• English
  • Login / Register

ఉత్తర భారతదేశంలో వరద-ప్రభావిత వాహన యజమానులకు తన మద్దతును తెలిపిన వోక్స్వాగన్ ఇండియా

జూలై 19, 2023 04:55 pm rohit ద్వారా ప్రచురించబడింది

  • 3.1K Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

సేవా ప్రచారంలో భాగంగా, ఆగస్ట్ 2023 చివరి వరకు వోక్స్వాగన్ బాధిత-వాహన యజమానులకు ఉచిత రోడ్‌సైడ్ సహాయాన్ని అందిస్తుందిVolkswagen Virtus

గత కొన్ని వారాలుగా ఢిల్లీ, రాజస్థాన్ మరియు మరికొన్ని ఉత్తరాది రాష్ట్రాలలో  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాలలో వరదలు మరియు  తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. వోక్స్వాగన్ ఇండియా వరద  ప్రభావిత-వాహన యజమానులకు మద్దతునిచ్చేందుకు ఒక సేవా ప్రచారాన్ని ప్రకటించి దానిని వేగవంతం చేసింది .

వోక్స్వాగన్ ఇండియా ఆగస్ట్ 2023 చివరి వరకు జమ్మూ మరియు కాశ్మీర్, ఢిల్లీ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ మరియు చండీగఢ్ వినియోగదారులకు ఉచిత రోడ్‌సైడ్ సహాయాన్ని  (RSA) అందిస్తుంది. దీనికి అదనంగా, కార్ల తయారీదారు ఇప్పటికే వినియోగదారులకు డీలర్‌షిప్‌ల వద్ద మరమ్మత్తు అంచనా మరియు పార్కింగ్ సౌకర్యం కోసం ప్రామాణిక మద్దతును అందిస్తోంది

Volkswagen cars

వరద-సంబంధిత నష్టాలను సకాలంలో సరిచేయడానికి వోక్స్వాగన్ వాహనం యొక్క వివరణాత్మక మరియు సమగ్ర సేవా తనిఖీని కూడా ప్రారంభిస్తుంది.వరద  ప్రభావిత-వాహన యజమానులు సత్వర పరిష్కారం కోసం 1800-102-1155 లేదా 1800-419-1155 వద్ద కార్‌మేకర్ యొక్క RSA బృందాన్ని సంప్రదించవచ్చు. వోక్స్వాగన్ యజమానులు కూడా దీని ప్రయోజనాన్ని పొందవచ్చుకార్‌మేకర్ ద్వారా  కొనసాగుతున్న వర్షాకాల సేవా శిబిరం జూలై 2023 చివరి వరకు అమలులో ఉంటుంది.వారి వాహనాలు ఆరోగ్యకరముగా  ఉండేలా చూసుకోవాలి.

కూడా చదవండి:వోక్స్వాగన్ టైగూన్ లాటిన్ NCAP క్రాష్ టెస్ట్‌లలో 5 స్టార్‌లతో తనను తాను మరొకసారి నిరూపించుకుంది

కార్‌మేకర్ గురించి వివరణ ఇక్కడఉంది.

వోక్స్వాగన్ ఇండియా వరద బాధిత కొనుగోలుధారులకు తన  సేవా మద్దతు  అందిస్తుంది

– వినియోగదారులందరికీ విస్తరించిన సేవా మద్దతు: జమ్మూ & కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ మరియు ఉత్తర ప్రదేశ్ మరియు UT చండీగఢ్ లలో వరదల కారణంగా ప్రభావితమైన వినియోగదారులకు వోక్స్వాగన్ ఇండియా ప్రత్యేక ప్రయోజనాలతో పాటు ఉచిత రోడ్‌సైడ్ సహాయాన్ని (RSA)ని అందిస్తోంది. 

– వరద ప్రభావిత కొనుగోలుధారులు నేరుగా వోక్స్వాగన్ యొక్క రోడ్‌సైడ్ సహాయమును 18001021155 లేదా 18004191155 నంబర్‌లో సంప్రదించవచ్చు

ముంబై– వోక్స్వాగన్ ప్యాసింజర్ కార్స్ భారతదేశంలోని ఉత్తర ప్రాంతంలో వరదల కారణంగా ప్రభావితమైన తన కొనుగోలుధారులకు ప్రత్యేక సేవా మద్దతును ప్రకటించింది. బాధ్యతాయుతమైన కార్పొరేట్‌ బ్రాండ్ గా  జమ్మూ & కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్ మరియు UT చండీగఢ్‌లోని వినియోగదారులకు 31 ఆగస్టు 2023 వరకు అదనపు ఖర్చు లేకుండా కాంప్లిమెంటరీ రోడ్‌సైడ్ సహాయమును అందించడం ద్వారా తన యొక్క సేవా మద్దతును అందిస్తుంది. 24X7 ఉచిత రోడ్‌సైడ్ సహాయమును [RSA]తో పాటు, డీలర్‌షిప్‌ల వద్ద మరమ్మతు అంచనా మరియు పార్కింగ్ కోసం ప్రామాణిక మద్దతు ఇప్పటికే వినియోగదారులకు అందించబడుతోంది.

వినియోగదారుల భద్రత మరియు అవాంతరాలు లేని యాజమాన్య అనుభవాన్ని నొక్కిచెప్పే కంపెనీ యొక్క 'కస్టమర్-ఫస్ట్' అనే నానుడికి అనుగుణంగా ఈ కార్యక్రమము చేపట్టబడింది. కస్టమర్‌లు తమ సాధారణ జీవితాన్ని త్వరలో పునఃప్రారంభించడం మరియు సురక్షితమైన డ్రైవింగ్ అనుభవాన్ని పొందడమే ఈ ప్రత్యేక సేవా మద్దతు యొక్క లక్ష్యం. వరద ప్రభావిత కార్ల కోసం ప్రాధాన్యతను బట్టి  సమీప డీలర్‌షిప్‌కు రవాణా చేసే చర్యలో భాగముగా కాంప్లిమెంటరీ రోడ్‌సైడ్ సహయము ఉంటుంది.

Volkswagen Tiguan

అదనంగా, వరద సంబంధిత నష్టాలను సకాలంలో మరమత్తు చేయడానికి వాహనం యొక్క వివరణాత్మక మరియు సమగ్ర సేవా తనిఖీలు చేపట్టబడతాయి. శీఘ్ర సేవ అనుభవముతో నిర్ధారించి  డీలర్‌షిప్‌లలో అవసరమైన ప్రామాణిక మరమ్మతు చేయడానికి కావలసిన మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి. 

ఉత్తర ప్రాంతంలోని బాధిత కస్టమర్‌లు వెంటనే చేరుకోవడానికి 18001021155 లేదా 18004191155 నంబర్‌లో వోక్స్వాగన్ రోడ్‌సైడ్ సహాయకులను  సంప్రదించవచ్చు.

కూడా చదవండి:వోక్స్వాగన్ విర్టుస్ GT లైన్ కొత్త ఎంట్రీ-లెవల్ DCT వేరియంట్‌తో మరింత మెరుగైనది.

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
  • కియా syros
    కియా syros
    Rs.9.70 - 16.50 లక్షలుఅంచనా ధర
    ఫిబరవరి, 2025: అంచనా ప్రారంభం
  • ఎంజి majestor
    ఎంజి majestor
    Rs.46 లక్షలుఅంచనా ధర
    ఫిబరవరి, 2025: అంచనా ప్రారంభం
  • వోల్వో ఎక్స్సి90 2025
    వోల్వో ఎక్స్సి90 2025
    Rs.1.05 సి ఆర్అంచనా ధర
    మార, 2025: అంచనా ప్రారంభం
  • కొత్త వేరియంట్
    మహీంద్రా be 6
    మహీంద్రా be 6
    Rs.18.90 - 26.90 లక్షలుఅంచనా ధర
    మార, 2025: అంచనా ప్రారంభం
  • కొత్త వేరియంట్
    మహీంద్రా xev 9e
    మహీంద్రా xev 9e
    Rs.21.90 - 30.50 లక్షలుఅంచనా ధర
    మార, 2025: అంచనా ప్రారంభం
×
We need your సిటీ to customize your experience