2015 ఫ్రాంక్ ఫర్ట్ మోటర్ షో: నాలుగవ-తరం ప్రయస్ IAA 2015 లో ప్రదర్శితమైంది
సెప్టెంబర్ 18, 2015 11:41 am manish ద్వారా ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
టొయోటా వారి నలుగవ తరం ప్రయస్ ని 2015 IAA ఫ్రాంక్ఫర్ట్ షో లో ప్రదర్శితమైంది. ఈ కారు పై ఉన్న స్టైలింగ్ జపనీస్ షోడో శైలి లో ఉంటుంది. ఈ 2016 టొయోటా ప్రయస్ కంపెనీ వారి కొత్త ప్రపంచిక ఆర్కిటెక్చర్ అయిన 'TNGA'లా ఉంటుంది. ఈ వేదిక మునుపటి కంటే బిగుతుగా మరియూ తేలికగా ఉంటుంది. ఈ కొత్త కారు 60mm పొడవు మరియూ 15mm వెడల్పు ఎక్కువగా ఇవ్వబడింది. ఏరోడైనమిక్స్ ని మెరుగు పరిచేందుకు ఎత్తు ని 20mm తగ్గించారు.
నాలుగవ-తరం ప్రయస్ కి పునరుద్దరించిన హైబ్రీడ్ సినర్జీ డ్రైవ్ ఇంజిను అమర్చబడి ఉంది. ఇది మెరుగైన మైలేజీ మరియూ తక్కువ ఎమిషన్స్ విడుదల చేసేలా తీర్చబడింది. మైలేజీ ని 18% పెంచడం జరిగింది. మునుపటి దానికంటే ఇందులో ఎలక్ట్రిక్ మోటరు చిన్నదిగా ఉంది. ఈ కారులో మెరుగైన సామర్ధ్యం ఇవ్వబడే బ్యాటరీలు అందించబడింది. ప్రయస్ యొక్క థర్మల్ సామర్ధ్యం దాదాపుగా 40 శాతం పెంచి ప్రపంచపు పెట్రోల్ కారుల్లో ఒక కొత్త ప్రమాణాన్ని సృష్టించారు.
సురక్షణ విషయంలో, టొయోటా సేఫ్టీ సెన్స్ వల్ల ప్రయస్ సురక్షితమైనదే అని చెప్పాలి. ఈ లక్షణాల కారణంగా, లేన్ డిపార్చర్ అలర్ట్, ఆటోమాటిక్ హై బీం, రోడ్ సైన్ అస్సిస్ట్, రాడార్-గవర్నడ్ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియూ పెడస్ట్రియన్ రికగ్నిషన్ కేపబిలిటీ వంటి లక్షణాలు అందుతాయి.