియంట్ కోసం కూడా ప్రయత్నించాలి. కారణం ఎందుకు అనేది ఇక్కడ ఉంది
మారుతి సుజుకి స్విఫ్ట్ Zxi / Zdi / Zxi AMT / Zdi AMT: నమ్మలేనంత విలువని కలిగి ఉంది, మీరు కళ్ళు మూసుకొని దీనిని కొనుగోలు చేసుకోవచ్చు.
పెట్రోల్ |
డీజిల్ |
|
ధర (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) |
రూ .6.49 లక్షల (MT) / రూ. 6.96 లక్షల (AMT) |
రూ. 7.49 లక్షల (MT) / రూ. 7.96 లక్షల (AMT) |
V నుండి వ్యత్యాసం |
రూ. 62,000 |
రూ. 62,000 |
V వేరియంట్ పైన అదనపు లక్షణాలు:
లెథర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ |
రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ |
ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ |
2 ట్వీటర్స్ |
ఆటో క్లైమేట్ కంట్రోల్ |
పుష్ బటన్ స్టార్ట్ / స్టాప్ |
ఎలక్ట్రానిక్-రిట్రాక్ట్ ORVM లు |
వెనుక డిఫేజర్ |
వెనుక వైపర్ / వాషర్ |
అడ్జస్టబుల్ రేర్ హెడ్‌రెస్ట్ |
60:40 స్ప్లిట్ వెనుక సీటు |
అలాయ్ వీల్స్ |
మేము చెప్పినట్లుగా, స్విఫ్ట్ Z అనేది పూర్తి ఆధునిక కారు. స్టీరింగ్ వీల్ మీద లెథర్, స్టార్ట్/ స్టాప్ బటన్ మరియు ట్వీట్లర్స్ వంటి మంచి లక్షణాలు ఉన్నప్పటికీ, ఉపయోగకరమైన ఫీచర్ల జాబితా వాస్తవానికి చాలా ఎక్కువ ఉంది.పార్కింగ్ సెన్సార్లు, ఆటో క్లైమేట్ కంట్రోల్, వెనుక డిఫేజర్ మరియు వైపర్ /వాషర్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ORVM లు వంటి లక్షణాలు, ఈ కారులో మీ రోజువారీ ప్రయాణాన్ని మరింత సులభంగా మరియు ఆనందించేలా చేయడానికి వాగ్దానం కూడా చేస్తాయి. అలోయ్ వీల్స్ సమితి మరియు AMT యొక్క ఆప్షన్ ఈ వేరియంట్ ని మరింత అద్భితంగా చేసి ఏవరైతే వారి కారు బయట చాలా ఆడంబరమైన ఉండకూడదు అనుకుంటారో వాళ్ళకి ఈ కారు బాగుంటుంది.
తీర్పు :
62,000 రూపాయల పెరుగుదలను మరియు మారుతి సుజుకి అందిస్తున్న అదనపు లక్షణాలను పరిగణలోనికి తీసుకుంటే , ఈ వేరియంట్ డబ్బుకి న్యాయం చేస్తుందని ఖచ్చితంగా చెప్పగలము. ఎవరైతే తక్కువ వేరియంట్లు కొనుగోలు చేసుకుందామని చూస్తున్నారో వారికి మేము ఇచ్చే సలహా ఏమిటంటే మీ డబ్బులుని కొంచెం పెంచుకొని స్విఫ్ట్ Z వేరియంట్ కోసం వెళ్ళండి.
మారుతి సుజుకి స్విఫ్ట్ Zxi + / Zdi + / Zxi + AMT / Zdi + AMT: ది పోజర్!
పెట్రోల్ |
డీజిల్ |
|
ధర (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) |
రూ. 7.29 లక్షలు(MT)/రూ.7.76 లక్షలు (AMT) |
రూ.8.29 లక్షల (MT) / రూ 8.76 లక్షల (AMT) |
Z నుండి వ్యత్యాసం |
రూ. 80,000 |
రూ. 80,000 |
Z వేరియంట్ పై అదనపు లక్షణాలు:
DRL లతో LED ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ |
రివర్స్ పార్కింగ్ కెమెరా |
ఆపిల్ కార్పిల్, ఆండ్రాయిడ్ ఆటో మరియు మిర్రర్లింక్ తో 7-అంగుళాల టచ్స్క్రీన్ స్మార్ట్ప్లే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ |
ఆటో హెడ్ల్యాంప్లు |
ఆడంబరం గురించి మాట్లాడుకుంటే, ఇది స్విఫ్ట్ Z + అనేది మిగిలిన అన్ని వేరియంట్స్ కంటే భిన్నంగా నిలిచి మీతో అధనపు డబ్బు ఖర్చు పెట్టేలా చేస్తుంది. Z + డే టైం రన్నింగ్ లైట్లు (DRLs) తో LED ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ కలిగి ఉండే పునఃరూపకల్పన చేసిన హెడ్ల్యాంప్ యూనిట్ ని పొందుతుంది. Z + వేరియంట్ లో అలాయ్ వీల్స్ మెషిన్-కట్ ఫినిషింగ్ ని పొందుతాయి. అయితే, వీల్స్ యొక్క పరిమాణం మరియు టైర్లు Z వేరియంట్ లో కనిపించే వాటిలాగే ఉంటాయి.
లోపల, Z వేరియంట్ యొక్క బటన్-భారీ ఆడియో సిస్టమ్ 7-అంగుళాల స్మార్ట్‌ప్లే టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ తో మార్చబడింది. అది గైడ్ లైన్స్ తో రేర్ పార్కింగ్ కెమేరా సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. నిజానికి, ఈ వేరియంట్ ఇతర కార్లు కంటే చాలా ఆధునికమైనది అనిపిస్తుంది. కానీ మారుతి సుజుకి అది అందించే అన్ని అదనపు లక్షణాల కోసం అధికంగా ప్రీమియం వసూలు చేస్తుంది. అటువంటి పరిస్థితులలో, ఎవరైతే బాగా ఇష్టపడి ఈ వేరియంట్ ని కొనుగోలు చేసుకుందాము అనుకుంటారో వారు మాత్రమే దీనిని కొనుగోలు చేసుకుంటే మంచిది.
తీర్పు
స్విఫ్ట్ యొక్క టాప్ వేరియంట్ మునుపటి వేరియంట్స్ మీద అధనంగా రూ.80,000 ప్రీమియంను ఆకర్షిస్తుంది మరియు అదనపు పరికరాలు అంతగా ఏమీ ఉండదు అయినప్పటికీ Z వేరియంట్ ధరకు విలువ కలది. స్విఫ్ట్ కనిపించే తీరును DRL లు ఎలా మార్చాయో అది మీరు కోరుకుంటే మరియు మీరు అదనపు లక్షణాలు కావాలి అనుకున్నా సరే మీరు ఈ వేరియంట్ కోసం వెళ్ళొచ్చు.