• English
  • Login / Register

7 కలర్ ఎంపికలలో లభిస్తున్న 2024 Hyundai Creta

హ్యుందాయ్ క్రెటా కోసం ansh ద్వారా జనవరి 18, 2024 12:24 pm ప్రచురించబడింది

  • 742 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఇది 6 మోనోటోన్ మరియు 1 డ్యూయల్-టోన్ షేడ్ లో లభిస్తుంది, ఫియరీ రెడ్ షేడ్ తిరిగి పొందుతుంది

2024 Hyundai Creta Colour Options

2024 హ్యుందాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్ ఎట్టకేలకు భారతదేశంలో విడుదల అయింది. ఇది కొత్త ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్, కొత్త ఫీచర్లు మరియు మరింత శక్తివంతమైన టర్బో-పెట్రోల్ ఇంజిన్తో పరిచయం చేయబడింది. కొత్త క్రెటా కోసం బుకింగ్స్ తెరవబడ్డాయి, దీని ధర రూ.11 లక్షల నుండి ప్రారంభమవుతుంది (పాన్-ఇండియా ఎక్స్-షోరూమ్). హ్యుందాయ్ ఈ కాంపాక్ట్ SUV కారును ఏడు కలర్ ఎంపికలలో ప్రవేశపెట్టారు, అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి:

2024 Hyundai Creta Atlas white

అట్లాస్ వైట్

2024 Hyundai Creta Abyss Black Pearl

అబిస్ బ్లాక్ పెర్ల్

2024 Hyundai Creta Fiery Red

ఫియరీ రెడ్

2024 Hyundai Creta Ranger Khaki

రేంజర్ ఖాకీ

2024 Hyundai Creta Robust Emerald Pearl

రోబస్ట్ ఎమరాల్డ్ పర్ల్ (కొత్త)

టైటాన్ గ్రే

2024 Hyundai Creta Atlas White Dual-tone

అట్లాస్ వైట్ + అబిస్ బ్లాక్

కొత్త హ్యుందాయ్ క్రెటా 6 మోనోటోన్ మరియు డ్యూయల్-టోన్ షేడ్ తో సహా మొత్తం 7 కలర్ ఎంపికలలో లభిస్తుంది. డెనిమ్ బ్లూ, నైట్ బ్లాక్ మరియు టైఫూన్ సిల్వర్ కలర్ షేడ్స్ దాని ప్రీ-ఫేస్ లిఫ్ట్ మోడల్ లో అందుబాటులో ఉన్నాయి, కాని ఇప్పుడు అందుబాటులో లేవు.

పవర్ ట్రైన్ ఎంపికలు

2024 Hyundai Creta Diesel Engine

హ్యుందాయ్ క్రెటాలో అదే 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లను అందిస్తున్నారు. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మరియు CVT ఆటోమేటిక్తో జతచేయబడిన పెట్రోల్ యూనిట్ 115 PS శక్తిని మరియు 144 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో జతచేయబడిన 1.5-లీటర్ డీజల్ ఇంజన్ 116 PS శక్తిని మరియు 250 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

ఇది కూడా చదవండి: ఇండియా-స్పెక్ హ్యుందాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్ వర్సెస్ ఇంటర్నేషనల్ క్రెటా ఫేస్ లిఫ్ట్: వ్యత్యాసం ఏమిటి?

ప్రీ-ఫేస్ లిఫ్ట్ క్రెటాలో 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఉంది, ఇది కొంతకాలం క్రితం నిలిపివేయబడిం. ఇప్పుడు హ్యుందాయ్ ఫేస్ లిఫ్టెడ్ క్రెటాలో 7-స్పీడ్ DCTతో జతచేయబడిన 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ను అందిస్తున్నారు, ఇది 160 PS శక్తిని మరియు 253 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. తో భర్తీ చేయబడింది. ఇది కియా సెల్టోస్తో సరిపోలిన సెగ్మెంట్లో అత్యంత శక్తివంతమైన టర్బో-పెట్రోల్ ఇంజన్.

ఫీచర్లు & భద్రత

2024 Hyundai Creta Cabin

కొత్త హ్యుందాయ్ క్రెటాలో డ్యూయల్ 10.25 అంగుళాల డిస్ప్లే (టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే), వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, 8-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు మరియు పనోరమిక్ సన్రూఫ్ ఉన్నాయి.

ఇందులో ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్, 360 డిగ్రీల కెమెరా వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. అంతేకాక ఇందులో లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) కూడా ఉన్నాయి.

ధర & ప్రత్యర్థులు

2024 Hyundai Creta

2024 హ్యుందాయ్ క్రెటా ధర రూ.11 లక్షల నుండి రూ.20 లక్షల మధ్య (పరిచయం, ఎక్స్-షోరూమ్) ఉంది. ఇది కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, వోక్స్వాగన్ టైగూన్, స్కోడా కుషాక్,  MG ఆస్టర్, హోండా ఎలివేట్, సిట్రోయెన్ C3 ఎయిర్ క్రాస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

మరింత చదవండి:  హ్యుందాయ్ క్రెటా 2024 రోడ్ ధర

was this article helpful ?

Write your Comment on Hyundai క్రెటా

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience