వోక్స్వాగన్ పోలో

` 5.4 - 9.3 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

వోక్స్వాగన్ ఇతర కారు మోడల్లు

 
*Rs

వోక్స్వాగన్ పోలో వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 

ముఖ్యాంశాలు


ఫిబ్రవరి 04, 2016: వోక్స్వ్యాగన్, 2016 భారత ఆటో ఎక్స్పో న్యూఢిల్లీ వద్ద పోలో జిటి ఐ వాహనాన్ని పరిచయం చేసింది. నివేదికలు ప్రకారం, ఈ హ్యాచ్బ్యాక్ అధికారిక విడుదల సెప్టెంబర్ నెలలో ఉంచవచ్చు మరియు ఇది, అబార్త్ పుంటో ఈవో వాహనానికి గట్టి పోటీ ను ఇవ్వనుంది అని పేర్కొన్నారు. సౌందర్య నవీకరణల విషయానికి వస్తే, ఈ పోలో జిటి ఐ వాహనం ఎల్ ఈ డి హెడ్ లైట్లతో, ఇంటిగ్రేటెడ్ డే టైం రన్నింగ్ లైట్ లతో, నవీకరించబడిన ముందు బంపర్, ఎల్ ఈ డి టైల్ ల్యాంప్లు మరియు ద్వంద్వ ఎగ్జాస్ట్ అవుట్ లెట్ వంటి అంశాలతో అందించబడుతుంది. ఈ వాహనం యొక్క లోపలి భాగం విషయానికి వస్తే, ఆపిల్ కార్ ప్లే మరియు గూగుల్ ఆండ్రాయిడ్ ఆటో వంటి యాప్ లకు మద్దతిచ్చే 6.5 అంగుళాల టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ ను అందించడం జరిగింది. ఈ వాహనం యొక్క బోనెట్ క్రింది విషయానికి వస్తే, ఈ పోలో జిటి ఐ వాహనం వోక్స్వాగన్ యొక్క 1.8 లీటర్ టి ఎస్ ఐ టర్బో చార్జెడ్ పెట్రోల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 192 పి ఎస్ పవర్ ను అదే విధంగా 320 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్, 6- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది.

అవలోకనం


పరిచయం


వోక్స్వ్యాగన్ ప్రపంచ వేదికపై చాలా ప్రభావాన్ని చూపించింది. కానీ ఇక్కడ భారతదేశం విషయానికి వస్తే ఈ కంపెనీ ఆధిపత్యం, చౌకగా మరియు మరింత ప్రాధాన్యం కలిగిన దేశీయ బ్రాండ్లు మధ్య కప్పి వేయబడింది.ప్రస్తుత మార్కెట్ లో, ఈ వోక్స్వాగన్ పోలో అను వాహనం ఒక ప్రత్యేక స్థానంలో ఉంది. అంతేకాకుండా, ఈ బ్రాండ్ వాహనాలలో ఇది ముఖ్యమైన వాహనం అని చెప్పవచ్చు. ఇక్కడ, ఈ వాహనం ఒక క్లాసిచ్ వాహనం గా ఉంది. ఈ వాహనం లో రైడ్ ను గనుక మీరు కావాలి అనుకున్నట్లైతే, ఖచ్చితంగా జర్మన్ వాహన ఇంజనీరింగ్ వాగ్ధానం నిజమైనది అని చెప్పవచ్చు. ఈ ఎడిషన్ యొక్క ఒక కొత్త వాహనం ఇటీవల విడుదల అయ్యింది. అంతేకాకుండా ఈ మోడల్ యొక్క అన్ని వాహనాలను పరిశీలించండి మరియు తిరిగి సందర్శించండి. Image 1

అనుకూలాలు1. చూడటానికి చాలా ఆకర్షణీయమైన ప్రొఫైల్ ను కలిగి ఉంది. ఇది, ఖచ్చితంగా యువ మనస్సులను ఆకట్టుకుంటుంది. 
2. అనేక సౌకర్య అంశాలను కలిగి ఉన్న ఈ మోడల్, నేటి ప్రేక్షకుల కళ్ళకు ఆకర్షణీయ మోడల్ గా కనిపిస్తుంది.

ప్రతికూలాలు1. ఇప్పుడు ప్రజలు, విశాలమీన్ క్యాబిన్ కోసం చూస్తున్నారు.
2. ఈ వాహనం యొక్క పనితీరు ఇంకా మెరుగు పడవలసిన అవసరం ఉంది.

అత్యద్భుతమైన లక్షణాలు1. క్రొత్త సమాచార టచ్ స్క్రీన్ వ్యవస్థ మరియు మిర్రర్ లింక్ సిస్టమ్ వంటివి క్యాబిన్ లో ఆనందకరమైన అనుభవాన్ని జోడించడం లో సహాయపడతాయి.
2. కొనుగోలుదారులకు ఖచ్చితమైన రైడ్ నాణ్యతను ఇవ్వడానికి మరియు గరిష్ట స్థాయిలో భద్రతను అందించడానికి తయారీదారుడు ఈ వాహనానికి, ఏబిఎస్, ఈ పిఎస్ మరియు ఇతర టెక్నో ప్రోగ్రాం లను అందించడం జరిగింది.

అవలోకనం


పోలో వాహనం యొక్క కొత్త వెర్షన్, చిన్న చిన్న నవీకరణలతో ముఖ్యంగా లోపలి భాగంలో మార్పు చేయబడింది. ఈ వాహనం యొక్క బాహ్య భాగం విషయానికి వస్తే పెద్దగా ఏ మార్పులను కలిగి లేదు. ఎవరైతే కారు యొక్క సౌందర్య శరీర నిర్మాణాన్ని మరియు క్రోం హై లైట్లను ఇష్టపడతారో వారికి ఈ వాహనం సరైనది అని చెప్పవచ్చు మరియు సంస్థ ఈ రకమైన అన్ని అంశాలతో ఈ వాహనాన్ని అందించింది. ఈ వాహనం యొక్క అంతర్గత భాగం అలానే ఉంది మరియు ద్వంద్వ టోన్ స్కీం, ఫ్యాబ్రిక్ కోటింగ్ ను కలిగిన సీట్లు అలాగే పియానో బ్లాక్ సెంటర్ కన్సోల్ వంటి అంశాలతో ఈ వాహనం మరింత అందంగా కనబడుతుంది. మీరు గనుక పాత పోలో వాహనం యొక్క అభిమాని అయ్యి ఉంటే, ఈ వాహనాన్ని పొందుటకు కొంత కాలం వేచి ఉండవలసిన అవసరం ఉంది. సంస్థ ఈ వాహనం యొక్క క్యాబిన్ భాగాన్ని, కొన్ని సౌకర్య అంశాలతో నవీకరణ చేసింది మరియు వినియోగదారులు ఖచ్చితంగా ఈ వాహనాన్ని ఇష్టపడతారు. మరోవైపు, ఇంజిన్, బ్రేకింగ్, చాసిస్ మరియు యంత్రం యొక్క ఇతర లక్షణాలు ఎక్కువగా మారలేదు, కాని ఇదివరకే అందుబాటులో ఉన్న 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్ ను అధనంగా చేర్చడం జరిగింది. దీని వలన ఒక అధనపు ఇంజన్ తో ఒక వేరియంట్ చేర్చబడింది.

బాహ్య భాగం


కొంతమంది మాత్రం ఈ రోజుల్లో చాలా ఆధునిక లుక్ ను కలిగి ఉన్నా, స్తైలిష్ నేపథ్య కార్లలో ఒకటి అయిన్నా ఈ వాహనాన్ని కొట్టిపారేస్తున్నారు. భారత మార్కెట్ లో నేడు అందుబాటులో ఉన్న అన్ని హాచ్బాక్ లలో పోలో అత్యంత అందంగా కనిపిస్తోంది అంతేకాకుండా లాభసాటిగా కూడా ఉంది.

Image 2

ఇది హాచ్బాక్ అయినప్పటికీ, ఈ వాహనం ఒక స్పోర్టీ అలాగే ఒక చక్కని లుక్ ను కలిగి ఉంటుంది మరియు ఒక ప్రకాశవంతమైన అనుభూతిని అందిస్తుంది. ఇది ఒక మనోహరమైన, సమర్థవంతమైన ముద్రణను కలిగి ఉంది. సంస్థ ఈ వాహనానికి ఖచ్చితమైన బాహ్య కొలతలను అందించింది. అవి వరుసగా, ఈ వాహనం యొక్క మొత్తం పొడవు 3971 మిల్లీ మీటర్లు, వెడల్పు 1682 మిల్లీ మీటర్లు అలాగే ఎత్తు 1469 మిల్లీ మీటర్లు వంటి ఖచ్చితమైన కొలతలను కలిగి దృశ్య పరంగా సౌందర్యాన్ని జోడిస్తుంది.

Image 3

ససంథ ఈ వాహనం యొక్క బాహ్య శరీర సౌందర్యం విషయంలో ఒక గొప్ప ప్రయత్నం చేసినట్లుగా చెప్పవచ్చు. వాహనం యొక్క రూఫ్, విండ్ స్క్రీన్ గూండా బోనెట్ వైపుగా విలీనం చేయబడినట్లుగా అలాగే ముందుకు ప్రవహిస్తున్నట్లుగా ఉంటుంది.

Image 4

ఈ వాహనం యొక్క ముందు భాగం విషయానికి వస్తే, వెండి మెరుగులతో కూడిన నాజూకైన గ్రిల్ అందించబడుతుంది మరియు ముందు భాగం మరింత అందంగా కనిపించదం కోసం తయారీదారుడు, సంస్థ యొక్క ప్రముఖ చిహ్నాన్ని గ్రిల్ మధ్య భాగంలో విలీనం చేశాడు. దీనికి ఇరువైపులా, ముందు భాగానికి దూకుడు స్వభావాన్ని అందించడం కోసం పొదునైన హెడ్ ల్యాంప్ క్లస్టర్ల ను అందించాడు. ఈ హెడ్ లైట్ క్లస్టర్ లలో, డ్యూయల్ బీం లైట్ వ్యవస్థలు అందించబడతాయి మరియు దీని లోపలి భాగానికి నలుపు ఫినిషింగ్ డిజైన్ అందించబడుతుంది.

Image 5

వాహనానికి మరింత అందాన్ని జోడించడానికి ఈ హెడ్ క్యాంప్ క్లస్టర్ క్రింది భాగంలో కారు శరీర రంగులో ఉండే బంపర్ ను అందించడం జరిగింది. ఈ బంపర్ కు, ఒక బారీ ఎయిర్డాం విలీనం చేయబడి ఉంటుంది. ఈ ఎయిర్ డాం పై భాగం లో ఒక సన్నని క్రోం గార్నిష్ అందించబడుతుంది. దీని వలన వాహనం యొక్క ముందు చిత్రం మరింత అందంగా ఉంటుంది.

Image 6

ఈ వాహనం యొక్క ముందు భాగంలో ఉండే విండ్ స్క్రీన్ నుండి బోనెట్ వైపుగా, సంస్థ యొక్క తయారీదారుడు కొన్ని టచ్ లను విలీనం చేశాడు. ముందు భాగానికి డైనమిక్ లుక్ ను ఇవ్వడం కోసం, బోనెట్ పై భాగంలో శరీర లైన్లు అందంగా విలీనం చేయబడి ఉంటాయి.

Image 7

ఈ వాహనం యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, తయారీదారుడు ఈ వాహనానికి ఒక క్రీడా చిత్ర వైఖరిని అందించాడు. రిఫైండ్ వక్రత్వాలు, శక్తివంతమైన వ్యక్తిత్వాన్ని జోడిస్తాయి అయితే నమూనా యొక్క సొగసైన లేఅవుట్, ప్రజలను ఆకర్షితులను చేస్తుంది. అంతేకాకుండా తయారీదారుడు ఈ వాహనానికి, బలమైన వీల్ ఆర్చులను అలాగే ముందు ర్యాప్ లను, ప్రముఖ రూపాన్ని ఇవ్వడం కోసం అందించాడు.

Image 8

ఈ వాహనం యొక్క సైడ్ ప్రొఫైల్ కు శక్తివంతమైన వైఖరిని అందించడం కోసం ఈ వాహనం యొక్క వీల్ ఆర్చులకు, 15 అంగుళాల ఎస్ట్రాడా అల్లాయ్ వీల్స్ ను అందించాడు.

Image 9

వాహనం యొక్క డిజైన్ కు ఒక గొప్ప మూలకాన్ని జోడించండం కోసం, డోర్ల వైపు నిర్మలమైన శరీర శ్రేణులను అందించడం జరిగింది. మరోవైపు ఈ వాహనం యొక్క వెనుక భాగం విషయానికి వస్తే, స్క్వారిష్ హెడ్ ల్యాంప్ లను అందించడం జరిగింది. దీని వలన వెనుక భాగానికి ఒక ఆకర్షణీయమైన లుక్ అందించబడుతుంది. అంతేకాకుండా వెనుక భాగానికి మరింత అందాన్ని ఇవ్వడం కోసం, టైల్ గేట్ లిడ్ మధ్య భాగంలో సంస్థ యొక్క ప్రముఖ చిహ్నం అందంగా పొందుపరచబడి ఉంటుంది.

Image 10

Table 1

Table 2

అంతర్గత భాగం


ఈ వాహనం యొక్క లోపలి భాగం చాలా ఇరుకుగా ఉండదు అలాగని చాలా విశాలంగా కూడా ఉండదు. కానీ, మీరు ఒక విలాసవంతమైన ఆకర్షణ కోసం చూస్తున్నట్లైతే, అప్పుడు ఈ వాహనం యొక్క క్యాబిన్ నిరాశపరుస్తుంది. కొత్త వెర్షన్, రైడ్ పరిస్థితిని బలోపేతం చేయడానికి, కొన్న చిన్న మార్పు చేయబడిన లక్షణాలతో వస్తుంది. క్యాబిన్ లో కూర్చునే ప్రయాణికులకు మంచి పుష్కలమైన లెగ్ రూం అందించబడుతుంది మరియు పొడవైన వ్యక్తుల కోసం పుష్కలమైన హెడ్ రూం వంటివి అందించబడతాయి. ఈ విషయంలో ఎటువంటి మార్పు లేదు మరియు ఎటువంటి పిర్యాదు లేదు. వెనుక భాగానికి వస్తే, మన అబిప్రాయం కోసం మరింత స్పేస్ లను అందించవలసిన అవసరం ఉంది.

Image 11

క్యాబిన్ లోపలి వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడానికి, డ్యూయల్ రంగు పధకాన్ని అందించడం జరిగింది మరియు ఇది ఖచ్చితంగా మంచి అనుభూతిని అందిస్తుంది. డాష్బోర్డ్ యొక్క మధ్య భాగంలో సెంట్రల్ కన్సోల్, మంచి లుక్ ను ఇవ్వడం కోసం పియానో బ్లాక్ ఫినిషింగ్ తో వస్తుంది.

Image 12

ఒక జత ఎయిర్ కండీషనింగ్ డక్ట్లు, కన్సోల్ పై భాగంలో అందించబడతాయి. ఈ మోడల్ యొక్క కొత్త ఎడిషన్, ఒక కొత్త డైనమిక్ టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ తో వస్తుంది మరియు ఇది, నాణ్యత గల క్యాబిన్ వినోదం కోసం చూస్తున్న వారి కోసం, ఆహ్లాదం ఖచ్చితంగా అందించబడుతుంది. దీనితో పాటు సంస్థ ఈ కొత్త ఎడిషన్ కు, ఒక కొత్త మిర్రర్ లింక్ కనెక్టవిటీ ను అందించింది మరియు ఇది, స్మార్ట్ ఫోన్ నుండి సిస్టం యొక్క కనెక్షన్ కు మద్దతిస్తుంది. అప్పుడు, ఫోన్ యొక్క తెర కారు డిస్ప్లే లో ప్రదర్శించ బడుతుంది.

Image 13

దిగువున, ఒక సన్నని ప్రదర్శన తో పాటు వచ్చే ఒక క్లైమేట్రోనిక్ ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ అందించబడుతుంది. కన్సోల్ క్రింది భాగంలో, బారీ నిల్వ సామర్ధ్యం అందించబడుతుంది మరియు దీనిలో ప్రయాణికుల ఫోన్ మరియు ఇతర విది అంశాలను పెట్టుకునేందుకు అనుమతిస్తుంది.

Image 14

కుడి చేతి మూల వద్ద, లెధర్ తో కప్పబడిన ఫ్లాట్ బోటం స్టీరింగ్ వీల్ విలీనం చేయబడి ఉంటుంది మరియు ఇది మరింత అందంగా కనబడటం కోసం క్రోం చేరికలతో అలంకరించబడి ఉంటుంది. అంతేకాకుండా దీనికి, మరొక సంపన్నమైన టచ్ జోడించబడి ఉంటుంది. దీనిని చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది మరియు దీని పట్టు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. డ్రైవర్ కు మరింత సౌకర్యాన్ని అందించడం కోసం ఈ స్టీరింగ్ వీల్ పై, ఆడియో వ్యవస్థ నియంత్రణలు దీనిపై పొందుపరచబడి ఉంటాయి. అంతేకాకుండా డ్రైవర్ యొక్క హ్యాండ్లింగ్ ను మరింత సులభతరం చేయడానికి, పవర్ అసిస్టెడ్ తో వస్తుంది.

Image 15

కుడి వైపు ఉండే స్టీరింగ్ వీల్ పై భాగంలో, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుపరచబడి ఉంటుంది మరియు ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను చూసినప్పుడు వెనుక మనిషి అలసట చెందకుండా ఉండటం కోసం ఆ భాగంలో అమర్చడం జరిగింది. ఈ క్లస్టర్ లో, స్పీడో మీటర్, టాకో మీటర్, ముందు మరియు ఒక సగటు ఇంధన వియోగాన్ని ప్రదర్శించే ఒక మిడ్, డిస్టెన్స్ టు ఎంప్టీ, తదుపరి సేవ కోసం కౌంట్ డౌన్ మరియు సగటు వేగం వంటివి ప్రదర్శింపబడతాయి.

Image 16

కొత్త ఎడిషన్ యొక్క కొత్త లక్షణం ఏమిటంటే, ఆటో డిమ్మింగ్ ఫంక్షన్ ను కలిగి ఉన్న అంతర్గత రేర్ వ్యూ మిర్రర్ మరియు డ్రైవర్ కోసం సులభ పని లో సహాయపడుతుంది అలాగే డ్రైవర్ కు సౌలభ్యాన్ని అందిస్తుంది. సీటింగ్ అమరిక విషయానికి వస్తే, క్యాబిన్ లో ఉండే సీట్లు ఎర్గనామికల్ గా రూపొందించబడి ఉంటాయి మరియు ఈ సీట్లకు మరింత సౌకర్యాన్ని అందించడం కోసం హెడ్ రెస్ట్ లు అందించబడతాయి. ఈ సమర్ధతా సీట్లు, అసౌకర్యం నుండి విముక్తి ఖచ్చితంగా అందిస్తాయి.

Image 17

ఫాబ్రిక్ అపోలిస్ట్రీ తయారు లేదా రైడ్ అనుభవాన్ని భంగం చేయడం మాత్రం కాదు, కానీ ఇది పాసబుల్ గా ఉంది. వీటన్నింటితో పాటు తయారీదారుడు ఈ వాహనం లో ఉండే ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని అందించడం కోసం, శీతలీకరణ కలిగిన గ్లోవ్ బాక్స్, డోర్ వైపు నిల్వ సామర్ధ్యాలు, యాంబియంట్ లైట్లు, క్రూజ్ కంట్రోల్, యూఎస్బి మరియు ఆక్స్ ఇన్ సౌకర్యాలు అలాగే ఎస్ డి కార్డ్ ఇంపుట్ లు వంటి అనేక ఇతర సౌకర్య అంశాలు అందించబడతాయి.

పనితీరు


డీజిల్


ఈ వాహనం యొక్క బూట్ క్రింది విషయానికి వస్తే ఇంజన్ ల పరంగా ఎటువంటి మార్పులను కలిగి లేదు. ముందుగా ఈ వాహనం కలిగి ఉన్న డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే ఈ వాహనానికి, 1498 సిసి స్థానభ్రంశ సామర్ధ్యాన్ని కలిగి ఉన్న అదే పాత 1.5 లీటర్ టి డి ఐ డీజిల్ ఇంజన్ ను అందించడం జరిగింది. ఈ ఇంజన్, డి ఓ హెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా నాలుగు సిలండర్లను మరియు 16 వాల్వ్ లను కలిగి ఉంటుంది మరియు సమర్ధవంతమైన పనితీరును అందించడం కోసం ఈ ఇంజన్, 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 4400 ఆర్ పి ఎం వద్ద 104 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 1500 నుండి 2500 ఆర్ పి ఎం మధ్యలో 250 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. చెప్పడానికి ఈ ఇంజన్, ఎటువంటి ముఖ్య లోపాలను కలిగి లేదు మరియు నునుపైన డ్రైవ్ ను కలిగి ఉంది. మరోవైపు ఈ వాహనం యొక్క త్వరణం విషయానికి వస్తే, ఈ ఇంజన్ 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 10.51 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు ఇదే వాహనం, 183.8 కె ఎం పి హెచ్ గల అధిక వేగాన్ని చేరుకోగల సామర్ఢ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు ఈ వాహనం యొక్క ఇంధన సామర్ధ్యం విషయానికి వస్తే, ఈ వాహనం నగరాలలో 16.02 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అదే విధంగా రహదారులలో 19.91 కె ఎంపి ఎల్ మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

ImaGE18

Table 3

పెట్రోల్


మరోవైపు ఈ వాహనం యొక్క పెట్రోల్ వేరియంట్ విషయానికి వస్తే, ఈ వాహనానికి అదే 1.2 లీటర్ టి ఎస్ ఐ పెట్రోల్ ఇంజన్ ను అందించడం జరిగింది. ఈ ఇంజన్, డి ఓ హెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా నాలుగు సిలండర్లను అలాగే 16 వాల్వ్ లను కలిగి ఉంటుంది మరియు ఈ ఇంజన్ 1197 సిసి స్థానభ్రంశ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 5000 ఆర్ పి ఎం వద్ద 104 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 1500 నుండి 4100 ఆర్ పి ఎం మధ్యలో 175 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఇంజన్, 7- స్పీడ్ డి ఎస్ జి ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి, షిఫ్టింగ్ ను సులభతరం చేసి, మృదువైన డ్రైవ్ ను అందిస్తుంది. మరోవైపు ఈ వాహనం యొక్క త్వరణం విషయానికి వస్తే, ఈ ఇంజన్ 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 9.7 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు ఇదే వాహనం 190 కె ఎం పి హెచ్ గల అధిక వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ వాహనం యొక్క ఇంధన సామర్ధ్యం విషయానికి వస్తే, ఈ వాహనం డైరెక్ట్ ఇంజక్షన్ తో జత చేయబడి నగరాలలో 14.8 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అదే విధంగా రహదారులలో 17.21 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

Image 19

Table 4

రైడ్ మరియు హ్యాండ్లింగ్


తయారీదారుడు ఈ వాహనానికి, వాహనం అన్ని వేళలా స్థిరంగా మరియు సమతుల్యంగా ఉండటానికి నమ్మకమైన బ్రేకింగ్ మెకానిజాన్ని అలాగే సమర్ధవంతమైన సస్పెన్షన్ మెకానిజాన్ని అందించాడు. ఈ వాహనం యొక్క చాసిస్ మరియు బ్రేకింగ్ వ్యవస్థల విషయానికి వస్తే, పాత వెర్షన్ లో ఉండే వాటినే అందించడం జరిగింది. మరోవైపు సస్పెన్షన్ మెకానిజం విషయానికి వస్తే, ఈ వాహనం యొక్క ముందు ఆక్సిల్, మెక్ఫెర్సన్ స్ట్రట్ తో విలీనం చేయబడి ఉంటుంది. అంతేకాకుండా ఇది, మరింత దృడమైన నియంత్రణ ను ఇవ్వడం కోసం స్టెబిలైజర్ బార్ లతో లోడ్ చేయబడి ఉంటుంది అదే వెనుక ఆక్సిల్ విషయానికి వస్తే, సెమి ఇండిపెండెంట్ ట్రైలింగ్ ఆర్మ్ తో విలీనం చేయబడి ఉంటుంది. వీటి వలన ప్రయాణికులకు, అద్భుతమైన రైడ్ నాణ్యత అందించబడుతుంది కానీ అప్పుడప్పుడు గతుకులను మరియు జర్క్ అవాంతరాలను తప్పించుకోవడం లో కొంచెం కష్ట తరం అవుతుంది. మరోవైపు ఈ వాహనం యొక్క బ్రేకింగ్ మెకానిజం విషయానికి వస్తే, ఈ వాహనం యొక్క ముందు చక్రాలు, డిస్క్ బ్రేక్ లతో జత చేయబడి ఉంటాయి. అదే వెనుక బ్రేక్ ల విషయానికి వస్తే, డ్రం బ్రేక్ లు అందించబడతాయి. ఈ డిస్క్ / డ్రమ్ కలయిక సామర్థ్యం ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ బ్రేకింగ్ మెకానిజాన్ని మరింత మెరుగుపరచడం కోసం యాంటీ లాక్ బ్రేకింగ్ మెకానిజాన్ని, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ అలాగే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం వంటి అంశాలను అందించడం జరిగింది. క్యాబిన్ లో డ్రైవర్ కు ప్రయాణ సమయంలో ఓత్తిడి లేని డ్రైవింగ్ అనుభూతిని అందించడానికి, ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ వీల్ ను అందించడం జరిగింది మరియు ఈ స్టీరింగ్ వీల్, డ్రైవర్ యొక్క నిర్వహణ ను సులభతరం చేస్తుంది.

Image 20

భద్రత


ఈ సిరీస్ యొక్క అన్ని వేరియంట్ లలో, ప్రయాణికులకు అలాగే వాహనానికి రక్షణ ను అందించడం కోసం అనేక భద్రతా అంశాలను అందించడం జరిగింది. సంస్థ ఈ వాహనం యొక్క మోడల్ లైనప్ లో ఒక కొత్త ఎడిషన్ ను చేర్చడం జరిగింది. భద్రతా అంశాలలో కొత్త లక్షణాల విషయానికి వస్తే ఈ వాహనానికి, రైన్ సెన్సార్ మరియు ఆటో డిమ్మింగ్ ఫంక్షన్ ను కలిగిన అంతర్గత మిర్రర్ అందించబడింది. మరోవైపు ఈ వాహనం యొక్క బ్రేకింగ్ మెకానిజం విషయానికి వస్తే, ఈ వాహనం యొక్క ముందు చక్రాలు మంచి పట్టును ఇవ్వడానికి డిస్క్ బ్రేక్ ల సమితి తో బిగించబడి ఉంటాయి. అంతేకాకుండా ఈ బ్రేకింగ్ మెకానిజాన్ని మరింత మెరుగుపరచడం కోసంతయారీదారుడు ఈ వాహనానికి, ఏబిఎస్ తో పాటు ఈబిడి లనూ అందించాడు. వీటన్నింటితో పాటు సంస్థ ఈ వాహనానికి, ఎలక్ట్రానిక్ స్థిరీకరణ ప్రోగ్రామ్ మరియు హిల్ హోల్డ్ కంట్రోల్ వంటి కొన్ని ఇతర సహాయక ప్రోగ్రాం లను అందించింది. డ్రైవింగ్ సమయంలో డ్రైవర్ కు మరింత భద్రత ను అందించడానికి, ముందు భాగంలో కార్నరింగ్ ల్యాంప్ లతో కూడిన ఫాగ్ ల్యాంప్ లను అందించడం జరిగింది. ఈ వాహనం లో ఉండే ముందు అలాగే వెనుక సీట్లు అన్నింటికీ హెడ్ రెస్ట్లు అందించబడ్డాయి. అంతేకాకుండా, ఇది ఎత్తు సర్దుబాటు సౌకర్యాన్ని కూడా కలిగి ఉంటాయి. ముఖ్యంగా, ఈ హెడ్ రెస్ట్ లను మెడ ప్రాంతానికి మెరుగైన రక్షణ ను ఇవ్వడం కోసం వీటిని 'ఎల్' ఆకారం లో రూపొందించారు. ఒక ఎలక్ట్రానిక్ ఇంజన్ ఇమ్మొబిలైజర్ అన్ని వేరియంట్ లకు అందించడం జరిగింది. ఈ వాహనం యొక్క లోపలి రేర్ వ్యూ మిర్రర్ కు, యాంటీ గ్లేర్ సర్దుబాటు సౌకర్యం కలదు. ఈ వాహనం యొక్క ముందు మరియు వెనుక సీట్లకు త్రీ పాయింట్ సీట్ బెల్ట్ లను అందించడం జరిగింది. హై మౌంట్ స్టాప్ ల్యాంప్, వెనుక విండ్ స్క్రీన్ పై అమర్చబడి ఉంటుంది. ఊహించని సందర్భాలు ఎదురైనప్పుడు అత్యవసర ఎగ్జిట్ అందుబాటులో ఉంది. ఈ వాహన సిరీస్ యొక్క కంఫర్ట్ లైన్ మరియు హై లైన్ వేరియంట్ లలో యాంటీ పించ్ పవర్ విండోస్ అందించబడ్డాయి. ఈ వాహన సిరీస్ అన్ని వేరియంట్ లలో డ్యూయల్ ఎయిర్బాగ్స్ అందించడం జరిగింది. వీటన్నింటితో పాటు సంస్థ ఈ వాహనానికి, డ్యూయల్ ఎయిర్బాగ్లు, రేర్ పార్కింగ్ సెన్సార్లు, విధ్యుత్ తో సర్ధుబాటయ్యే అలాగే మడత వేయగల వెలుపలి రేర్ వ్యూ మిర్రర్ లు మరియు బహుళ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ వంటి అంశాలను అందించడం జరిగింది.

Image 21

Table 5

వేరియంట్లు


ఈ వాహనం కేవలం రెండు ఇంజన్ ఎంపికలతో మాత్రమే అందుబాటులో ఉంది అవి వరుసగా, జిటి టి ఎస్ ఐ మరియు జిటి టి డి ఐ. ముందు వాహనం, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. రెండవది 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ రెండు వేరియంట్లు, లక్షణాల పరంగా ఎంపిక చేసుకున్న తేడాలతో ఒకే విధంగా సమంగా ఉంటాయి. జిటి టిడి ఐ వేరియంట్ విషయానికి వస్తే సంస్థ, క్రూజ్ కంట్రోల్, శీతలీకరణ కలిగిన గ్లోవ్ బాక్స్ మరియు యూఎస్బి అలాగే ఆక్స్ ఇన్, బ్లూటూత్ కనెక్టవిటీ లను కలిగిన సిడి / ఎం పి3 ప్లేయర్ వంటి అంశాలను అందించింది. మరోవైపు జిఎస్ టిఎస్ ఐ వేరియంట్ల విషయానికి వస్తే, ఎలక్ట్రానిక్ స్థిరీకరణ ప్రోగ్రామ్ మరియు హిల్ హోల్డ్ నియంత్రణ వంటి అదనపు విదులతో వస్తుంది. ఇప్పుడు మీరు, ఏ రకమైన వాహనాన్ని ఎంపిక చేసుకోవాలి అనుకుంటున్నారో నిర్ణయించుకోండి. మీరు ఎంపిక చేసుకోవడానికి అవసరమైన లక్షణాలను అలాగే ఇంజిన్ యొక్క వివరాలను కూడా అందించడం జరిగింది.

Table 6

తుది విశ్లేషణ


ఈ వాహనం, ఆకర్షణీయమైన బాహ్య అంశాలతో అలాగే స్టైలిష్ మరియు సౌకర్య అంతర్గత భాగాలతో అందించబడుతుంది. కొత్త వెర్షన్ యొక్క నవీకరణల విషయానికి వస్తే, సమాచార వ్యవస్థ మరియు మిర్రర్ లింక్ వ్యవస్థ తో పాటు మునుపటి వెర్షన్ లో ఉండే ఇతర సౌకర్య అంశాలు వంటివి అందించబడతాయి. ఆకర్షణీయమైన నిర్వహణ కూడా అందించబడింది మరియు మొత్తం డ్రైవ్ అనుభవం విషయంలో కూడా నిరాశ పడవలసిన అవసరం లేదు. దాని లోపాలు, పరిమిత క్యాబిన్ స్పేస్, సగటు పనితీరు మరియు దేశంలో ఒక నమ్మకమైన సేవ ఉనికిని లేకపోవడం నుంచి వెలువడతాయి. ఈ పోలో వాహనం, ఖచ్చితంగా ఒక ఆధునిక రుచి తో రూపొందించబడి ఉంటుంది మరియు ఒక మంచి వాహనం కోసం శోధిస్తున్న యువకులకు మరియు ప్రజల కొరకు మంత్రముగ్ధులను చేసే వాహనం గా ఉంది. కానీ ఈ వాహన ఎంపిక విషయంలో ఎటువంటి రాజీ పడవలసిన అవసరం లేదు. ఎవరి అవసరానికి అనుగుణంగా వారు మరొక వాహనాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

Image 22