• English
  • Login / Register

2018 మారుతి సుజుకి స్విఫ్ట్: ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

Published On మే 09, 2019 By jagdev for మారుతి స్విఫ్ట్ 2014-2021

దాని మునుపటి అవతార్ వలె కొత్త స్విఫ్ట్ కూడా అద్భుతంగా ఉంటుందా? తెలుసుకోవడానికి మరింత చదవండి.

అన్ని కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ వాహనాలు, రూ. 4.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వద్ద ప్రారంభించబడ్డాయి. మరిన్ని వివరాలను ఇక్కడ చదవండి.

మారుతి సుజుకి సంస్థ, భారతదేశంలో స్విఫ్ట్ను మే 2005 లో ప్రారంభించింది. దేశంలో దాని 12 ఏళ్లలో, స్విఫ్ట్ దాని విభాగంలో ప్రాధాన్యతనివ్వబడింది. ఈ కారును కొనుగోలుదారులు ఎంచుకోవడానికి, ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అంశాన్ని అందించే ఒక స్పోర్టి హాచ్బాక్ గా దాని స్థానాన్ని మెరుగుపరుచుకుంటూ వస్తుంది. ఇప్పుడు, కొత్త తరం స్విఫ్ట్ హ్యాచ్బ్యాక్ అందరి మనసులను కొల్లగొడుతుంది మరియు అద్భుతమైన అనేక అంశాలను కూడా మన ముందుకు తీసుకొస్తుంది. ఇది అవుట్గోయింగ్ మోడల్ తో పోలిస్తే అనేక అంశాలు, ఫీచర్లు భద్రతా అంశాలు చాలా జోడించబడతాయని వినియోగదారులు భావిస్తున్నారు. ఇది అన్నింటితో అందించబడుతుందా? మేము దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని భావిస్తున్నాము మరియు ఏ ఏ అంశాలతో మన ముందుకు అందించబడుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

ఆశ్చర్యకరమైనది: 40,000 ప్రీ-లాంచ్ బుకింగ్స్ ను చేరుకున్న 2018 మారుతి స్విఫ్ట్

Maruti Suzuki Swift

ఎక్స్టీరియర్స్

Maruti Suzuki Swift

స్విఫ్ట్ మరియు డిజైర్ లు, ముందు ప్రదర్శన పరంగా ఒకేలా కవలలు గా ఉన్నా, గతంలో గ్రిల్ డిజైన్ విషయంలో చిన్న తేడాలను కలిగి ఉన్నాయి. 2018 కొత్త స్విఫ్ట్ కూడా దానినే అనుసరిస్తుంది. ఉదాహరణకు, హెడ్ల్యాంప్స్ ఖచ్చితంగా అవే ఉంటాయి. బోనెట్ మరియు ఫ్రంట్ ఫెండర్లు కూడా ఇదే పద్ధతిలో రూపొందించబడ్డాయి. కానీ, ఈ సమయంలో, ఏ సారూప్యతలతో అందించబడుతున్నాయో తెలుసుకుందాం.

Maruti Suzuki Dzire

స్విఫ్ట్ మరియు డిజైర్ లు రెండూ కూడా షట్కోణ ఆకృతి కలిగిన ఫ్రంట్ గ్రిల్ తో అందించబడతాయి, కాకపొతే స్విఫ్ట్ పెద్దదిగా కనబడుతుంది కానీ, దాని చుట్టూ ఏ విధమైన క్రోమ్ లైనింగ్ అందించబడటం లేదు. ఫలితంగా, స్విఫ్ట్ తక్కువ పరిమాణంలో కనబడుతుంది మరియు మరింత దూకుడుగా కూడా కనిపిస్తోంది. స్విఫ్ట్ ముందు బంపర్ రూపకల్పన కూడా డిజైర్ పోలిస్తే భిన్నంగా ఉంటుంది. రెండు కార్లు రౌండ్ ఫాగ్ లాంప్ లను పొందుతాయి, స్విఫ్ట్ ఒక పలచని ఎయిర్ డాం ను పొందుతుంది, దీనికి రెండు వైపులా ఫాగ్ లాంప్లు విలీనం చేయబడ్డాయి, దీని వలన ఈ కారుకి మరింత స్పోర్టీ లుక్ జోడించబడుతుంది.

Maruti Suzuki Swift

దాగి ఉన్న వెనుక డోర్ హ్యాండిల్, స్విఫ్ట్ ను సైడ్ నుండి చుస్తే 3- డోర్ల హాచ్ లాగా కనిపిస్తుంది. ఇది ఒక స్వచ్ఛమైన రూపాన్ని కూడా అందిస్తుంది కానీ ఈ డోర్ హ్యాండిల్. సౌకర్యవంతంగా స్థానంలో లేదు.

శోధించండి - మారుతి స్విఫ్ట్ 2018: న్యూ వర్సెస్ ఓల్డ్ - ప్రధాన బేధాలు

Maruti Suzuki Swift

స్విఫ్ట్ డిజైర్ తో పోలిస్తే కొత్త స్విఫ్ట్ లో నలుపు రంగులో అందించబడిన ఏ పిల్లర్ చాలా నిటారుగా ఉంటుంది, ఇక్కడ ఇది మరింత అద్భుతంగా ఉంటుంది మరియు కారు రంగులో అందించబడుతుంది. కాబట్టి ఈ కార్లు రెండూ, వారి మునుపటి తరాలకు వ్యతిరేకంగా, ఇప్పుడు ప్రొఫైల్లో అసమానంగా కనిపిస్తాయి.

Maruti Suzuki Swift

ఇప్పుడు కనిపించే స్విఫ్ట్, వెనుక నుండి అద్భుతంగా కనిపించడం లేదు. వెనుక విండో స్క్రీన్ మెటల్ టచ్ తో మెటల్ (హాచ్ పై) బంపర్ కు ప్లాస్టిక్ లు అందించబడ్డాయి. వెనుకవైపు ఉన్న విండ్స్క్రీన్ యొక్క నిష్పత్తులు అసహ్యకరమైన బరువుతో కేవలం సాధారణంగా కనిపిస్తాయి. స్విఫ్ట్ కూడా మారుతి సుజుకి ఎరీనాలో ఉన్న మొట్టమొదటి కారు వలే వేరియంట్ బాడ్జింగ్ ను ఎక్కడా పొందటం లేదు. డీజిల్ వెర్షన్ యొక్క ఫ్రంట్ ఫెండర్లో మాత్రమే డిడిఐఎస్ చిహ్నం పొందుపరచబడి ఉంటుంది.

ఇప్పుడు మీరు మీ స్విఫ్ట్ ను వ్యక్తిగతీకరించవచ్చు - 2018 మారుతి స్విఫ్ట్ ఐ క్రియేట్ అనుకూలీకరణ పాకేజీలు వెల్లడయ్యాయి

Maruti Suzuki Swift

కొలతలు

 

మారుతి సుజుకి స్విఫ్ట్

 

పొడవు

3,840 మి.మీ (-10 మి.మీ)

వెడల్పు

1,735 మిమీ (+ 40 మి.మీ)

ఎత్తు

1,530 మిమీ (మారదు)

వీల్బేస్

2,450 మి.మీ (+ 20 మి.మీ)

గ్రౌండ్ క్లియరెన్స్

163 మిమీ (-7 మిమీ)

బూట్ స్పేస్

268 లీటర్లు (+58 లీటర్లు)

టైర్లు

185/65 ఆర్15

ఇంధన ట్యాంక్

37 లీటర్లు (-5 లీటర్లు)

ఇంటీరియర్

Maruti Suzuki Swift

స్విఫ్ట్ యొక్క డ్యాష్ బోర్డ్ మరియు స్టీరింగ్ వీల్ విషయానికి వస్తే, బూడిద రంగు ఇన్సర్ట్తో కూడిన ఆల్ బ్లాక్ కాబిన్ అందించబడుతుంది. కాబిన్ స్పోర్టీ లుక్ ను కలిగి ఉంటుంది ఇది ఇలా ఉండగా, ముందు వెర్షన్ కంటే ఇతర మారుతి సుజుకి కార్ల మాదిరిగా ప్లాస్టిక్ నాణ్యత మరియు పదార్థాల పరంగా ఇది చాలా ఎక్కువ. అంతేకాకుండా, ముందు వర్షెన్ తో పోలిస్తే ఇది మరింత అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ చెప్పుకోదగ్గ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే డాష్బోర్డ్ రూపకల్పన. ఇప్పుడు డిజైర్ కార్బన్ కాపీ లా లేదు. ఉదాహరణకు, మధ్యలో ఉన్న ఎయిర్ కాన్ వెంట్స్ స్విఫ్ట్ వాహనంలో వృత్తాకారంలో ఉంటాయి, అదే డిజైర్ విషయానికి వస్తే ట్రాపెజాయిడల్గా ఉంటాయి. స్విఫ్ట్ యొక్క ఎయిర్ కాన్ వెంట్లు కూడా వృత్తాకార మరియు దాని కాంపాక్ట్ సెడాన్ తోబుట్టువులతో పోలిస్తే బిన్నంగా ఉంటాయి. చూడటానికి, మరింత ప్రీమియం లుక్ ను కలిగి ఉంటాయి మరియు రహదారి నుండి వెళుతున్నప్పుడు కళ్ళు తిప్పుకోకుండా చూసేలా అందంగా ఉంటాయి. మొత్తంమీద, స్విఫ్ట్ లో అందించబడిన అంశాలు, డిజైర్ చాలా వరకు అంతర్గత భాగాలను కలిగి ఉన్నప్పటికీ, ఇప్పుడు దాని స్వంత మార్గాల్లో ఇది ప్రత్యేకమైనదిగా కొనసాగుతుంది.

Maruti Suzuki Swift

ముందు సీట్ల విషయానికి వస్తే, చాలా సహాయకంగా ఉంటాయి మరియు సరైన ప్రదేశాలలో కుషన్ సౌకర్యం అందించబడుతుంది - వెనుక మరియు షోల్డర్ భాగాలకు లుంబార్ మద్దతు ఇవ్వబడుతుంది. డ్రైవర్ సీటు, ఎత్తు కోసం సర్దుబాటు సౌకర్యాన్ని కలిగి ఉంది కానీ స్టీరింగ్ వీల్ మాత్రం ర్యాక్ సర్దుబాటును మాత్రమే  కలిగి ఉంది. ఒక టెలిస్కోపిక్ సర్దుబాటు సౌకర్యాన్ని అదనంగా అందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పొడవు డ్రైవర్లు తమ కాళ్ళను మరింత విస్తరించడానికి స్వేచ్ఛను పొందగలగటం వలన, అవుట్గోయింగ్ మోడల్తో పోలిస్తే ముందు భాగంలో ఎక్కువ లెగ్ స్పేస్ అందించబడింది. ముందు సీటు నుండి వీక్షణ చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఏ- స్తంభం నిటారుగా అందించబడింది. దీని వలన, ప్రక్క భాగాలు చాలా అద్భుతంగా కనబడతాయి. స్విఫ్ట్ వాహనాన్ని టర్నింగ్ చేయడానికి లేదా పార్కింగ్ చేయటానికి డ్రైవర్లకు చాలా సులభంగా ఉంటుంది.

Maruti Suzuki Swift

వెనుక భాగం విషయానికి వస్తే, నీ రూమ్ మునుపటి తరం స్విఫ్ట్ లో ఒక ప్రతికూలతగా ఉంది. దానిని ఈ కొత్త వెర్షన్ గుర్తించింది. కొత్త హెక్టెక్ట్ వేదికకు ధన్యవాదాలు తెలపాలి, ఎందుకంటే క్యాబిన్ లోపల మరింత విశాలమైన స్థలం అందించబడింది, అంతేకాకుండా దీని వీల్బేస్ 20 మిల్లీ మీటర్లకు పొడిగించబడింది, వెనుక నీ రూమ్ తో రాజీ పడకుండా ఇద్దరు పెద్దలు, కనీసం 5'8 అంగుళాలు ఉన్న వ్యక్తులు సులభంగా సౌకర్యవంతంగా కూర్చోవడం ఇప్పుడు సాధ్యమవుతుంది. లోడింగ్ సామర్ధ్యం కూడా అధికంగా 58 లీటర్ల వరకు పొడిగించడం జరిగింది. దీని వలన మరిన్ని సామాన్లు ఎక్కువగా పెట్టుకుందుకు సాయపడుతుంది.

Maruti Suzuki Swift

ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్

Maruti Suzuki Swift

కొత్త తరం స్విఫ్ట్, మునుపటి తరం లో అందించబడిన అదే ఉత్పాదనతో ఉత్పత్తిని అందించే అదే ఇంజిన్ల చేత శక్తివంతంగా కొనసాగుతుంది. అదే మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా అందించబడింది. అయితే ఇక్కడ అదనంగా కొత్త 5- స్పీడ్ ఏఎంటి అందించబడింది. ఇది వి మరియు జెడ్ రెండు వేరియంట్లలో రెండింటిలోనూ - పెట్రోల్ మరియు డీజిల్- ఆధారిత స్విఫ్ట్ లలో లభిస్తుంది. రెండు ఇంజిన్లు వారి స్వాభావిక లక్షణాలను కలిగి ఉన్నాయి - పెట్రోల్ గత 4,000 ఆర్పిఎమ్ మరియు డీజిల్ 2,000 ఆర్పిఎమ్ లో టర్బో కిక్స్గా విడుదలయ్యే రెండు యొక్క మరింత టార్క్ మరియు ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉండటం వలన మృదువుగా మరియు రిలాక్స్ చేయబడినది. మాన్యువల్ స్విఫ్ట్, లైట్ క్లాచ్ మరియు షార్ట్ గేర్బాక్స్ తో ఒక ఆనందకర కారుగా కొనసాగుతోంది. కానీ ఏఎంటి వెర్షన్, పట్టణాలలో అద్భుతం అని చెప్పవచ్చు.

Maruti Suzuki Swift

ఏఎంటి లేదా ఏజిఎస్ అని పిలవడానికి మారుతి సుజుకి ఇష్టపడుతుంది. చివరకు గేర్బాక్స్, ఒక కొండ, వాలు, ఫ్లాట్, రఫ్, చోక్-ఏ-బ్లాక్ లేదా ఓపెన్ ఎక్స్ప్రెస్వే  షిఫ్ట్లలో మంచి స్పందనలను అందించడమే కాకుండా మరింత అద్భుతంగా రైడ్ అనుభవాన్ని కలిగి ఉంటాయి మరియు థొరెటల్ ఇన్పుట్లు ఇప్పుడు మరింత మెరుగయ్యాయి. గేర్ షిఫ్టులతో కూడిన సాధారణ ఏఎంటి హెడ్నాడ్ కూడా అధిక పరిణామాలను పెంచుతుంది మరియు డీజిల్ ఇంజిన్ దాని కొన టార్క్ జోన్లో తగ్గించడంతో పాటు మినహాయింపుతో కూడా తగ్గించబడుతుంది. కొత్త స్విఫ్ట్లో అందించబడిన ఏఎంటి గేర్ లివర్ అధునాతన యూనిట్ మాత్రమే కాకుండా అద్భుతమైన పనితీరును కూడా (డిజైన్ పరంగా) అందిస్తుంది.

Maruti Suzuki Swift

స్పెసిఫికేషన్లు

 

2018 మారుతి సుజుకి స్విఫ్ట్

పెట్రోల్

డీజిల్

ఇంజిన్

1.2-లీటర్ కె- సిరీస్

1.3 లీటర్ డిడిఐఎస్ 190

పవర్

83 పిఎస్ @ 6000 ఆర్పిఎం

75 పిఎస్ @ 4000 ఆర్పిఎం

టార్క్

113 ఎన్ఎం @ 4,200 ఆర్పిఎం

190 ఎన్ఎం @ 2,000 ఆర్పిఎం

ట్రాన్స్మిషన్

5- స్పీడ్ ఎంటి / ఏ ఎంటి

5-స్పీడ్ ఎంటి / ఏ ఎంటి

వాహన బరువు

880 (-85 కిలోలు)

985 (-75కిలోలు)

హ్యాండ్లింగ్ మరియు రైడ్

Maruti Suzuki Swift

కొత్త స్విఫ్ట్ లో అందించబడిన కొత్త హార్టెక్ట్ ప్లాట్ఫాం అద్భుతాలను చేస్తోంది మరియు ఎప్పుడు అందించలేని విధంగా రోడ్డు వంపులలో కూడా మూడు అంకెల వేగాలను అందిస్తుంది. స్విఫ్ట్ కొంత బరువును కలిగి ఉన్నప్పటికీ, ముందున్న డీజిల్ మరియు పెట్రోలు వెర్షన్ లలో కంటే ఇది ఎక్కువ పనితీరును అందిస్తుంది. తేలికైన స్టీరింగ్ వీల్ ఇవ్వబడింది మరియు ఇది యూనిట్లకు బారీ కమ్యూనికేటివ్ కాదు, కానీ ఇది అస్పష్టంగా లేదు మరియు ఒక సరళ రేఖ నిర్వహించడానికి ఏ విధమైన ఇన్పుట్లు అవసరం ఉండవు. పార్కింగ్ సమయాలలో మరియు నగర ప్రయాణాలలో తేలికైన స్టీరింగ్ వీల్ ఆనందకరమైన రైడ్ అనుభూతిని అందిస్తుంది.

శోధన చేయండి: ఆటో ఎక్పో 2018 వద్ద ఉన్న టాప్ 5 హాచ్బ్యాక్లు - న్యూ స్విఫ్ట్, 45ఎక్స్, ఎలైట్ ఐ 20, ఫ్యూచర్- ఎస్ & టియాగో

Maruti Suzuki Swift

మారుతి సుజుకి మూడో తరం స్విఫ్ట్ కోసం సంస్థ సస్పెన్షన్ సెటప్ను ఆశ్రయించింది. నిజంగా అడ్డంకులు ఉన్న రహదారులపై నడుపుతున్నప్పుడు, ఈ మూడవ తరం స్విఫ్ట్, మరింత విశ్వసనీయ మరియు రోడ్డు మీద నియంత్రించబడే అనుభూతి అందించబడుతుంది. కఠినమైన ఉపరితలాలపై ప్రయాణిస్తున్నప్పుడు, క్యాబిన్లో ఉన్న మీకు స్పష్టమైన రోడ్ అనుభవం తెలుస్తుంది. ఏ విధంగానైనా రైడ్ సౌకర్యంగా ఉంటుంది, కానీ ఇది బాలెనో వలె మృదువైనది కాదు.

Maruti Suzuki Swift

సామగ్రి మరియు ఫీచర్లు

కొత్త స్విఫ్ట్ 4 వేరియంట్లలో లభిస్తుంది - అవి వరుసగా ఎల్, వి, జెడ్ మరియు జెడ్ +. ద్వంద్వ ముందు ఎయిర్ బాగ్స్, ఎబిఎస్ తో ఈబిడి మరియు బ్రేక్ అసిస్ట్, ముందు సీట్ బెల్ట్స్ ప్రీ టెన్షినార్లు మరియు ఫోర్స్ లిమిటార్లు మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీటు మౌంట్లు వంటి అన్ని అంశాలు, ఈ వాహనం యొక్క అన్ని వేరియంట్ శ్రేణిలో ప్రామాణికంగా అందించబడతాయి. ఏఎంటి ట్రాన్స్మిషన్, వి మరియు జెడ్ రకాలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. స్విఫ్ట్ యొక్క టాప్ జెడ్ + వేరియంట్ క్రింది లక్షణాలను పొందుతుంది:

Maruti Suzuki Swift

  • ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్

  • ఎల్ఈడి డే టైం రన్నింగ్ లైట్లు

  • ఆపిల్ కార్ప్లే, గూగుల్ ఆండ్రాయిడ్ ఆటో మరియు మిర్రర్లింక్ కనెక్టివిటీతో కూడిన 7- అంగుళాల స్మార్ట్ప్లే ఇన్ఫోటైన్ సిస్టమ్

Maruti Suzuki Swift

  • వెనుక-వీక్షణ కెమెరా మరియు వెనుక పార్కింగ్ సెన్సార్స్

  • ఫ్లాట్- బోటం లెదర్- చుట్టబడిన స్టీరింగ్ వీల్

​​​​​​​Maruti Suzuki Swift

  • ఆటో క్లైమేట్ కంట్రోల్

  • పుష్- బటన్ ఇంజిన్ స్టార్ట్ -స్టాప్ తో పాసివ్ కీ లెస్ ఎంట్రీ సిస్టమ్

Maruti Suzuki Swift

లక్షణాల పోలికలు : మారుతి సుజుకి స్విఫ్ట్ వర్సెస్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 వర్సెస్ ఫోర్డ్ ఫిగో

తీర్పు

మారుతి సుజుకి సంస్థ, కాంపాక్ట్ సెడాన్ తోటి వాహనం అయిన స్విఫ్ట్ ప్రవేశాన్ని భారతదేశంలో ఆలస్యం చేస్తుంది. మొదట డిజైర్ అందుబాటులోకి రావడం వలన రాబోయే మూడవ తరం స్విఫ్ట్ లో ఏ ఏ అంశాలు ఉండాలి అన్న విషయం ఒక కొలిక్కి వచ్చింది అని చెప్పవచ్చు. హార్టెక్ట్ ప్లాట్ఫార్మ్ ఆధారంగా రాబోతున్న ఈ కారు ముందు కంటే మరింత డైనమిక్ ప్యాకేజీ తో అలాగే అదనపు క్యాబిన్ రూమ్ లతో తయారుచేయబడుతుంది. ఎల్లప్పుడూ స్విఫ్ట్లో మిస్ అయ్యే అంశం ఏమిటి? ఇప్పుడు రాబోతున్న ఈ స్విఫ్ట్ లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా అందించబడుతుంది.

Maruti Suzuki Swift

మారుతి సుజుకి తన అసలు స్పోర్టి లుక్ తో వస్తుందని ఎంత మాత్రం ఊహించలేదు. ఈ హ్యాచ్బ్యాక్ను సురక్షితమైన మార్గంలో తీసుకువెళుతుంది. ఇక్కడ ఎదురౌతున్న పెద్ద ప్రశ్న ఏమిటంటే, ఇప్పడు అందించబడుతున్న మూడవ తరం స్విఫ్ట్, భర్తీ చేసిన దాని కంటే ఉత్తమమా?

స్విఫ్ట్ మరింత ఆచరణాత్మకంగా మారినప్పటికీ, ఇది ఈ సమయంలో నిలదొక్కుకునే శక్తిని పెంచుకోవడానికి అదనపు వినోద ఫీచర్లు అందించబడుతున్నాయి. కొత్త- తరం స్విఫ్ట్ లో అందించబడిన అంశాలు అదే విధమైన రీతిలో కొనసాగుతున్నాయి మరియు ఉత్తేజకరమైన ప్యాకేజీ అందించబడుతుంది.

ఇవి కూడా చదవండి : 2018 మారుతి సుజుకి స్విఫ్ట్ వేరియంట్ల వివరాలు

తాజా హాచ్బ్యాక్ కార్లు

రాబోయే కార్లు

తాజా హాచ్బ్యాక్ కార్లు

×
We need your సిటీ to customize your experience