వోక్స్వాగెన్ ఇండియా కుంభకోణం : పఒలో, వెంటో, జెట్టా మరియూ ఆడీ ఏ4 యొక్క ఎమిషన్ విడుదలలో తేడాలు ఉన్నాయి అని ఏఆర్ఏఐ వారు తెలిపారు

నవంబర్ 05, 2015 03:29 pm raunak ద్వారా ప్రచురించబడింది

అంతర్జాతీయంగా వోక్స్వాగెన్ వారు ఈఏ189 డీజిల్ ఇంజిన్ల విషయంలో ఎమిషన్ నియమాలను మోసపూరితంగా సాఫ్ట్‌వేర్ సహాయంతో ఉత్తిర్ణం సాధించాము అని ఒప్పుకున్నారు. భారతదేశంలో తనిఖీలో ఉన్న కార్ల జాబితాలో వెంటో, జెట్టా మరియూ ఆడీ ఏ4 లు ఉన్నాయి. కాకపోతే,  అటువంటి ఇంజిన్లనే వాడుతున్న స్కోడా పేరు ఇక్కడ ప్రస్తావనకి రాకపోవడం.

జైపూర్: భారతదేశ ప్రభుత్వం  భారతీయ అనుబంధ  వోక్స్వాగెన్ గ్రూప్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్  కి నోటీసు జారీ చేసింది. ఏఆర్ఏఐ - ఆటోమోటివ్ రీసర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా,  హెవీ ఇండస్ట్రీస్ మినిస్ట్రీస్ దిగువన నడుస్తున్న ఈ సంస్థ వారు వోక్స్వాగెన్ ఇండియాని పరీక్షలో ఇంకా ఆన్-రోడ్ ఎమిషన్ ల తేడాలపై వివరణ ఇవ్వలి అని అడగటం జరిగింది.  అంతర్జాతీయంగా, వోక్స్వాగెన్ వారు పరీక్షలో వెలువడిన దాని కంటే బయట 40% అధికంగా ఎమిషన్ ని విడుదల చేయడం, ఈ మోసపూరిత విధానాన్ని కంపెనీ వారు అంగీకరించడం జరిగింది.

జర్మన్ తయారీదారిచే ఈ డీజిల్ కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతోంది. దీనిని డీజిల్ గేట్ కుంభకోణం అని సంబోధిస్తున్నారు. ఆటోమొబైల్స్ చరిత్రలో అత్యంత పెద్ద కుంభకోణంగా దీనిని భావిస్తున్నారు!  

నివేదిక ప్రకారం, ఏఆర్ఏఐ వారు ఈ తయారీదారికి రెండు వారాల నోటీసుని అందించారు. " వేర్వేరు వాహనాలు వేర్వేరు విడుదల ని అందించడం గమణించడం అయ్యింది. ఇది సమాధానం కోరేందుకు బలమైన కారణం మరియూ మేము సరిపడ సమయం కూడా వివరణకై అందించడం జరిగింది. దాని తరువాత, మేము ఏమి చెయ్యాలి అనే విషయంపై నిర్ణయం తీసుకుంటాము," అని హెవీ ఇండస్ట్రీస్ మినిస్ట్రీకి అడిషనల్ సెక్రెటరీ అయిన  అంబుజ్ శర్మ గారు ఈటీ ఆటో కి తెలపడం జరిగింది. పైగా, ఆడీ ఏ6, స్కోడా ఆక్టేవియా ఇంకా సుపర్బ్ కూడా ఇవే ఇంజిన్లను వాడటం కారణంగా ఇటువంటి సమస్య వీటితో కూడా తలెత్తే అవకాశం ఉంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience