భారతదేశం లో రాబోయే హ్యుందాయ్ కార్లు
డిసెంబర్ 02, 2015 03:21 pm manish ద్వారా ప్రచురించబడింది
- 15 Views
- 1 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
భారతదేశం యొక్క రెండవ అతిపెద్ద వాహన తయారీసంస్థ, దాని తాజా సమర్పణ ఇటీవల విడుదలైన హ్యుందాయ్ క్రెటా కాంపాక్ట్ SUV యొక్క విజయం కారణంగా సంతోషంగా ఉంది. కారు అందుకున్న అద్భుతమైన స్పందన మరియు దాని పోటీదారులు అందించే నవీకరణలను (మహీంద్రా XUV500 AT)చూసి ప్రేరణ పొంది, ఈ కొరియన్ వాహన తయారీసంస్థ భారత వీధులలోకి వారి కొత్త ఉత్పత్తుల శ్రేణిని తీసుకురానున్నది. కాబట్టి హ్యుందాయ్ యొక్క రాబోయే కార్ల జాబితాను చూడండి.
సొనాట:
తదుపరి తరం హ్యుందాయ్ సొనాట సంస్థ యొక్క ఫ్లుయిడిక్ స్కల్ప్చర్ 2.0 రూపకల్పనను కలిగి ఉంటుంది. అలానే దీనిలో LED పగటిపూట నడుస్తున్న లైట్లు, 16-అంగుళాల అలాయ్ వీల్స్, రియర్ లిప్ స్పాయిలర్, రాకర్ ప్యానెల్ పొడిగింపులు మరియు ఒక డ్యుయల్ ఎగ్సాస్ట్ వ్యవస్థ వంటి సౌందర్య నవీకరణలు కూడా అందించబడతాయి. ఇంజిన్ విషయానికి వస్తే, ఈ కారు 2.0 లీటర్ టర్బో చార్జెడ్ పెట్రోల్ ఇంజిన్ ని కలిగియుండి 245bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు 2.4 లీటర్ తీటా II GD ఇంజన్ ని కలిగియుండి 185bhp శక్తిని అందిస్తుంది.
టక్సన్:
హ్యుందాయి సంస్థ యొక్క తదుపరి విడత టక్సన్ అత్యుత్తమ్మ పరికరాలతో మరియు 2WD మరియు 4WDఎంపికను కలిగి ఉంటుంది. ఈ కారు స్టయిలింగ్ పరంగా, హ్యుందాయ్ యొక్క ఫ్లుయిడిక్ డిజైన్ 2.0 ని కలిగి ఉంటుంది మరియు భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ రెండు వేరియంట్లలో వస్తుంది. ఈ పవర్‌ప్లాంట్ 114bhp శక్తిని అందించే 1.7 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 182bhp శక్తిని అందించే CRDI డీజిల్ మిల్లు ని రెండిటిలో ఏదో ఒక దానిని కలిగి ఉండే అవకాశం ఉంటుంది.
శాంటా-ఫే:
శాంటా ఫే ఒక 2.2-లీటర్ CRDi డీజిల్ ఇంజన్ ని కలిగియుండి 200bhp శక్తిని మరియు 440Nm టార్క్ ని అందిస్తుందని భావిస్తున్నారు. పెట్రోల్ వేరియంట్ లో, ఈ కారు తీటా II 2.4-లీటర్ ఇంజిన్ ని కలిగియుండి 187bhp శక్తిని మరియు 241Nm టార్క్ ని అందిస్తుంది. అలానే ఈ వాహనం సిక్స్-స్పీడ్ ఆటోమెటిక్ ఆప్షన్ తో ప్రామాణిక సిక్స్ స్పీడ్ ట్రాన్స్మిషన్ ని కూడా కలిగి ఉంటుంది. సౌందర్యపరంగా, కొత్త శాంటా ఫే హ్యుందాయ్ సాంప్రదాయ కుటుంబం స్టైలింగ్ ని కలిగి ఉంటుంది.
ఎలంట్రా :
హ్యుందాయ్ 2016 మూడవ త్రైమాసికంలో భారతదేశంలో తదుపరి తరం ఎలంట్రా ని పరిచయం చేస్తుందని భావిస్తున్నారు. ఈ కొరియన్ వేరియంట్స్ రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఎంపికను కలిగి ఉంటాయి. అవి 134bhp శక్తిని మరియు 30.59kgmటార్క్ ని అందించే 1.6 VGT డీజిల్ మరియు 130bhp శక్తిని మరియు 16.41kgm టార్క్ ని అందించే 1.6 GDi పెట్రోల్ ని మరియు 147bhp శక్తిని మరియు 18.35kgm టార్క్ ని అందించే 2.0 Nu పెట్రోల్ ని కలిగి ఉంటుంది. కంపెనీ భారత మోడల్ లో కనిపించే పవర్ ట్రెయిన్ గురించి ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు.
పొందండి హ్యుందాయి ఎలంట్రా యొక్క ఆన్-రోడ్ ధర : హ్యుందాయ్ ఎలంట్రా
ఇంకా చదవండి