Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

Volkswagen Golf GTI ఇండియాకు వస్తోంది, కొన్ని డీలర్‌షిప్‌లలో ప్రీ బుకింగ్స్ మొదలు

వోక్స్వాగన్ గోల్ఫ్ జిటిఐ కోసం shreyash ద్వారా ఫిబ్రవరి 06, 2025 03:54 pm ప్రచురించబడింది

మాకు తెలిసిన మూలాల ప్రకారం, గోల్ఫ్ జిటిఐ ఇండియాలో పూర్తి ఇంపోర్ట్ గా ప్రవేశపెట్టబడుతుంది మరియు పరిమిత సంఖ్య యూనిట్లలో లభిస్తుందని ఆశించబడుతోంది

  • ఎంపిక చేసిన డీలర్‌షిప్ ల వద్ద కస్టమర్లు గోల్ఫ్ జిటిఐ ని ప్రీ బుక్ చేసుకోవచ్చు.

  • మాకు తెలిసిన మూలాల ప్రకారం, గోల్ఫ్ జిటిఐ కేవలం 250 యూనిట్లకు పరిమితం కావచ్చు.

  • ఇది అగ్రెసివ్ అయిన మ్యాట్రిక్స్ LED హెడ్‌లైట్లతో బోల్డ్ డిజైన్, 18 లేదా 19 ఇంచుల అలాయ్ వీల్స్, మరియు డ్యుయల్ ఎగ్జాస్ట్ సెటప్ కలిగి ఉంది.

  • ఇది మెటాలిక్ పెడల్స్ మరియు జిటిఐ లోగో కల 3-స్పోక్ స్టీరింగ్ వీల్ తో అంతా-బ్ల్యాక్ ఉండే క్యాబిన్ థీమ్ తో వస్తుంది.

  • ఇది 2-లీటర్ల టర్బో-పెట్రోల్ ఇంజన్ చే పవర్ పొంది 245 PS మరియు 370 Nm ఉండేలా చేస్తుంది.

  • రు. 52 లక్షల ధర (ఎక్స్-షోరూమ్) ఉంటుందని ఆశించబడుతోంది.

జర్మన్ మార్క్ దేశంలో ఈ హాట్ హ్యాచ్ ని ప్రవేశపెట్టడానికి తయారీ చేసుకుంటోంది కాబట్టి ఇండియాలో అనేకమంది వోక్స్‌వాగన్ ఔత్సాహికుల కోసం కలగా ఊహించబడుతోన్న Volkswagen Golf GTI త్వరలోనే సాకారం కాబోతోంది. గోల్ఫ్ జిటిఐ సంపూర్ణంగా దిగుమతి అవుతోంది కాబట్టి, ఇండియాలో కేవలం 250 యూనిట్లు మాత్రమే లభించబోతున్నట్లు మాకు తెలిసిన మూలాలు సూచిస్తున్నాయి. అంతే కాకుండా, ఇండియాలో కొన్ని వోక్స్‌వాగన్ డీలర్‌షిప్‌లు కూడా ఇప్పుడు గోల్ఫ్ జిటిఐ కోసం ఆఫ్‌లైన్ ఆర్డర్లను స్వీకరిస్తున్నాయి.

గోల్ఫ్ జిటిఐ డిజైన్

ఒక హాట్ హ్యాచ్ గా గోల్ఫ్ జిటిఐ, తొలి చూపులోనే స్పోర్టీ మరియు అగ్రెసివ్ ప్రకంపనాన్ని ప్రదర్శిస్తోంది, అయినా ఇది ఇప్పటికీ సిగ్నేచర్ వోక్స్‌వ్యాగన్ డిజైన్‌ను కొనసాగిస్తోంది. ఇది మ్యాట్రిక్స్ LED హెడ్‌లైట్లు, మధ్యలో ఉంచబడిన 'VW' లోగోను కలిగి ఉన్న సొగసైన గ్రిల్ మరియు అగ్రెసివ్ హనీకోంబ్ మెష్ ప్యాటర్నుతో కూడిన ఫ్రంట్ బంపర్‌తో వస్తుంది. దీని అగ్రెసివ్ పోకడని 18-ఇంచుల 'రిచ్‌మండ్' అలాయ్ వీల్స్ (ఆప్షనల్ 19-ఇంచుల సెట్‌తో), స్పోర్టీ డిఫ్యూజర్ మరియు రియర్ లో డ్యూయల్ ఎగ్జాస్ట్ సెటప్ మరింతగా పెంపొందిస్తాయి. దీని గ్రిల్, ఫెండర్ మరియు టెయిల్ గేట్‌పై ఉన్న దాని 'GTI' బ్యాడ్జ్ ఇంకా దీన్ని స్పోర్టియర్ హ్యాచ్‌బ్యాక్‌గా ప్రత్యేకంగా నిలబెడతాయి.

క్యాబిన్ మరియు ఫీచర్లు

గోల్ఫ్ జిటిఐ పూర్తిగా బ్ల్యాక్ క్యాబిన్ థీమ్‌ కలిగి ఉంటుంది, దీనిలో లేయర్డ్ డాష్‌బోర్డ్ డిజైన్ మరియు టార్టాన్-క్లాడ్ స్పోర్ట్ సీట్లు ఉన్నాయి. దీనికి మెటాలిక్ పెడల్స్ మరియు 'GTI' బ్యాడ్జ్‌తో 3-స్పోక్ స్టీరింగ్ వీల్ కూడా ఉంది. దీని ఫీచర్ సెట్‌లో GTI-స్పెసిఫిక్ సంపూర్ణంగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు 12.9-ఇంచుల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, ఆటో ఏసి, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ మరియు యాంబియంట్ లైటింగ్ ఉన్నాయి.

హ్యాచ్‌బ్యాక్ లో 245 పిఎస్

గోల్ఫ్ జిటిఐ 2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ చే పవర్ పొంది ఉంది, ఇది అద్భుతమైన 245 PS మరియు 370 Nm టార్క్‌ను ఉ ఉండేలా చేస్తుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి, ఈ హ్యాచ్‌బ్యాక్ యొక్క ఫ్రంట్ వీల్స్ ని డ్రైవ్ చేస్తుంది. ఇది కేవలం 5.9 సెకన్లలో గంటకు 100 కి.మీ.ల వేగాన్ని అందుకోగలుగుతుంది మరియు 250 కి.మీ.ల టాప్ స్పీడ్ కలిగి ఉంటుంది.

ఊహించబడిన ధర మరియు ప్రత్యర్థులు

సంపూర్ణంగా దిగుమతి చేసుకోబడే ఈ గోల్ఫ్ జిటిఐ ధర రూ. 52 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉండవచ్చునని ఊహించబడుతోంది. ఇండియాలో, గోల్ఫ్ జిటిఐ మినీ కూపర్ S వంటి వాటిని అధిగమించి దూసుకుపోబోతోంది.

ఆటోమోటివ్ ప్రపంచం నుండి అప్పటికప్పుడు అప్‌డేట్‌లు పొందడానికి కార్దెకో వాట్సప్ ఛానెల్ ని అనుసరించండి

Share via

Write your Comment on Volkswagen Golf జిటిఐ

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కన్వర్టిబుల్ కార్స్

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఫేస్లిఫ్ట్
ఎలక్ట్రిక్కొత్త వేరియంట్
Rs.18.90 - 26.90 లక్షలు*
ఎలక్ట్రిక్కొత్త వేరియంట్
Rs.21.90 - 30.50 లక్షలు*
Rs.9 - 17.80 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.11.82 - 16.55 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర