10 Things Nobody Told You About The Maruti Suzuki Ignis
మారుతి ఇగ్నిస్ కోసం cardekho ద్వారా మార్చి 25, 2019 04:35 pm ప్రచురించబడింది
- 23 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఇగ్నీస్ కారు మారుతి సుజుకి కి చాలా మొట్టమొదటి లక్షణాలన్నిటినీ తీసుకొస్తుంది. ఇది మారుతి సుజుకి కి భవిష్యత్తులో మిగిలిన ప్రొడక్ట్స్ కి ఒక బెంచ్ మార్క్ లా నిలిచి మరియు నెక్సా బ్రాండ్ కి ఎక్కువగా అమ్ముడుపోయే భాధ్యతను తీసుకుంది. ప్రొడక్ట్ లోనికి వెళ్ళేముందే ‘మొట్టమొదట’ అనే పదాన్ని మనం దీనిలో ఎక్కువగా వాడుతాము. ఇగ్నీస్ అనేది మారుతి సుజుకి ఆన్లైన్ లో బుక్ చేసుకొనే మొట్టమొదటి కారుగా నిలుస్తుంది. ఇది మరియు ఇంకా చాలా మనకి తెలుసు ఈ కొత్తగా వచ్చే ఇగ్నీస్ గురించి, ఇది ఒక మారుతి సుజుకి అందించిన ప్రీమియం కాంపాక్ట్ అర్బన్ వెహికెల్.
1. కొత్త తేలికైన ప్లాట్‌ఫార్మ్
ఈ మారుతి సుజికి ఇగ్నీస్ అనేది ఈ కొత్త తేలికైన ప్లాట్‌ఫార్మ్ మీద మొట్టమొదట కారుగా నిలుస్తుంది. ఇది స్విఫ్ట్ ప్లాట్‌ఫార్మ్ కంటే తేలికైనది, ఈ స్విఫ్ట్ ప్లాట్ఫార్మ్ మీద డిజైర్ మరియు ఎర్టిగా కూడా తయారుచేయబడ్డాయి. మారుతి సుజికి ఏం చెప్తుంది అంటే వాహనం యొక్క బరువుని ఇంధన సామర్ధ్యాన్ని పెంచడం కోసం ఎప్పుడూ గమనిస్తూ ఉంటూ ఈ కొత్త ప్లాట్‌ఫార్మ్ వలన క్రాష్ టెస్ట్ లో కూడా బాగా పెర్ఫార్మ్ చేస్తుందని మారుతి సంస్థ చెబుతుంది. ఈ ప్లాట్‌ఫార్మ్ కూడా అనువైనదిగా ఉంటుంది మరియు మారుతి సుజుకి నుంచి కొత్త భవిష్యత్తు ఉత్పత్తులు అన్నీ కూడా ఇదే ప్లాట్‌ఫార్మ్ మీద రావచ్చు.
2.భద్రత
భారతదేశంలో రాబోయే భద్రతా నిబంధనలకు కట్టుబడి ఉండటానికి మారుతి సుజుకి తన ఉత్పత్తులను తయారు చేయడానికి సిద్ధంగా ఉంది.ఇగ్నిస్ ఇప్పటికే ప్రక్క భాగం, వెనుక భాగం, ఆఫ్సెట్ మరియు పెడస్ట్రెయిన్ భద్రతా నిబంధనల ద్వారా వెళ్ళింది. అలానే అది డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బాగ్స్, ABS మరియు ISOFIX లు వంటి ప్రాధమిక లక్షణాలను కలిగి ఉంది.
3.పూర్తి LED హెడ్ల్యాంప్లు
మారుతి సుజుకి ఇగ్నీస్ యొక్క పరికర జాబితాలో పూర్తిస్థాయి LED శక్తితో పనిచేసే ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ ఫీచర్ ని అందిస్తుంది. ఇగ్నిస్ లో ఉండే ఈ ప్రొజెక్టర్లు అనేవి హై భీం మరియు లో భీం ని కూడా అందిస్తుంది మరియు కాంతి అనేది LED సెటప్ ద్వారా ఉంటుంది. ముఖ్యంగా, దీనిలో గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ సెగ్మెంట్లో గానీ లేదా దీనికంటే రెండు సెగ్మెంట్ల పైన గానీ ఏవీ LED హెడ్ల్యాంప్స్ ని కలిగి ఉండవు. ఇగ్నీస్ LED DRLలను మెయిన్ ల్యాంప్ మరియు ఫాగ్ ల్యాంప్స్ ప్రక్కన కనీసం టాప్ వేరియంట్ లో అయినా కలిగి ఉంటుంది.
4. గ్రౌండ్ క్లియరెన్స్
ఇగ్నిస్ చాలా పొడవైనది మరియు 180mm గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది. వీల్ బేస్ చాలా పొడవైనదిగా లేనప్పటికీ మరియు ఓవర్ హాంగ్స్ కూడా తక్కువగా ఉన్నా కూడా, ఇగ్నిస్ కి మంచి విధానం మరియు రోజువారీ అడ్డంకులకు తప్పించుకొని వెళ్ళగలిగే సామర్ధ్యం ఉంది.
5. ప్రామాణిక 15-ఇంచ్ వీల్స్
మారుతి సుజుకి మిగతా కార్లలో, ఎక్కువ లక్షణాలు ఉన్న వేరియంట్లలో పెద్ద సైజ్ అలాయ్ వీల్స్ లా ఇవ్వకుండా దాని యొక్క ఇగ్నీస్ అన్ని వేరియంట్స్ లో ఒకటే వీల్ సైజ్ ఇస్తుంది. ఇగ్నిస్ కారు మారుతి సుజుకి ఉత్పత్తిలో ఎప్పుడూ చూడని అలాయ్ వీల్స్ యొక్క కొత్త డిజైన్ తో అందించబడుతుంది. ప్రివ్యూ మాడల్ కోసం టైర్ స్పెసిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే 175/65 R15 వద్ద ఉంది.
6.కాస్మెటిక్ ఎంపికలు
బ్రజ్జా వలె, ఇగ్నిస్ కూడా డ్యుయల్ బాహ్య పెయింట్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. బయట పెయింట్ బ్లూ ఉంటే దాని యొక్క రూఫ్ తెలుపు లేదా బ్లాక్ రంగులో అందుబాటులో ఉంటుంది మరియు బయట పెయింట్ రెడ్ ఉంటే దాని రూఫ్ బ్లాక్ రంగులో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రారంభానికి, ఇగ్నిస్ ఈ ఎంపికలతో ఉంటూ మరియు మరికొన్ని కొనుగోలుదారుల ఇష్టానుసారంగా మార్చుకొనే అవకాశం కూడా కలిగి ఉంటుంది. ఈ బ్లూ కలర్ ఇగ్నీస్ ఏదైతే మాతో టెస్ట్ చేయబడిందో దానికి బ్లాక్ రూఫ్,బ్లాకెడ్ అవుట్ ORVMs మరియు బ్లాక్ అలాయ్ వీల్స్ కలిగి ఉంది. మరుతి సుజుకి కి i- క్రియేట్ ప్యాకేజ్ ని ఇగ్నీస్ తో అందించాలని ప్లాన్ చేస్తుంది అయితే నెక్సా కార్లకు అందించేందుకు సంస్థ కి కొంత సమయం పడుతుంది.
7. బూట్ స్పేస్
ఇగ్నిస్ లో ఉన్న 260 లీటర్ బూట్ స్పేస్ చాలా సామాను ను తీసుకోగలదు. వెనుక సీట్ మరింత సామాను స్థలానికి సరిపోయేలా 60:40 స్ప్లిట్ ఆప్షన్ పొందుతుంది, అయితే లోడింగ్ లిప్ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది.
8.లక్షణాలు
ఇగ్నిస్ ప్రీమియం ఉత్పత్తిగా ప్రారంభించబడుతూ, డ్యుయల్ ఎయిర్బ్యాగ్స్, ముందుగా చెప్పినట్లుగా ABS వంటి ప్రామాణిక ఫీచర్లు కలిగి ఉంటుంది. ఇగ్నిస్ యొక్క టాప్ వేరియంట్ ఈ క్రింది లక్షణాలను కలిగి ఉంటుంది:
- LED హెడ్ల్యాంప్స్
- LED DRLs
- క్రోం తో గార్నిష్ చేయబడిన ఫాగ్‌ల్యాంప్స్
- ఫ్రంట్ గ్రిల్ చుట్టూ క్రోం అవుట్ లైన్
- చుట్టూ బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్
- ORVM లపై టర్న్ ఇండికేటర్స్
- బ్లాకెడ్ అవుట్ A పిల్లర్ మరియు B పిల్లర్స్
- 15 "అల్లాయ్ చక్రాలు
- కీలెస్ ఎంట్రీ మరియు పుష్ బటన్ స్టార్ట్/స్టాప్
- వెనుక పార్కింగ్ సెన్సార్లు
- వెనుక డిఫేజర్, వైపర్ మరియు వాషర్
- బ్లాక్ ఐవరీ అంతర్గత ట్రిమ్
- AC వెంట్లలో కార్బన్ ఫైబర్ లాంటి ఇన్సర్ట్
- ABS మరియు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్
- ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ మరియు వెనుక డ్రమ్ బ్రేక్లు
- హెడ్ల్యాంప్ లెవలింగ్
- ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీటు
- 60:40 స్పిల్ట్ రేర్ సీటు
- డ్రైవర్ వైపు ఆటో అప్ / డౌన్ పవర్ విండోస్
- ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ మరియు ఫోల్డబుల్ ORVM లు
- క్రోం డోర్ హ్యాండిల్స్
- టెలిఫోనీ మరియు మ్యూజిక్ వ్యవస్థ కోసం నియంత్రణలతో కొత్త స్టీరింగ్ వీల్
- వాతావరణ నియంత్రణ
- మిర్రర్లింక్, ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు నావిగేషన్లతో 7-అంగుళాల టచ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్
- వెలుపలి ఉష్ణోగ్రత, టైం, ట్రిప్ మీటర్, తక్కువ ఇంధన హెచ్చరిక, ఇంధన సామర్ధ్యం, ఇంధన స్థాయి, ఇన్స్టెంట్ ఫ్యుయల్ ఎకానమీ తో మల్టీ ఇంఫర్మేషన్ డిస్ప్లే
- సీసా హోల్డర్లతో ఫ్రంట్ డోర్ పాకెట్స్
- వెనుక డోర్స్ పై బాటిల్ హోల్డర్స్
9.మిస్ అయిన లక్షణాలు
మారుతి సుజుకి ఇగ్నిస్ అగ్రశ్రేణి లో కూడా ఈ క్రింద చెప్పబడిన లక్షణాలు ఉండవు.
- మారుతి సుజుకి బాలెనోలో కనిపించే UV కట్ గ్లాస్
- లెదర్ అప్హోస్టరీ
10. ఇంజిన్ ట్రాన్స్మిషన్ ఎంపికలు
ఇగ్నీస్ కారు బాలేనోకి శక్తినిచ్చే అదే సెట్ ఇంజిన్లచే శక్తిని పొందుతుంది. ఇగ్నిస్ యొక్క పెట్రోల్ మరియు డీజిల్ రెండు కూడా 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆంట్ గేర్బాక్స్ తో అందుబాటులో ఉంటాయి. డీజిల్ 1.3 లీటర్ DDiS ఇంజన్ గా ఉండగా పెట్రోలు ఇంజన్ 1.2 లీటర్ VVT ఇంజన్ గా ఉంటుంది.
0 out of 0 found this helpful