• English
  • Login / Register

3 జూలై 2015 న ఎస్60 టి6 ను ప్రవేశపెట్టబోతున్న వోల్వో ఇండియా

వోల్వో ఎస్60 2015-2020 కోసం sourabh ద్వారా జూలై 01, 2015 11:05 am ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

భారతదేశంలో వోల్వో ఆటో సంస్థ, దాని పోర్ట్ఫోలియో ను మరింత పెంచేందుకు ఎస్60 టి6 వేరియంట్ ను జూలై 3, 2015 న ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ ఎస్60 టి6 వేరియంట్, 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ తో రాబోతుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ లో 4 సిలండర్లు అమర్చబడి ఉంటాయి. ఈ ఇంజన్ అత్యధికంగా, 301.8 bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా, 400 Nm పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ వాహనాలు 0 kmph నుండి 100 kmph వేగాన్ని చేరడానికి 5.9 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు, ఈ వాహనాలు 230 kmph వేగాన్ని చేరుకోగలవు. అంతేకాకుండా, ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా 15.6 kmpl మైలేజ్ ను అందిస్తుంది.

ఈ వోల్వో సంస్థ, టి6 స్పోర్ట్స్ వెర్షన్ ను ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ తో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే, ప్రపంచవ్యాప్తంగా ఈ వోల్వో ఎస్60 టి6 ఆల్ వీల్ డ్రైవ్ తో అందుబాటులో ఉంది. ఈ వోల్వో ఎస్60 టి6 బాహ్య భాగాలను చూసినట్లైతే, ఎస్60 మోడల్ లో ఉండే స్టైలింగ్ సూచనలతో పాటు విభేద బ్యాడ్జ్ తో రాబోతుంది. ఈ వాహనం యొక్క అంతర్గత భాగాలను చూసినట్లైతే, 7 అంగుళాల సమాచార వ్యవస్థ తో పాటు డిజిటల్ టిఎఫ్ టి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తో రాబోతుంది. అంతేకాకుండా, ఎలక్ట్రానిక్ క్లైమేట్ కంట్రోల్, సన్రూఫ్, పవర్ అడ్జస్టబుల్ సీట్స్ తో పాటు లెదర్ అపోలిస్ట్రీ మరియు పార్క్ అసిస్ట్ వంటి అంశాలతో రాబోతుంది.

ఇటీవల, వోల్వో ఇండియా, వి40 హాచ్బాక్ ను మరియు క్రాస్ కంటీ లను ప్రవేశపెట్టింది. వీటితో పాటు, 2015 ఎక్స్ సి90 యొక్క రెండవతరాన్ని 64.9 లక్షల ఎక్స్-షోరూమ్, ముంబై వద్ద పరిచయం చేసింది. ప్రస్తుతం భారతదేశంలో ఈ ఎస్యువి లు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇది మరొక రెండు వేరియంట్లను ప్రవేశపెట్టబోతుంది. అవి వరుసగా, ముమెంటం లగ్జరీ మరియు ఇన్స్క్రిప్షన్ లగ్జరీ. మొమెంటం వేరియంట్ యొక్క ధర 64.9 లక్షలు. అయితే, ఇన్స్క్రిప్షన్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ ధర 77.9 లక్షలు.

was this article helpful ?

Write your Comment on Volvo ఎస్60 2015-2020

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience