దాదాపు సగం తగ్గిపోయిన ఫోక్స్వ్యాగన్ పోలో అమ్మకాలు

వోక్స్వాగన్ పోలో 2015-2019 కోసం akshit ద్వారా డిసెంబర్ 14, 2015 07:22 pm ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఢిల్లీ:

వోక్స్వ్యాగన్, దాని అసాధారణ ఉద్గార కుంభకోణం నుండి బయట పడింది అని ప్రతి ఒక్కరూ  భావిస్తున్న తరుణంలో,  ప్రపంచ వ్యాప్తంగా దిగుతున్న వోక్స్వ్యాగన్ వాహనఅమ్మకాల  నివేదికలు అది భ్రమ అని తెలియజేస్తున్నాయి.

 జర్మన్ కార్ల తయారీ సంస్థ అయిన వోక్స్వ్యాగన్ ఇండియన్ విభాగం యొక్క అమ్మకాలు నవంబర్ నెలలో అధికంగా తిరోగమనం చెందాయి. వోక్స్వ్యాగన్ యొక్క బెస్ట్ సెల్లర్ అయిన పోలో మోడల్  నెల నెల వారి అమ్మకాలలో ప్రధానంగా 42 % క్షీణతను చూపించింది. ఒక నెల ముందు  నెలలో 2000 పోలో కార్లు అమ్మిన సంస్థ ,దేశం మొత్తం మీద చివరి నెలలో కేవలం 1169 కార్లను మాత్రమే కస్టమర్ లకి డెలివెరీ చేయగలిగింది.

కేవలం నెల నెల వారి అమ్మకాలలో మాత్రమే కాకుండా , పోలో యొక్క  సంవత్సరం అమ్మకాలు కూడా  మరింత తీవ్రమైన తగ్గుముఖం దిశలో ఉన్నాయి.  నవంబర్ 2014 లో 2843 పోలో కార్లను రిటైల్ చేశారు. అంటే అస్థిరమైన 59 శాతం క్షీణత కనిపిస్తోంది.  కానీ ఇప్పుడు, ఈ డీజిల్ కుంభకోణం ప్రభావం మాత్రమే ఉండకపోవచ్చు ఎందుకంటే ఈ విభాగంలో పెరుగుతున్న పోటీ కి సంభంధించి కూడా ప్రభావం ఉండవచ్చు.

ఇటీవల, వోక్స్వ్యాగన్ ఉద్గార నిబంధనలను పరంగా, వాటిని దుర్వినియోగం చేసినట్లు అంగీకరించింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా సుమారు 11 మిలియన్ ల  కార్లలో వారి "ఓటమి పరికరం" బిగించడం జరిగింది అని  తెలిపింది.  వోక్స్వ్యాగన్ గ్రూప్ భారతదేశం, ఈ విషయంలో,  1.2 లీటర్, 1.5 లీటర్, 1.6 లీటర్, 2.0 లీటర్  ఈ ఏ 189 డీజిల్ ఇంజిన్లు బిగించి, 2008 మరియు 2015 సంవత్సరాల  మధ్య విక్రయించిన సుమారు 3,23,700 కార్లను వెనక్కు పిలిచింది.   ఈ రీకాల్ 1,98,500 వోక్స్వ్యాగన్ కార్ల  యూనిట్లను ప్రభావితం చేస్తుంది, అంతే కాకుండా స్కోడా మరియు ఆడి వరుసగా ఈయా 189 డీజిల్ ఇంజిన్ అమర్చిన 88,700 మరియు 36,500 వాహనాలను వెనక్కు పిలిచాయి.

ఇక్కడ ఉన్న కారణాలలో ఈ ఏ 189 డీజిల్ ఇంజన్ ముఖ్యమైనది. ఇది అనుమతి ఇచ్చిన పరిమితి కంటే 40 సార్లు ఎక్కువ నత్రజని ఆక్సైడ్ ను గాలిలోకీ విడుదల చేస్తుందని కనుగొనబడింది.
డేటా మూలం: సియామ్

ఇది కూడా చదవండి:

వోక్స్వ్యాగన్ వారు బుగాటి, లాంబోర్ఘిని, డ్యుగాటి లేదా బెంట్లీ వదులుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి

ఇంకా చదవండి: వోక్స్వాగన్ పోలో

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన వోక్స్వాగన్ పోలో 2015-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience