ఫోక్వాగెన్ సీఈఓ వారు ఎమిషన్ కుంభకోణంపై "నిరంతరాయంగా క్షమాపణలు" తెలుపుతున్నారు; విచారణ జరుపుతామని ప్రమాణం
జైపూర్: ఫోక్స్వాగెన్ గ్రూప్ కి సీఈఓ అయిన మార్టిన్ వింటర్కార్న్ గారు US NOx పరీక్షని రిగ్గింగ్ చేయించినందుకు క్షమాపణలు తెలిపారు. ఈ కుంభకోణం దాదాపు 11 మిలియన్ వాహనాలపై ప్రభావం చూపింది అని ఒప్పుకున్నారు. ఈ కుంభకోణానికి అసలు కారణం తెలియరాలేదని, అయినా విచారణ జరిపిస్తామని ఆయన తెలిపారు.
" ప్రస్థుతం మా దగ్గర అన్ని ప్రశ్నలకు సమాధానాలు లేవు. కానీ ఏమైంది అనే విషయాన్ని కనుగొనేందుకు మేము అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాము. ఎంత త్వరగా వీలు అయితే అంత త్వరగా మేము నిజాన్ని వెలికి తీస్తాము," అని వింటర్కార్న్ గారు ఒక అధికార ప్రకటనలో తెలిపారు.
కస్టమర్లకు భరోసా ఇస్తూ, ఫోక్స్వాగెన్ ఉనికికి పూర్తి విరుద్దంగా ఈ ఇంజిన్లు ఉన్నాయి. వారి ప్రకటన లో, ఎవరెవరికి ఈ సాఫ్ట్వేర్ మాల్వేర్ గురించి తెలుసో, ఎలాUS NOx పరీక్షలో సామర్ధ్యానికి మించి ఎల పని చేసాయో, ఇవి ఏయే విభాగాలు మరియూ శాఖలతో సంబంధం కలిగి ఉన్నాయో మేము తెలుసుకుంటాము అని తెలిపారు. "ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి అని తెలుసు. నేను అర్థం చేసుకోగలను. కానీ 6 లక్షల మంది నిజాయతీ తో కూడిన కష్టం పై నింద మోపడం మంచిది కాదు," అని సెలవిచ్చారు. ఫోక్స్వాగెన్ వారు ఈ కుంభకోణం కరణంగా సీఈఓ వారి పదవిని కోల్పోవచ్చును అనే విషయాన్ని కొట్టి వేశారు. కాని వర్తల ప్రకారం, పోర్షే సీఈఓ మతియాస్ ముల్లర్ గారు విటర్కార్న్ ని భర్తీ చేయ వచ్చును.