100 వ నేక్సా షోరూమ్ ఇటీవల ప్రారంభమైంది; ఇది 40,000 యూనిట్ల ప్రీమియం డీలర్ అమ్మకాలని సాధించింది.
జనవరి 27, 2016 12:25 pm cardekho ద్వారా ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మారుతి ఈ ఏడాది దేశవ్యాప్తంగా దాని 140 Nexa ప్రీమియం-డీలర్షిప్లని విస్తరింపజేయాలనే ఆలోచనలో ఉంది. శుక్రవారం, అది ముంబై లో థానే వద్ద దాని 100 వ అవుట్లెట్ ని తెరిచింది. ఇది జూలై 2015 లో ప్రారంభం అయింది. ఇది కేవలం ఆరు నెలల ఇంత తక్కువ వ్యవధిలో ఇంత ఘనమయిన విజయాన్ని సాధించటం ఒక ముఖ్యమయిన విషయం.
ఇవి ఇప్పుడు దేశంలో సుమారు 60 నగరాలలో పైగా మారుతి ఇండియా ద్వారా నేక్సా షోరూమ్స్ ని పరిచయం చేసింది. నిజంగా ఈ వ్యూహం తయారీదారు కోసం ఈ అవుట్లెట్లు ద్వారా 40,000 యూనిట్లను విక్రయించేలా సహాయపడుతుంది. ఈ డీలర్షిప్ లు మారుతి నుండి ఉత్తమమైన మరియు అధిక హై ఎండ్ ముగింపులు కలిగిన సమర్పణలు అందించే నెలవుగా ఉంటాయి.
డీలర్షిప్ ల నుండి మరియు సేవాకేంద్రాల నుండి వచ్చిన సానుకూల స్పందనల కారణంగా మంచి ఉత్సాహంతో ఏప్రిల్ 2017 నాటికి దీనియొక్క సంఖ్యని 250 కి పెంచాలని యోచిస్తోంది. అంతేకాకుండా దీనిని సందర్శించే వినియోగదారులకి ఒక అద్భుతమయిన మరియు ఒక చిరస్మరణీయ అనుభవం, ఇవ్వటానికి మారుతి దాని సేవల యొక్క నాణ్యతని కూడా పెంచుకోవాలని ఆలోచిస్తుంది. దీనికోసం మారుతి దాని కస్టమర్ నిర్వాహకుల సంఖ్యని 2,500 నుండి 5,000 కు పెంచాలని చూస్తుంది.
100 వ షోరూమ్ ప్రారంభ కోసం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ, మారుతి సుజుకి,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్), RS కల్సి, ఇలా అన్నారు. "మేము 100వ నేక్స షోరూమ్ ని ఆనందంగా మీ ముందుకు తేబోతున్నాము". అన్నాడు. Nexa ద్వారా, మేము మా వినియోగదారులు యొక్క విభిన్న అంచనాలను చేరుకోవాలని అనుకుంటున్నాము. కస్టమర్ యొక్క అభిప్రాయాలు మరియు సర్వేలు వ్యక్తిగత రక్షణని ఇచ్చే కార్లని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని తెలుపుతున్నాయి. అంతేకాకుండా యజమానులు కారు కొనే ముందు శ్రద్ధగా వారి నిర్ణయాలని తీసుకుంటున్నారు . నేక్సా ఈ సెగ్మెంట్ లోని వినియోగదారుల కోసం ప్రత్యేకంగా డిజైను చేయబడింది. ఇది ఈ సెగ్మెంట్ లోని వినియోగదారుల కోసం సాంకేతిక, షోరూమ్ వాతావరణం మరియు వార్కి కావలిసిన అనుభవాన్ని అందించాలని చూస్తుంది".
ప్రస్తుతం, మారుతి S-క్రాస్రెండు నమూనాలు ప్రీమియం క్రాస్ఓవర్ మరియు ప్రముఖ బాలెనో యొక్క ప్రీమియం హ్యాచ్బ్యాక్ లు ఈ అవుట్లెట్ లలో అమ్ముతారు మరియు సమీప భవిష్యత్తులో మరిన్ని నమూనాలు ఈ లైన్ అప్ లో చేరనున్నాయి. మొత్తంగా మారుతి యొక్క వ్యూహం ఏమిటంటే 2020 నాటికి ఏడాదికి 2 మిలియన్ వాహనాలు అమ్మటాన్ని లక్ష్యంగా చేసుకుంది.
ఇది కూడా చదవండి;నెక్సా- మనకి ఉత్తమ శ్రేణి డీలర్ షిప్లు అవసరమా లేక ఉత్తమమయిన వాహనాలా ?