Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

వోక్స్వ్యాగన్ ఏమియో నిన్న పరిచయం చేయబడింది ; 2016 మధ్య భాగంలో ప్రారంభం

ఫిబ్రవరి 03, 2016 12:05 pm konark ద్వారా ప్రచురించబడింది

జర్మన్ కార్ల తయారీ సంస్థ ఫోక్స్వ్యాగన్ భారతదేశం కోసం చేయబడిన సబ్ కాంపాక్ట్ సెడాన్ ఏమియో ని నిన్న పరిచయం చేసింది. పోలో హ్యాచ్బ్యాక్ ఆధారంగా, ఇది భారత మార్కెట్లో వోక్స్వ్యాగన్ యొక్క మొట్టమొదటి కాంపాక్ట్ సెడాన్ గా ఉంది మరియు మహారాష్ట్ర, చకన్ కంపెనీ తయారీ సౌకర్యం వద్ద స్థానికంగా అభివృద్ధి చేయబడింది. ఈ కారు 2016 మధ్య భాగంలో విడుదల కానుంది.

Volkswagen Ameo

ఫోక్స్వ్యాగన్ ఏమియో ఫోర్డ్ ఫిగో ఆస్పైర్, మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, టాటా జెస్ట్, హ్యుందాయ్ ఎక్సెంట్ మరియు కాంపాక్ట్ సెడాన్ విభాగంలో హోండా అమేజ్ వంటి వాహనాలతో పోటీ పడుతుంది. సబ్ నాలుగు మీటర్ల కారు వోక్స్వ్యాగన్ పోలో హ్యాచ్బ్యాక్ చూసిన అదే ఇంజన్ ఎంపికలను కలిగి ఉంది. ఈ కారు 1.2-లీటర్, మూడు సిలిండర్లMPIపెట్రోల్ ఇంజిన్ తో 74bhp శక్తిని మరియు 110Nm టార్క్ ని అందిస్తుంది మరియు 1.5-లీటర్, ఫోర్-సిలిండర్ టీడీఐ డీజిల్ ఇంజిన్ 88.7bhp శక్తిని మరియు 230Nm టార్క్ ని అందిస్తుంది. ట్రాన్స్మిషన్ బాధ్యతలు ఫైవ్ స్పీడ్ మాన్యువల్ లేదా ఒక DSG ఆటోమేటిక్ గేర్బాక్స్ ద్వారా నిర్వహించబడతాయి.

Volkswagen Ameo

భద్రత పరంగా, ఏమియో వాహనం ఫ్రంట్ స్టాండర్డ్ ఎయిర్బ్యాగ్స్ ABS తో వస్తుంది. ఇంకా దీనిలో రేర్ కెమెరా, టచ్ స్క్రీన్ సమాచార వినోద వ్యవస్థ, సెగ్మెంట్ మొదటి క్రూయిజ్ నియంత్రణతో పాటుగా విద్యుత్ అద్దాలు మరియు రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వంటి లక్షణాలను కలిగి ఉంది. ఫోక్స్వ్యాగన్ ఏమియో వాహనం ఫోక్స్వ్యాగన్ పోలో GTI, న్యూ బీటిల్,టైగన్ మరియు పసాత్ జిటిఐ వంటి వాహనాలతో పాటుగా రాబోయే ఆటో ఎక్స్పోలో ప్రదర్శించబడుతుంది.

వోక్స్వ్యాగన్ ఏమియో వీడియో ని వీక్షించండి

k
ద్వారా ప్రచురించబడినది

konark

  • 15 సమీక్షలు
  • 0 Comments

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఎలక్ట్రిక్
Rs.1.20 సి ఆర్*
ఫేస్లిఫ్ట్
Rs.67.65 - 71.65 లక్షలు*
ఫేస్లిఫ్ట్
Rs.11.70 - 20 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర