షో రూమ్‌లలో అందుబాటులో ఉన్న సిట ్రోయెన్ eC3, టెస్ట్ డ్రైవ్ؚకు సిద్దం
సిట్రోయెన్ ఈసి3 కోసం shreyash ద్వారా ఫిబ్రవరి 27, 2023 12:36 pm ప్రచురించబడింది
- 40 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్ ధరలు త్వరలోనే ప్రకటిస్తారని అంచనా
-
ఈ eC3 వాహనాన్ని రూ. 25,000 ముందస్తు చెల్లింపుతో రిజర్వ్ చేసుకోవచ్చు.
-
320km పరిధిని అందించే 29.2kWh బ్యాటరీ ప్యాక్ؚతో వస్తుంది.
-
దీని ఎలక్ట్రిక్ మోటార్ 57PS, 142Nm పవర్, టార్క్‌ను అందిస్తుంది.
-
C3 తరహాలో డిజైన్, ఫీచర్‌లను ఈ వాహనంలో చూడవచ్చు.
-
రూ.11 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో సిట్రోయెన్ ఈ వాహనాన్ని అందించనుంది.
భారతదేశంలో సిట్రోయెన్ మొదటి ఎలక్ట్రిక్ వాహనం అయిన eC3, డీలర్‌షిప్ؚల వద్దకు చేరుకుంది. లభ్యతపై ఆధారపడి, కస్టమర్‌లు ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్ؚబ్యాక్ టెస్ట్ డ్రైవ్ؚలను కూడా చేయవచ్చు. eC3 హ్యాచ్ؚబ్యాక్ ధరలు ప్రస్తుతానికి ప్రకటించకపోయిన, ఈ వాహన బుకింగ్ؚలు ప్రారంభమై నెల గడుస్తుంది, రూ.25,000 ముందస్తు చెల్లింపుؚతో బుక్ చేసుకోవచ్చు.
ఇది ఎలా కనిపిస్తుంది?
కుడి వైపు ఫ్రంట్ ఫెండర్ EV ఛార్జింగ్ ఫ్లాప్ తప్ప, eC3 దాదాపుగా సాధారణ C3 హ్యాచ్ؚబ్యాక్ క్రాస్ ఓవర్ؚను పోలి ఉంటుంది. షోరూమ్ؚలోకి ప్రవేశించిన యూనిట్, ఆవిష్కరించిన స్పెక్ؚలో ఉన్నట్లే, పొలార్ వైట్ రూఫ్ؚతో జెస్టీ ఆరెంజ్ ఫినిష్ؚతో ఉంది.
ఇది కూడా చదవండి: eC3 ఎలక్ట్రిక్ హ్యాచ్ؚబ్యాక్ؚతో ఫ్లీట్ మార్కెట్ؚలో ప్రవేశించనున్న సిట్రోయెన్
ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్ؚబ్యాక్ లోపలి భాగంలో, C3లో ఉన్న సౌకర్యాలను కలిగి ఉంది. అండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ؚప్లేతో 10.2 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ؚమెంట్ సిస్టమ్, మాన్యువల్ AC, మరియు డిజిటైజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి అందిస్తున్న ఫీచర్‌లలో కొన్ని. ఒకే ఒక గమనించగలిగిన తేడా గేర్ సెలక్టర్ స్థానంలో వచ్చిన టోగుల్ డ్రైవ్ మోడ్ సెలక్టర్.
డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ؚలు, EBDతో ABS, వెనుక పార్కింగ్ సెన్సర్‌లు, ప్రయాణీకుల భద్రత కోసం అందించబడ్డాయి.
ఇది కూడా చూడండి: ఈసారి ఇంటీరియర్‌లను చూపుతూ, మళ్ళీ కెమెరాకు చిక్కిన 3-వరుసల సిట్రోయెన్ C3
EV పవర్ ట్రెయిన్ & ఛార్జింగ్ వివరాలు
ఈ eC3 57PS, 143Ns పవర్, టార్క్‌ను అందించే ఎలక్ట్రిక్ మోటార్ؚతో జోడించిన 29.2kWh బ్యాటరీ ప్యాక్ؚను ఉపయోగిస్తుంది. ఇది 0 నుండి 60 kmphను 6.8 సెకన్‌లలో అందుకుంటుంది, 320km (MIDC రేటెడ్) డ్రైవింగ్ పరిధిని వాగ్దానం చేస్తుంది.
ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్ؚబ్యాక్ؚను, క్రింది ఛార్జింగ్ ఎంపికలను ఉపయోగించి చార్జ్ చేయవచ్చు:
15A ప్లగ్ పాయింట్ (10 నుండి 100% వరకు) |
10 గంటల 30 నిమిషాలు |
DC ఫాస్ట్ చార్జర్ (10 నుండి 80% వరకు) |
57 నిమిషాలు |
ధరల అంచనా మరియు పోటీదారులు
eC3 ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ధరలను సిట్రోయెన్ ఇంకా వెల్లడించలేదు, కానీ ఇది రూ.11 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతుంది అని అంచనా. ఇది ఎంచుకోగలిగిన అనేక విజువల్ వ్యక్తిగతీకరణలతో లివ్, ఫీల్ అనే రెండు వేరియెంట్‌లలో మాత్రమే అందించబడుతుంది. ఇది టాటా టియాగో EV, టాటా టిగోర్ EV వంటి వాటితో పోటీ పడుతుంది.
0 out of 0 found this helpful