• English
  • Login / Register

టాం వొన్ బొన్స్డొర్ఫ్ ని వోల్వో ఇండియా వారి వైస్ ప్రెసిడేంట్ గా నియమించింది

జూన్ 03, 2015 01:26 pm akshit ద్వారా ప్రచురించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

డిల్లీ: టాం వొన్ బొన్స్డొర్ఫ్ ని వారి కొత్త మేనేజింగ్ డైరెక్టరుగా నియమించడం జరిగింది. వోల్వో కార్లతో గత 17 ఏళ్ళుగా అనేక పదవులలో పనిచేస్తూ వచ్చిన బొన్స్డోర్ఫ్, ఇప్పుడు తామస్ ఎరంబర్గ్ ని భర్తీ చేస్తారు. తామస్ ఎరంబర్గ్ గారు కొత్త పదవి చేపట్టడానికి స్వీడన్ కి తిరుగు ప్రయాణం అయ్యారు అని ఆసీఅ పెసఫిక్ వోల్వో గ్రూప్ ఆఫ్ కార్స్ కి వైస్ ప్రెసిడెంట్ అయిన జరి కొహొనెన్ మీడియాతో అన్నారు.

బొన్స్డొర్ఫ్ నియామకం పై వ్యాఖ్యానిస్తూ, "బొన్స్డొర్ఫ్ కి ఉన్న పరిశ్రమ, మార్కెట్ మరియు సాంస్కృతిక అనుభవం అతని పదవికి ఎంతో వైభవాన్ని తీసుకువస్తుంది అని అన్నారు. ఆయనకి భారతదేశం లో వోల్వో కార్స్ ని నడిపించడానికి సరిపోయే అన్ని రకాల పూర్వానుభవం ఉంది అని సెలవిచ్చారు. ఇంతకు మునుపు బొన్స్దొర్ఫ్ అమెరికాలో, ఫిన్లాండ్లో మరియూ స్వీడెన్ లో పనిచేసి డిల్లీలో స్థిరపడ్డారు. ఇప్పుడు ఇక్కడే కొనసాగుతూ, ఆయన పదవి మరింత పైకి ఎదిగింది.

వోల్వో ఆటో ఇండియా కి మేనేజింగ్ డైరెక్టరు అయిన టాం వొన్ బొన్స్డొర్ఫ్ మాట్లాడుతూ, మార్కెట్ పరంగా భారతదేశం లో వోల్వో ఎదుగుదలకి అన్ని విధాలగా ప్రతికూల వాతావరణం ఉంది. వోల్వో యొక్క ఉనికిని మరింత పటిష్టం చేసేందుకు గాను, ఈ మధ్య కాలంలో విడుదలైన ఎక్సీ90, వీ40 క్రాస్ కంట్రీ పెట్రోలు మరియూ విడుదల కానున్న వీ40 మరియూ ఎస్60 టీ6 పెటృఓలు ఎంతో దోహదం చేస్తాయి అని అభిప్రాయ పడ్డారు. 

రాబోయే కాలంలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఉత్తేజకరమైన వినూత్న ఉత్పత్తులు భారతదేసంలో కూడా వాటి స్థానాన్ని నెలకొల్పుతాయని ఆసిస్తున్నాను అని ఆయన తెలిపారు.

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience