• English
  • Login / Register

2018 మారుతి సుజుకి సియాజ్ ఫేస్ లిఫ్ట్: మెరుగుపర్చాల్సిన 5 విషయాలు

మారుతి సియాజ్ కోసం raunak ద్వారా మార్చి 15, 2019 04:35 pm ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Maruti Suzuki Ciaz

మారుతి సుజుకి సియాజ్ మిడ్-సైకిల్ నవీకరణలో చాలా లక్షణాలతో ఉంది. ఇది దాని విభాగంలో ఉండాలనుకునే దాని పరికర జాబితాలో ప్రతిదీ కలిగి ఉంది, మరియు పెట్రోలు మరియు డీజిల్ ఇంజిన్ రెండింటికీ మైల్డ్-హైబ్రీడ్ సాంకేతికతను కూడా అందిస్తుంది. కానీ దాని ప్రత్యర్థులు కూడా తక్కువ ఏమీ కాదు మరియు కొన్ని ఏకైక అంశాలను కూడా కలిగి ఉన్నాయి. మారుతి సుజుకి 2018 నవీకరణ తో సియాజ్ లో కొన్ని మంచి లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ,  2018 సియాజ్ ని మరింత అద్భుతమైనదిగా చేయడానికి ఇంకా కొన్ని అవసరమైన వాటిని కలిగి ఉండాలి.

Maruti Suzuki Ciaz

1) మరింత శక్తివంతమైన ఇంజిన్లు

నవీకరించబడిన సియాజ్, ప్రీ-ఫేస్లిఫ్ట్ మోడల్ యొక్క 1.4-లీటర్ యూనిట్ ను భర్తీ చేసే ఒక కొత్త మరియు పెద్ద 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ను సిద్ధం చేస్తుంది. ఇది సుమారుగా 12Ps పవర్ ను మరియు 8Nm టార్క్ ని అధనంగా ఇస్తుంది. హోండా సిటీ, వోక్స్వాగన్ వెంటో మరియు హ్యుందాయ్ వెర్నా వంటి ప్రత్యర్థులు మరింత శక్తివంతమైన పెట్రోల్ ఇంజన్లను అందిస్తున్నాయి.

 

పెట్రోల్

మారుతి సుజుకి సియాజ్

హోండా సిటీ

హ్యుందాయ్ వెర్నా

వోక్స్వాగన్ వెంటో

ఇంజన్

1.5-లీటర్

1.5-లీటర్

1.4-లీటర్ /1.6-లీటర్

1.2 లీటర్ టర్బో / 1.6 లీటర్

పవర్

105PS

119PS

100PS/123PS

105PS/105PS

టార్క్

138Nm

145Nm

132Nm/151Nm

175Nm/153Nm

ఫ్యుయల్ ఎఫిషియన్సీ

21.56kmpl వరకు

18kmpl వరకు

17.7kmpl వరకు

18.19kmpl వరకు

ఇప్పుడు మారుతి సంస్థ సియాజ్ కు కొత్త ఇంజిన్ ని జోడించాలని నిర్ణయించుకుంది, అది మరింత శక్తివంతంగా తయారవుతుంది. కొత్త ఇంజిన్ ఉన్నప్పటికీ కూడా, సీయాజ్ పెట్రోల్ ఈ విభాగంలో ఇప్పటికీ లీస్ట్ పవర్‌ఫుల్ కార్లల్లో ఒకటిగా ఉంది. దీనిలో అద్భుతమైన లక్షణం ఏమిటంటే, టార్క్ అసిస్ట్ తో మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ ఉంది. ఇది ఇంధన సామర్ధ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా దాని తక్కువ వేగంతో వాహనం నడుపుతుంది.  

అలా అని సియాజ్ తగినంత శక్తి కలిగిలేదని అనుకోకండి. చైనా స్పెక్ సియాజ్ మోడల్ శక్తివంతమైన 1.6 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ని కలిగి ఉండి  122Ps పవర్ ని మరియు 158Nm టార్క్ ని అందిస్తుంది. ఈ ఇంజిన్ నవీకరించిన సెడాన్ ను ముందు కంటే మరింత శక్తివంతమైనదిగా చేస్తుంది మరియు అది కేవలం పెట్రోల్ ఇంజిన్ కే కాదు - డీజిల్-ఆధారిత సియాజ్ కూడా మంచి పనితీరు అందిస్తుంది. మారుతి సుజుకి 1.5 లీటరు డీజిల్ ఇంజన్ ను అభివృద్ధి చేస్తోందని, ఇది ప్రస్తుతం ఉన్న 1.3 లీటర్ల యూనిట్ కంటే మరింత శక్తివంతమైనదని మాకు తెలుసు.  

2) కొత్త తరం ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్

డ్యూయల్-క్లచ్ AT లు, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్లు మరియు CVT ల తరంలో, మారుతి తన పాత 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ AT తో కొనసాగుతోంది, ఇది నిష్పత్తులను మానవీయంగా ఎంచుకునే ఎంపికను అందించదు.

పెట్రోల్

మారుతి సియాజ్

హోండా సిటీ

హ్యుందాయ్ వెర్నా

VW వెంటో

ఇంజిన్

1.5 లీటర్

1.5 లీటర్

1.6 లీటర్

1.2 లీటర్ టర్బో

ట్రాన్స్మిషన్

4-స్పీడ్ AT

పెడల్ షిఫ్టర్స్ తో 7-స్టెప్ CVT

6-స్పీడ్ AT

7-స్పీడ్ డ్యూయల్-క్లచ్

చైనా-స్పెక్ సియాజ్ మోడల్ మరింత శక్తివంతమైన ఇంజిన్ ని కలిగి ఉండడమే కాకుండా, 6-స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ తో కూడా లభిస్తుంది. ఎక్కువ నిష్పత్తులు కలిగి ఉన్న కారణంగా సియాజ్ రహదారులపై ఎక్కువ ఇంధన సామర్ధ్యాన్ని కలిగి ఉంటూ తక్కువ ఇంజన్ స్పీడ్ తో కూడా దూసుకెళుతుంది.

Honda City CVT

3) వెనుక ప్రయాణీకులకు మరింత భద్రత

2018 సియాజ్ సీట్‌బెల్ట్ రిమైండర్ (డ్రైవర్ మరియు సహ ప్రయాణీకుల), అధిక వేగం హెచ్చరిక మరియు రివర్స్ పార్కింగ్ సెన్సార్లను ప్రామాణికంగా పొంది ఉంది. పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ అధనంగా హిల్ హోల్డ్ తో ESP ను ప్రమాణికంగా అందించబడుతుంది. కాబట్టి 2018 సియాజ్ అవుట్గోయింగ్ మోడల్ కంటే ఖచ్చితంగా సురక్షితమైనది.

కానీ దీని పోటీదారులు మరింత అద్భుతమైన భద్రతా లక్షణాలను కలిగి ఉన్నాయి. ఆరు ఎయిర్ బాగ్స్ 6 ఎయిర్బ్యాగ్స్ అందజేయడమనేది ఆ విభాగంలో అత్యంత సాధారణం అవుతుంది. సిటీ మరియు వెర్నా  వారి టాప్-స్పెక్స్ వేరియంట్లలో ఆరు ఎయిర్బాగ్లను అందిస్తోంది. టొయోటా యారిస్ కారు, విభాగంలో మొదటిసారిగా ఏడు ఎయిర్‌బ్యాగ్లను పొందుతుంది, దీనిలో డ్రైవర్ యొక్క మోకాలి ఎయిర్బ్యాగ్ కూడా ప్రామాణికంగా కలిగి ఉంది. సియాజ్ లోని వెనుక ప్రయాణీకులకు ఎయిర్బ్యాగ్స్ అందించి ఉంటే, చాలా ప్రత్యేకంగా ఉండేది, ముఖ్యంగా వెనుక కూర్చొనేవారికి సౌకర్యంగా ఉండేది. ఇక్కడ గుర్తించదగ్గ పాయింట్ ఏమిటంటే  చైనా స్పెక్ సియాజ్ కూడా 6 ఎయిర్‌బ్యాగ్లను కలిగి ఉంది.  

4) మరింత మెరుగుపెట్టాలి

సియాజ్ చాలా మంచి విషయాలను కలిగి ఉంది మరియు ఇది ఇంతకు ముందు ఉన్న దాని కంటే ఇప్పుడు బాగానే ఉంది. అయితే వివరాలలోనికి లోతుగా వెళితే,  ప్యాకేజీని పూర్తి చేయటానికి మారుతి ఇంకా బాగా అభివృద్ధి చేసి ఉండొచ్చు.

.స్టీరింగ్ కంట్రోల్స్ మరియు A.C కంట్రోల్స్ పై అంబర్ ప్రకాశం,ఉదాహరణకు, బ్లూ-బ్యాక్లిట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తో అనుగుణంగా ఉండటానికి నీలం లేదా తెలుపుగా ఉండవచ్చు.

. వెనుక ఆరంరెస్ట్ సులభంగా క్రిందకి లాగడానికి వీలుగా ఒక స్ట్రాప్ ని కలిగి ఉండవచ్చు.

. S- క్రాస్ లో డాష్బోర్డ్  ఉన్నట్లుగా సాఫ్ట్-టచ్ ఫినిషింగ్ తో ఉండవచ్చు.

. వెనుక ప్రయాణీకులకు USB సాకెట్ ఉండవచ్చు.

. మారుతి సంస్థ బలేనో లో UV- కట్ గ్లాస్ అందించిన విధంగా సియాజ్ లో కూడా అందించబడాలి.

ఈ చిన్న వివరాలు అన్నీ, సియాజ్ ను కొనాలి అనుకొనే కోరికను మరింత పెంచుతుంది.

5. దయచేసి సన్‌రూఫ్ ని అందించాలి

Honda City

ఈ ఒక్క లక్షణం కొనుగోలుదారులకు వాహనాన్ని కొనాలి అనే కోరొకను బలోపేతం చేస్తుంది. WR-V మరియు సిటీ వంటి కార్ల మీద హోండా నిజంగా డబ్బులు బాగా వసూల్ చేస్తోంది మరియు కార్ల తయారీదారులు WR-V అమ్మకాలలో ఎక్కువ భాగం ఒక సన్రూఫ్ తో వచ్చే టాప్-స్పెక్ వేరియంట్ అని చెప్పి రికార్డు సృష్టించారు.  హ్యుందాయ్ సంస్థ కూడా ఇప్పుడు కొత్త తరం వెర్నా మరియు క్రీటా ఫేస్లిఫ్ట్ లో  సన్రూఫ్ అందిస్తుంది. ఫోర్డ్ కూడా దీనిని ఎకోస్పోర్ట్ ఫేస్లిఫ్ట్ లో అందిస్తుంది. ప్రస్తుతానికి ఏ మారుతీ కార్లలో కూడా సన్రూఫ్ అందించబడడం లేదు. సియాజ్ లో ఈ లక్షణం అందించబడి ఉంటే బాగుండేది, ఎందుకంటే దాని ప్రధాన ప్రత్యర్ధులన్నిటిలోని ఈ లక్షణం ఉంది కాబట్టి. ఇప్పుడు చైనా స్పెక్ మోడల్ లో కూడా ఈ లక్షణం ఉంది.

 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Maruti సియాజ్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience