2015 హోండా జాజ్ నుండి ఎదురుచూస్తున్న కొత్త మార్పులు ఏమిటి?

హోండా జాజ్ 2014-2020 కోసం raunak ద్వారా జూన్ 16, 2015 12:47 pm ప్రచురించబడింది

జాజ్, దాదాపుగా ప్రతి అంశంను దాని యొక్క యుఎస్ పి తో పోల్చదగిన విధంగా తయారుచేస్తోంది. ఒకవేళ హోండా ధరలు సరైనవి అయితే, అవి మేము హోండా నుండి ఆశిస్తున్నట్లుగా ఉంటాయి, అలాగే జాజ్ కూడా వాటి సంస్థలను తీవ్రంగా ఆడిస్తుంది అనడం లో అతిశయోక్తి ఏమి లేదు.   

జైపూర్: హోండా తను తయారు చేసిన జాజ్ ను మరల తిరిగి జులై 8న పునః ప్రారంభించనుంది. దాని సాంకేతిక వివరాలను మేము బయట పెట్టాము మరియు దానిని టెస్ట్ డ్రైవ్ కూడా చేశాము. అది మనకి ఆఫర్ చేస్తున్న కొత్త అంశాలేంటో చూద్దాం!

బాహ్యభాగాలు

  • హోండా తన మోనో -వాల్యూమ్ డిజైన్ తో ఈ కొత్త జాజ్ రాబోతుంది. ఇది ఒక విశాలమైన క్యాబిన్ మరియు బూట్ తో రాబోతుంది.
  • హోండా సిటీ లో ఉండే అత్యాధునిక లక్షణాలతో మరియు స్టైలింగ్ గా రాబోతుంది.

  • ఈ జాజ్ యొక్క ముందరి భాగం సెడాన్ ను పోలి ఉంటుంది. అయితే, సిటీ లో ఉండే క్రోమ్ మోతాదు పోలిస్తే ఈ జాజ్ లో నల్లటి గ్రిల్ అందించబడుతుంది.

  • ఈ హాచ్బాక్ లో ఎల్ ఈ డి చుంకియర్ టైల్ ల్యాంప్స్ అందించబడతాయి.
  • ఈ జాజ్ యొక్క వీల్స్, 5 అంగుళాల స్పోక్ అల్లాయ్ వీల్ అందించబడతాయి. ఈ వీల్స్ రేడియల్ టైర్లతో కప్పబడి ఉంటాయి, వీటి యొక్క పరిమాణం 175/65 R15

కొలతలు

  • పొడవు: 3955 మిమీ
  • వెడల్పు: 1694 మిమీ
  • ఎత్తు: 1544 మిమీ
  • వీల్బేస్: 2530 మిమీ
  • గ్రౌండ్ క్లియరెన్స్: 165 మిమీ
  • ఇంధన ట్యాంక్ కెపాసిటీ 40 లీటర్లు

అంతర్గత భాగాలు

  • సిటీ లో ఉండే డాష్బోర్డ్, ఇప్పుడు జాజ్ లో రాబోతుంది. ఈ జాజ్ యొక్క లోపలి భాగం బ్లాక్ ఇంటీరియర్స్ తో మరియు వెండి చేరికలతో అలంకరించబడి ఉంటుంది.
  • ఈ జాజ్ యొక్క దిగువ శ్రేణి వేరియంట్లలో బీజ్ కలతో రాబోతున్నాయి. అయితే అగ్ర శ్రేణి వేరియంట్లలో అల్ల్ బ్లాక్ ఇంటీరియర్స్ తో పాటు బ్లాక్ అపోలిస్ట్రీ తో రాబోతున్నాయి.

  • ఇది రెండు సమాచార వ్యవస్థ ఎంపికలను ఆప్షనల్ గా ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. దీనిలో ఒకటి 5 అంగుళాల నాన్ టచ్ స్క్రీన్ మరియు రెండవది పెద్ద 6.2 అంగుళాల టచ్ స్క్రీన్ వ్యవస్థ
  •  రెండూ కూడా స్టీరింగ్ వీల్ పై నియంత్రణలను కలిగి ఉంటుంది మరియు బ్లూటూత్ ఫోన్ ఇంటిగ్రేషన్, రివర్స్ కెమెరా వంటి వాటితో రాబోతున్నాయి. అయితే టచ్ స్క్రీన్ వ్యవస్థ లో సాటిలైట్ అధారిత నావిగేషన్ వ్యవస్థ మరియు వీడియో ప్లేబాక్ వంటివి అధనంగా ఇవ్వబడతాయి.  
  • సిటీ లో ఉండే క్లైమేట్ కంట్రోల్ తో పాటు అదే టచ్ కెపాసిటివ్ బటన్లు దీనిలో కూడా అందించబడతాయి.

  • ఈ విభాగంలో, జాజ్ అత్యధికంగా 354 లీటర్ల బూట్ వైశాల్యాన్ని కలిగి ఉంటుంది. దీనితో పోటీ పడే ఈ కారులో నైనా 300 లీటర్లు కంటే ఎక్కువ బూట్ వైశాల్యాన్ని అందించింది అంటే అది సెడాన్ అని అర్ధం.
  • ఈ జాజ్ లో 881 లీటర్ల కార్గో వాల్యూం అందించబడుతుంది.
  • బ్లాక్ ఇంటీరియర్స్ కలిగిన జాజ్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లో, ముందు జాజ్ లో అందించబడిన మేజిక్ సీట్స్ దీనిలో కూడా అందించబడతాయి. అంతేకాకుండా, నాలుగు వేర్వేరు మోడ్ లు కలిగిన లగేజ్ కేరియింగ్ తో రాబోతుంది అవి ఏమిటంటే, యుటిలిటీ మోడ్, లాంగ్ మోడ్, టాల్ మోడ్, మరియు రిఫ్రెష్ మోడ్
  • ఈ విభాగంలో ఈ మేజిక్ సీట్లు అందించడం అనేది ఒక గొప్ప విషయం అని చెప్పవచ్చు.     

ఇంజన్లు

  • పాత జాజ్ లో 1.2 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజెన్ తో మాత్రమే వచ్చేవి. ఇప్పుడు కూడా ఈ పెట్రోల్ ఇంజెన్ తో పాటు డీజిల్ ఇంజెన్ తో కూడా రాబోతుంది. జాజ్ లో డీజిల్ వేరియంట్లు రావడమనేది మొదటిసారి అని చెప్పవచ్చు.
  • ఏఆర్ఏఐ సర్టిఫికేట్ ద్వారా అధిక ఇంధన సామర్ధ్యాన్ని ఇవ్వడం కోసం 1.5 లీటర్ ఐ-డిటెక్ డీజిల్ ఇంజెన్ ను తో రాబోతుంది. ఈ ఇంజెన్ 27.3 కంప్ల్ మైలేజ్ ను అందిస్తుంది.
  • 1.2 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజెన్ మాన్యువల్ వెర్షన్లో 18.7kmpl మైలేజ్ ను ఇవ్వగా, ఆటోమేటిక్ వెర్షన్ లో 19kmpl మైలేజ్ ను అందిస్తాయి. 
  • ఈ డీజిల్ ఇంజెన్ లు 1498cc స్థానభ్రంశాన్ని కలిగి, 3600rpm వద్ద 100PS పవర్ ను ఉత్పత్తి చేస్తాయి. అలాగే, 1750rpm వద్ద 200Nm గల అత్యధిక టార్క్ ను విడుదల చేస్తాయి. అంతేకాకుండా ఈ డీజిల్ ఇంజెన్ లు 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్ సిస్టమ్ తో జత చేయబడి ఉంటాయి.
  • ఈ వాహనాల పెట్రోల్ ఇంజెన్ లు 1198cc స్థానభ్రంశాన్ని కలిగి, 6000rpm వద్ద 90PS పవర్ ను ఉత్పత్తి చేస్తాయి. మరియు 4800rpm వద్ద అత్యధికంగా 110Nm గల టార్క్ ను విడుదల చేస్తాయి. అంతేకాకుండా ఈ పెట్రోల్ ఇంజెన్ లు 5-స్పీడ్ మాన్యువల్ లేదా సివిటి ఆటోమేటిక్ విత్ పెడల్ షిప్టర్స్ తో జత చేయబడి ఉంటాయి.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన హోండా జాజ్ 2014-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience