Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

వోల్వో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV ని పరిచయం చేస్తుంది: XC 40 రీఛార్జ్

వోల్వో ఎక్స్ 2018-2022 కోసం rohit ద్వారా అక్టోబర్ 21, 2019 04:35 pm సవరించబడింది

ఇది వోల్వో యొక్క కాంపాక్ట్ SUV, XC 40 పై ఆధారపడింది మరియు ఇది బ్రాండ్ నుండి వచ్చిన మొదటి పూర్తి EV

  • వోల్వో ఎలక్ట్రిక్ కార్ల కోసం కొత్త ‘రీఛార్జ్'సబ్ బ్రాండ్‌ను ప్రవేశపెట్టింది.
  • XC40 రీఛార్జ్ అనేది రీఛార్జ్ లైనప్ నుండి వచ్చిన మొదటి కారు.
  • ఇది రెండు ఎలక్ట్రిక్ మోటారులతో కలిపి 408Ps మరియు 78 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో కలిపి లభిస్తుంది.
  • వోల్వో XC 40 రీఛార్జిలో 400 కిలోమీటర్ల రేంజ్ ని మనకి అందిస్తుంది.
  • ఇది వచ్చే ఏడాది భారతదేశంలో ప్రారంభించబడే సూచనలు ఉన్నాయి.

వోల్వో కార్స్ దాని చిన్న SUV సమర్పణ XC40 ఆధారంగా, తన మొట్టమొదటి పూర్తి EV XC40 రీఛార్జిని విడుదల చేసింది. XC40 రీఛార్జ్ ఎలక్ట్రిఫైడ్ కార్ పోర్ట్‌ఫోలియోలో ఒక భాగంగా పరిచయం చేస్తూ, వోల్వో కొత్త ‘రీఛార్జ్' సబ్ బ్రాండ్ కింద ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. స్వీడన్ కార్ల తయారీదారు ప్రతి సంవత్సరం కొత్త పూర్తి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయాలని యోచిస్తున్నాడు, తద్వారా 2025 నాటికి మొత్తం ప్రపంచ అమ్మకాలలో యాభై శాతం EV లు ఉంటాయి.

XC40 రీఛార్జ్ ప్రామాణిక SUV కి చాలా పోలి ఉంటుంది. “రీఛార్జ్” బ్యాడ్జ్ బూట్ లిడ్ పై మరియు ముందు భాగంలో కొద్దిగా మార్పు చేయబడిన గ్రిల్ పై ఉంటూ, ఈ విధంగా సూక్ష్మ మార్పులను కలిగి ఉంది. సాంప్రదాయ పెట్రోల్ టోపీని ఛార్జింగ్ పోర్ట్ ద్వారా భర్తీ చేస్తారు, ఈ పోర్ట్ కారు వెనక పిల్లర్ పైన ఉంటుంది. ఇది బ్యాటరీతో పనిచేసే SUV కాబట్టి, ఇది దాని బోనెట్ కింద అదనపు నిల్వ స్థలాన్ని అందిస్తుంది.

ఇది కూడా చదవండి: వోల్వో XC 40 Vs BMW X1: రియల్ వరల్డ్ పెర్ఫార్మెన్స్ పోలిక

హుడ్ కింద, XC40 రీఛార్జ్ 408Ps శక్తిని మరియు 660Nm టార్క్ ని కలిపి అందించే విధంగా రెండు ఎలక్ట్రిక్ మోటార్లను కలిగి ఉంది. అంతేకాకుండా, ఇది 78 కిలోవాట్ల బ్యాటరీతో వస్తుంది, WLTP ధృవీకరణ ప్రకారం వోల్వో 400 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ని అందిస్తుంది. XC40 రీఛార్జ్ 11kW AC ఛార్జర్ లేదా 150kW DC ఫాస్ట్ ఛార్జర్‌ తో శక్తినివ్వగలదు. వోల్వో ప్రకారం, 150kW DC ఫాస్ట్ ఛార్జర్‌ ఉపయోగించడం ద్వారా బ్యాటరీని 40 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

లక్షణాల పరంగా, XC40 రీఛార్జ్ కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది, ఇది గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఆధారితం చేయబడింది. ఇది వోల్వో యొక్క డిజిటల్ కనెక్ట్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ ‘వోల్వో ఆన్ కాల్' కి మద్దతు ఇస్తుంది.

వోల్వో వచ్చే ఏడాది ప్రారంభంలోనే XC 40 రీఛార్జిని భారతదేశంలో ప్రారంభించగలదు. ప్రస్తుతం, హ్యుందాయ్ కోన భారతదేశపు మొట్టమొదటి లాంగ్-రేంజ్ EV ధర రూ .37.71 లక్షలు (ఎక్స్-షోరూమ్ పాన్ ఇండియా) గా ఉంది. అయితే MG eZS మరియు ఆడీ e-tron త్వరలో ప్రారంభించబడతాయి.

దీనిపై మరింత చదవండి: XC40 ఆటోమేటిక్

r
ద్వారా ప్రచురించబడినది

rohit

  • 33 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన వోల్వో ఎక్స్ 2018-2022

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర