గ్లోబల్ NCAPలో మరొకసారి విఫలమైన మారుతి వ్యాగన్ R
మారుతి వాగన్ ఆర్ కోసం rohit ద్వారా ఏప్రిల్ 05, 2023 03:11 pm ప్రచురించబడింది
- 39 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
2023 వ్యాగన్ R ఫుట్ؚవెల్ ప్రాంతం మరియు బాడీషెల్ ఇంటిగ్రిటీలు “అస్థిరంగా” ఉన్నట్లు పేర్కొనబడ్డాయి
-
ఇది వయోజనులు మరియు పిల్లల ఆక్యుపెంట్‌ల భద్రత పరంగా వరుసగా ఒకటి మరియు సున్నా స్టార్‌లను పొందింది.
-
వ్యాగన్ R పై 2019లో కూడా క్రాష్-టెస్ట్ؚను నిర్వహించారు, అప్పుడు రెండు విభాగాలలో రెండు స్టార్‌లను సాధించింది.
-
2023 వ్యాగన్ R 34 పాయింట్‌లకు 19.69 పాయింట్‌లను పొందింది.
-
దీని పిల్లల ఆక్యుపెంట్ భద్రత స్కోర్ 49 పాయింట్‌లకు 3.40 పాయింట్‌లను పొందింది.
-
ప్రామాణిక భద్రత ఫీచర్‌లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ؚలు, EBDతో ABS మరియు రేర్ పార్కింగ్ సెన్సర్‌లు ఉన్నాయి.
తమ #SafeCarsForIndia ప్రచారంలో భాగంగా గ్లోబల్ NCAP 2023 మారుతి వ్యాగన్ Rతో సహా కొత్త కార్‌లపై క్రాష్-టెస్ట్ؚను నిర్వహించింది. ఈ కారు వయోజనుల ఆక్యుపెంట్ భద్రత విషయంలో పేలవమైన ఒక స్టార్ రేటింగ్ؚను, పిల్లల ఆక్యుపెంట్ భద్రతలో సున్నా రేటింగ్ؚను పొందింది. ఈ హ్యాచ్‌బ్యాక్ 2019 కంటే ముందు పరీక్షించబడింది, ప్రతి విభాగంలో రెండు స్టార్‌లను పొందింది అని గుర్తు చేస్తున్నాము. ఆ సమయంలో, ఈ టెస్ట్ؚలు ఇప్పుడు ఉన్నంత కఠినంగా లేవు, ఇప్పుడు సైడ్ ఇంపాక్ట్, సైడ్ పోల్ ఇంపాక్ట్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) టెస్టులు కూడా ఇందులో చేరాయి.
డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్‌లు, EBDతో ABS ఫీచర్‌లతో వచ్చే 2023 వ్యాగన్ R అత్యంత బేసి వర్షన్‌ను పరీక్షించారు. సైడ్ ఎయిర్ బ్యాగులు లేని కారణంగా వ్యాగన్ Rకు సైడ్ ఇంపాక్ట్ పోల్ టెస్ట్ నిర్వహించలేదు. ESC టెస్ట్ విషయానికి వస్తే, ఈ హ్యాచ్ؚబ్యాక్ؚలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాంను (ESP) అందించక ముందు దీన్నీ నిర్వహించారు అని భావిస్తున్నాము.
వయోజన ప్రయాణికుల రక్షణ
ఫ్రంటల్ ఇంపాక్ట్ (64kmph)
వయోజనుల ఆక్యుపెంట్ భద్రతలో 2023 వ్యాగన్ R 34 పాయింట్‌లకు 19.69 పాయింట్‌లను సాధించింది (ఇంతకు ముందు 17 పాయింట్‌లకు 6.93 పాయింట్‌లను సాదించింది). డ్రైవర్ తలకు “మెరుగైన” మరియు ప్రయాణీకుడికి “తగినంత” భద్రత లభిస్తుంది. వారి మెడకు “తగినంత” భద్రత లభిస్తుంది. డ్రైవర్ ఛాతీకి లభించే భద్రత ‘పేలవంగా” పేర్కొనబడింది, ప్రయాణీకుల ఛాతీకి లభిస్తున్న రక్షణ “మెరుగైనదిగా” రేట్ చేయబడింది. డ్రైవర్ మరియు ప్రయాణీకుల మోకాళ్ళకు భద్రత “మోస్తరుగా” లభిస్తుంది.
డ్రైవర్ కాలి ఎముక భద్రత “మెరుగైన మరియు పేలవంగా”, ప్రయాణీకుడి కాలి భద్రత “తగినంత” రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు. హ్యాచ్ؚబ్యాక్ ఫుట్ؚవెల్ మరియు బాడీషెల్ؚలను “అస్థిరమైనవిగా” రేట్ చేశారు, అంతేకాకుండా, మరింత లోడింగ్ؚలను తట్టుకునే సామర్ధ్యం కారుకు లేదని పేర్కొన్నారు.
సైడ్ ఇంపాక్ట్ (50kmph)
సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ؚలో తల, కడుపు మరియు పెల్విస్ భాగాలకు రక్షణ “తగినంత” అని, ఛాతీకి రక్షణ “మోస్తరు” అని పేర్కొనబడింది.
ఇది కూడా చదవండి: గ్లోబల్ NCAP క్రాస్ టెస్ట్ؚలో స్విఫ్ట్‌తో పోలిస్తే మెరుగైన పనితీరును ప్రదర్శించిన మారుతి ఆల్టో K10
పిల్లల ఆక్యుపెంట్ భద్రత
పిల్లల ఆక్యుపెంట్ భద్రతؚలో వ్యాగన్ R 49 పాయింట్‌లకు 3.40 పాయింట్‌లను పొందింది. 2019 క్రాష్ టెస్ట్ؚలో, హ్యాచ్ؚబ్యాక్ ఈ విభాగంలో రెండు-స్టార్ రేటింగ్ؚలను సాధించి, 49 పాయింట్‌లకు 16.33 పాయింట్‌లను పొందింది.
ఫ్రంటల్ ఇంపాక్ట్ (64kmph)
మూడు సంవత్సరాల వయసు పిల్లల కోసం చైల్డ్ సీట్‌ను ముందుకు ఉండేలా అమర్చారు, కానీ ఇంపాక్ట్ సమయంలో ఇది ఫార్వర్డ్ మూవ్మెంట్ؚను నివారించలేకపోయింది, తత్ఫలితంగా తలకు గాయాలు అయ్యే అవకాశం అధికంగా ఉంటుంది. మరొకవైపు, ఒకటిన్నర సంవత్సరాల వయసు డమ్మీని వెనుకకు చూస్తూ ఉండేలా అమర్చారు, ఇందులో తలకు అధిక ప్రమాదం మరియు ఛాతీ భాగానికి “బలహీనమైన” రక్షణ ఉంటుంది.
పిల్లల ఆక్యుపెంట్‌ల భద్రతలో వ్యాగన్ R సున్నా స్టార్‌లను పొందడానికి కారణం సీటింగ్ పొజిషన్ؚలు అన్నిటికీ మూడు-పాయింట్‌ల సీట్ బెల్ట్ؚలు లేకపోవడం అని సేఫ్టీ అసెస్మెంట్ బాడీ ప్రకటించింది. ముందు ప్రయాణీకుడి స్థానంలో చైల్డ్ రిస్ట్రైంట్ సిస్టమ్ (CRS)ను అమర్చితే, సహ-డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ؚను డిస్ؚకనెక్ట్ చేయగలిగే అవకాశాన్ని మారుతి సుజుకి అందించడం లేదు.
2023 మారుతి వ్యాగన్ Rలో భద్రత కిట్
వ్యాగన్ Rలో మారుతి డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్‌లు, EBDతో ABS, ESP మరియు రేర్ పార్కింగ్ సెన్సర్ ఫీచర్‌లను ప్రామాణికంగా అందిస్తుంది. ఈ ప్రామాణిక భద్రత ఫీచర్‌లు కాకుండా ISOFIX చైడ్ సీట్ యాంకరేజ్ؚలు, ప్రయాణీకులు అందరికి త్రీ-పాయింట్ సీట్ బెల్టులతో సహా అవసరమైన ఇతర ఫీచర్‌లను వ్యాగన్ Rలో అందించడం లేదు.
వ్యాగన్ R ప్రస్తుతం నాలుగు విస్తృత వేరియెంట్‌లుగా అందించబడుతుంది: LXi, VXi, ZXi మరియు ZXi+. దీని ధరలు రూ.5.53 లక్షల నుండి రూ.7.41 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకు ఉన్నాయి.
ఇక్కడ మరింత చదవండి: వ్యాగన్ R ఆన్ؚరోడ్ ధర
0 out of 0 found this helpful