హ్యుందాయ్ ఎలంట్రా

` 12.9 - 19.9 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

హ్యుందాయ్ ఇతర కారు మోడల్‌లు

 
*Rs

హ్యుందాయ్ ఎలంట్రా వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 

అవలోకనం:


హ్యుందాయ్ మోటార్స్, అంతర్జాతీయంగా ప్రసిద్ధిగాంచిన ఆటోమొబైల్ సంస్థ మరియు భారతదేశం లో రెండవ అతిపెద్ద తయారీదారులు , ఇపుడు ఉప-ఖండంలో దాని ప్రీమియం సెడాన్ నవీకరించబడిన వెర్షన్ ఎలంట్రా ను ప్రారంభించింది. ఈ తాజా వెర్షన్ లోపల మరియు బయట అనేక సౌందర్య సాధనాల నవీకరణలను కలిగి ఉండడం వలన ఇది మరింత ఆధునిక రూపాన్ని సంతరించుకుంది.సౌందర్య సాధనాల నవీకరణలు కాకుండా , ఈ వాహనం కూడా కొన్ని అదనపు క్రియాత్మక లక్షణాలను కలిగి ఉంది అవి రేర్ కెమెరా తో పాటు వెనుక పార్కింగ్ సహాయక వ్యవస్థ మరియు విద్యుత్‌తో సర్దుబాటయ్యే మరియు ముడుచుకొనే బయట అద్దాలు. మరోవైపు, దీని సాంకేతిక వివరణల గురించి ఎలాంటి నవీకరణలు లేవు. మరియు ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ రెండు ఆప్షన్లతో అందుబాటులో కొనసాగుతోంది. దాని మునుపటి వెర్షన్ వలె ఈ నవీకరించబడిన వెర్షన్ కూడా కొనుగోలుదారులకు ఎంచుకోవడానికి మొత్తం ఏడు వేరియంట్స్ తో అందుబాటులో ఉంది. దాని పెట్రోల్ ట్రిమ్స్ 1797సిసి స్థానభ్రంశం కలిగిన 1.8-లీటర్ ఇంజన్ తో అమర్చారు.అయితే దాని డీజిల్ ట్రిమ్స్ 1582సిసి స్థానభ్రంశం తో ఉండగా 126.2bhp శక్తిని ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంది దానితో పాటు 259.8Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. తయారీదారుడు దాని బ్రేకింగ్ యంత్రాంగంను దాని మునుపటి వెర్షన్ వలే అదే బ్రేకింగ్ వ్యవస్థ తో అందుబాటులో ఉంది, ఇబిడితో పాటు ఉన్నతమైన ఎబిఎస్ తో కూడిన మరియు బ్రేక్ ల విధులతో సహకరించే ఉన్నతమైన వాటిని దీనిలో అమర్చారు. దాని యొక్క బాహ్య స్వరూపాల పరంగా చూస్తే , ఈ తాజా తరం సెడాన్ పునరుద్ధరించబడిన ఫాగ్ ల్యాంప్స్, కన్సోల్ తో పాటు పునరుద్దరించబడిన బంపర్స్ ను పొందుతుంది. అదే విధంగా , అది ఎల్ఈడి గైడ్ కాంతి తో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ను కలిగి ఉండి, ముందు భాగంలో ముఖద్వారానికి ఒక డైనమిక్ అప్పీల్ ను అందిస్తుంది. ఇంకోవైపు. దాని బెల్ట్ లైన్ క్రోమ్ తో అలంకరించబడి మరియు దాని రక్షణ కవచాలు కొత్తగా రూపకల్పన చేసిన అల్లాయ్ వీల్స్ తో బిగించబడి ఉంటాయి. తయారీదారుడు కూడా లోపల క్యాబిన్ కి అన్ని నలుపు రంగుల స్కీమ్ లు ఇవ్వడం ద్వారా మార్పులు చేశారు. అదే సమయంలో, అది అల్యూమినియం పెడల్స్ కూడా కలిగి వాటితో పాటు ఒక క్రొత్త ఫ్లోర్ కన్సోల్ బాక్స్ ను దానిలో కలిగి ఉంది. ఇది వెనుక ప్రయాణీకుల కోసం ఎయిర్ కండిషనింగ్ వెంట్స్ ను కూడా కలిగి ఉంది. అదనంగా, దాని డాష్ బోర్డ్ స్వల్ప మార్పులు చేసి మరియు ఇప్పుడు దానిని ఒక కొత్త 4.3-అంగుళాల సమాచార వ్యవస్థ తో అమర్చారు. ఇది ఒక పునరుద్దరించబడిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను కలిగి లోపల చూడడానికి ఒక మంచి లుక్ ని ఇస్తుంది. వీటితో పాటు, దాని మిగిలిన సౌకర్యం మరియు భద్రత లక్షణాలను దాని అవుట్ గోయింగ్ మోడల్ లాగే ఉంచారు. ఈ వాహనం ఒక మంచి క్యాబిన్ స్థలాన్ని కలిగి ఉంది అనగా ఇది కనీసం ఐదుగురు ప్రయాణికులకు సరిపోయేంత విశాలంగా ఉంది. ఇది ఒక బ్రహ్మాండమైన బూట్ కంపార్ట్మెంట్ తో పాటు ఒక సుదీర్ఘ సెలవుల యాత్రకు ప్లాన్ చేసుకునే విధంగా ఒక పెద్ద ఇంధన ట్యాంక్ ను కలిగి మరింత సహాయపడుతుంది.ఈ వాహనం ప్రస్తుతం ఆధునిక సౌకర్యాలైన 10వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, డ్యుయల్ జోన్ ఫుల్ ఆటోమేటిక్ ఎసి యూనిట్, ఒక 2-దిన్ ఆడియో సిస్టమ్, మరియు వివిధ ఇతర పరికరాలతో తయారైన ఒక వ్యూహం తో అందుబాటులో ఉంది. భద్రత పరంగా, ఉత్పత్తిదారులు ఆరు ఎయిర్ బ్యాగ్స్ తో, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ తో , మరియు వాహన స్థిరత్వం నిర్వహణ వ్యవస్థ లతో కూడిన అంశాలను రోడ్డుపై భద్రత కోసం ఎంతగానో అవసరమైన వీటిని దీనిలో పొందుపరిచారు. ఇది ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో టయోటా కొరొల్లా, స్కోడా ఆక్టావియా మరియు చేవ్రొలెట్ క్రుజ్ లకు పోటీగా నిలుస్తుంది.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


ఇంజన్ లో ఎలాంటి ప్రత్యేక లక్షణాలు, ఎటువంటి మార్పులు లేకపోవడం వలన అందుకే ఇది దాని ముందు వెర్షన్ ఇచ్చిన మైలేజ్ ని ఇస్తుంది. దీని 1.6 లీటర్ డీజిల్ మోటార్ ఒక కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంధన సరఫరా వ్యవస్థ తో సంఘటితం చేయబడి దాని ఇంధన సామర్ధ్యం పెంచడానికి సహాయపడుతుంది . ఈ ఇంజన్ నగరాలలో 18kmpl మైలేజ్ ని అందిస్తూ, రహధారులపై 22.7kmpl వరకు వెళుతుంది. అయితే, దాని ఆటోమేటిక్ వేరియంట్ గరిష్టంగా 19.5kmpl మైలేజ్ ని అందిస్తుంది. మరోవైపు, తన పెట్రోల్ మిల్ ఇంజిన్ విమర్శకుల ప్రశంసలు పొందిన బహుళ పాయింట్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ సరఫరా వ్యవస్థ తో సంఘటితం చేయబడి ఉంటుంది. ఈ పెట్రోల్ ఇంజన్ 16.3kmpl మైలేజ్ అందిస్తుంది, దాని ఆటోమేటిక్ వెర్షన్ రహధారులపై సుమారు 14.5 kmpl మైలేజ్ ని ఉత్పత్తి చేయడం లో సహాయ పడుతుంది.

శక్తి సామర్థ్యం:


పెట్రోల్, డీజిల్ ఇంజిన్లు డిఒహెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా చేసిన 4-సిలిండర్లు మరియు 16-వాల్వ్స్ ను కలిగి ఉన్నాయి.అయితే, దాని పెట్రోల్ మిల్లు 1797సిసి స్థానభ్రంశంను కలిగి మరియు గరిష్టంగా 147.5 bhp శక్తి ఉత్పత్తి ని, 177.5nm పీక్ టార్క్ ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. మరోవైపు, దాని డీజిల్ మిల్లు 1582సిసి స్థానభ్రంశం తో 126.3bhp ఉన్నత శక్తిని, మరియు 259.9nm సంఘటితం చేయబడిన టార్క్ ఉత్పత్తి ని అందజేస్తుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


ఈ సంస్థ రెండు ఇంజిన్ల ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఈ వాహనం యొక్క ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లతో జత చేయబడి ఉంటుంది. డీజిల్ మోటార్ తో ఉన్న వేరియంట్ సుమారు 15 సెకన్లలో 0 100 kmph వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ఇదే సమయంలో, ఈ వాహనం 190 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది. మరోవైపు, తన పెట్రోల్ వేరియంట్ 195 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంది అయితే సుమారు 12 సెకన్లలో 100 kmph వేగాన్ని చేరుకోగలుగుతుంది.

వెలుపలి డిజైన్:


ఈ వాహన తయారీదారుడు హ్యుందాయ్ ఎలంట్రా తాజా వెర్షన్ లో చిన్న చిన్న నవీకరణలు చేసి, దాని శరీర నిర్మాణాన్ని మాత్రం తత్వశాస్త్రం లోని 'వెర్నా' రూపకల్పన తోనే నిలిపివేశాడు. ఇక ముందు భాగం డిజైన్ విషయానికొస్తే ఇది కొద్దిగా శుద్ధి చేసిన బంపర్ తో కూడి ఉండి మరియు దీని యొక్క ఫాగ్ లైట్ కన్సోల్ ఒక కొత్త రూపాన్ని సంతరించుకుంది. అలాగే అది కొంచెం పెద్దగా ఉండే ఫాగ్ లైట్లతో ఉండడం వలన ఒక కొత్త స్టైలిష్ రీతిలో కనపడుతుంది. దీని యొక్క క్లస్టర్ లైట్స్ అలాగే ఉంచారు కానీ వాటికి ఎలీడి గైడ్ లైట్లతో కూడిన హెడ్ ల్యాంప్స్ ని అమర్చడం వలన ముందు భాగం ఒక డైనమిక్ వైఖరిని కనబరుస్తుంది. ఆశ్చర్యకరంగా, ఈ సిరీస్ లో అన్ని రూపాంతరాలు లైటింగ్ ఫీచర్అమర్చబడి ఉన్నాయి. ఇవి కాకుండా ఈ కారులో ఎలాంటి మార్పులు చేయలేదు. దాని ఎగువ రేడియేటర్ గ్రిల్ చాలా చిన్నగా కనిపిస్తుంది మరియు క్రోమ్ పూత స్ట్రిప్ తో అందంగా అమర్చి ఉంటుంది. దీనికి మరింత ధీటుగా కంపనీ లోగో తో పొందుపరిచారు. అయితే దీని తక్కువ గ్రిల్ మాత్రం చాలా పెద్దగా ఉండే అడ్డ గీతలతో కూడిన స్ట్రిప్స్ లక్షణాలతో ఉండడం వలన అధిక వివరణను బ్లాక్ లో కూడా ఇస్తుంది. అదే విధంగా దానిలో ఉండే వెర్నా పంక్తులతో కూడిన వ్యక్తీకరణ అధునాతన ఎంపికలు దాని ఏరోడైనమిక్ ఛాయా చిత్రాన్ని పెంచుతాయి. ఈ వాహనాల సైడ్ ప్రొఫైల్ విషయానికి వచ్చినట్లయితే దాని వెర్నా పంక్తులు ఉండటం మూలంగా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది దాని ముందు వీల్ ఆర్చుల నుండి టెయిల్ గేట్ వరకు వెలుతుంది. ఇది బెల్ట్ లైన్ అచ్చుతో మరియు నలుపు రంగు బి స్తంభాలతో కూడిన క్రోమ్ పూత తో ఉండే డోర్ హ్యాండిల్స్ వంటి అధునాతన బాహ్య లక్షణాలు కలిగి ఉంది. దాని రేర్ వ్యూ మిర్రర్స్ కారు యొక్క బాడీ కలర్ లో ఉంటాయి మరియు వీటిని టర్న్ సూచికల తో సంఘటితం చేస్తారు. ఈ సిరీస్ లో అన్ని వేరియంట్స్ కి, ఇప్పుడు కొత్తగా రూపొందించిన 10-స్పోక్ డిజైన్ 16 అంగుళాల అలాయ్ వీల్స్ తో రూపొందించారు, ఇది మరింతగా దాని యొక్క రీతిని పెంచుతుంది. ఇక వెనుక భాగం చివర విషయానికొస్తే ఇది ఒక క్రోమ్ పూత కలిగిన పొగ గొట్టంపై కూడిన నల్ల రంగు దిగువ రక్షణ కవచం తో బిగించబడి ఉంటుంది. ఇక టెయిల్ లైట్ సమూహం విషయానికొస్తే దానిని అలాగే ఉంచారు కానీ వాటికి ఎల్ఈడి ప్రేరేపిత రేక్ లైట్లను అమర్చి మరింత అందంగా కనపడేలా తీర్చిదిద్దారు. దీని టెయిల్ గేట్ ఒక ప్రత్యేకమైన నమూనాను కలిగి ఉండడం వలన అది ఒక రూపాన్ని సంతరించుకుంది. దీనిని మరింత అందంగా ఒక క్రోమ్ పూత స్ట్రిప్ తో అలంకరించి సంస్థ యొక్క లోగో తో పొందుపరిచారు.

వెలుపలి కొలతలు:


సంస్థ దాని బంపర్స్ లో నవీకరణలను చేసినప్పటికీ దాని బాహ్య కొలతలలో ఎటువంటి మార్పులు చేయలేదు. ఇది 4530mm పొడవు ను, అలాగే 1775mm వెడల్పు (రేర్ వ్యూ మిర్రర్స్ తో సహా) కలిగి ఉంది. ఈ లగ్జరీ సెడాన్ యొక్క మొత్తం ఎత్తు 1470mm కలిగి చాలా మంచిగా ఉంది. మరియు వీల్ బేస్ 2700mm తో చాలా పొడవుగా ఉంది .

లోపలి డిజైన్ :


తయారీదారుడు, అంతర్గత భాగాలలో చిన్న చిన్న మార్పులు చేశాడు. అంతేకాకుండా ఆల్ బ్లాక్ ఇంటీరియర్ తో ఈ వాహనాన్ని అందించాడు. అదే సమయంలో, అల్యూమినియం పెడల్స్, ప్రీమియం డోర్ స్కఫ్ఫ్ ప్లేట్స్ తో పాటు ఎలంట్రా లెటరింగ్ రాసి ఉంటుంది. దీని వలన క్యాబిన్ మనోహరమైన అప్పీల్ ను ఇస్తుంది. అనేక స్టైలింగ్ అంశాలను కలిగి ఉంది. దీని కాక్‌పిట్ విభాగంలో మార్పు చేయబడిన ఫ్లోర్ కన్సోల్ బిగించి ఉంటుంది. సెంట్రల్ ఆర్మ్‌రెస్ట్ పై కప్ హోల్డర్స్ ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీని యొక్క డాష్‌బోర్డ్ నవీకరించబడినది. దీనిలో 4.3-అంగుళాల కలర్ డిస్ప్లేతో పాటు మంచి నాణ్యత కలిగిన సమాచార వ్యవస్థ అమర్చబడి ఉంటుంది. ఈ వాహనం ఇప్పుడు ఖచ్చితంగా కస్టమర్ ఉత్సాహాన్ని మరింత జోడించడం కోసం ఒక కూల్డ్ గ్లోవ్ బాక్స్ కంపార్ట్మెంట్ బిగించబడి ఉంటుంది. దీని యొక్క స్టీరింగ్ వీల్ లెధర్ అపోలిస్ట్రీ తో కప్పబడి ఉంటుంది. అంతేకాకుండా, ఈ స్టీరింగ్ వీల్ పై అనేక ఆడియో నియంత్రణ స్విచ్చులతో అమర్చబడి ఉంటుంది. మరియు క్రోం చేరికలతో అలంకరించబడి ఉంటుంది. ఈ సెడాన్ లో నవీకరించబడిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బిగించబడి ఉంటుంది. ఇది ఇంతకుముందే, ఉన్న సాంట ఫీ ఎస్యువి లో ఉండే విధంగా ఉంటుంది. వీటితో పాటు, దీని యొక్క ముందరి క్యాబిన్ లో విధ్యుత్తో 10 రకాలుగా సద్దుబాటయ్యే డ్రైవర్ సీట్ బిగించబడి ఉంటుంది. అన్ని లోపల సీట్లు చాలా వాలులను మరియు మంచి ప్రయాణ సౌకర్యం కోసం హెడ్ రెస్ట్ లతో పాటుగా సైడ్ బ్లోస్టర్స్ వంటి వాటిని కలిగి ఉంటాయి. వీటి యొక్క సీట్లు ప్రీమియం లెధర్ అపోలిస్ట్రీ తో కప్పబడి ఉంటాయి. దీని యొక్క ధిగువ మరియు మధ్య శ్రేణి వేరియంట్లలో మంచి నాణ్యత కలిగిన ఫాబ్రిక్ అపోలిస్ట్రీ తో ఉంటాయి. క్యాబిన్ యొక్క వెనుక భాగం విషయానికి వస్తే, వెనుక ఏసి వెంట్లను డ్రైవర్ సౌకర్యాల కోసం అమర్చారు. ఈ సెడాన్ యొక్క వెనుక సీట్ సెంట్రల్ ఆర్మ్‌రెస్ట్ లో ఒక నిల్వ బాక్స్ ఉంటుంది. 12V శక్తి అవుట్లెట్, ముందరి సీట్ల వెనుక పాకెట్లు, బోటిల్ హోల్డర్స్మరియు అనేక వినియోగ ఆధారిత కోణాలను అమర్చారు. ఇవన్నీ కూడా లోపల ప్రయాణీకుల అనుకూల్యములు జోడిస్తుంది.

లోపలి సౌకర్యాలు:


ఈ విలాసవంతమైన సెడాన్ మొత్తం నాలుగు ట్రిమ్ స్థాయిలతో అందుబాటులో ఉంది. అవి వరుసగా బేస్, ఎస్, ఎస్ ఎక్స్ మరియు ఎస్ఎక్స్ (ఎటి). దాని బేస్ వేరియంట్ ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీట్, వంపుతో కూడిన విద్యుత్ సహాయక స్టీరింగ్, మరియు టెలీస్కోపిక్ ఫంక్షన్, వెనుకవైపు ఎసి వెంట్స్, కీలెస్ ఎంట్రీ ఫంక్షన్ తో పాటు ఫోల్డబుల్ కీ, మరియు బహుళ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ వంటి లక్షణాల సమితిని కలిగి ఉంది. వీటితోపాటు, ఆటో డీఫగ్గర్, డే అండ్ నైట్ లోపల కనిపించే రేర్ వ్యూ మిర్రర్, ప్రత్యామ్నాయ నిర్వహణ వ్యవస్థ, మాన్యువల్ ట్రాన్స్మిషన్ మార్పు సూచిక వున్న ఎకో డ్రైవింగ్, భద్రత రక్షణార్ధం హెడ్‌ల్యాంప్స్, ఒక టచ్ ఆపరేషన్ తో ఉన్న పవర్ విండోస్, నిల్వ బాక్స్ తో కూడిన వెనుక సీటు మరియు టర్న్ సూచికల తో కూడిన విద్యుత్‌తో సర్దుబాటు చేయు రేర్ వ్యూ మిర్రర్స్ వంటి లక్షణాలను కలిగి ఉంది. ఈ బేస్ వేరియంట్ క్లస్టర్ అయోనైజర్ తో కూడిన ఒక ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ యూనిట్ ను కలిగి ఉంది ఇది లోపల గాలి లోని ఉష్ణోగ్రతను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. దీని యొక్క మధ్య శ్రేణి ఎస్ ట్రిమ్ పుష్ బటన్ స్టార్ట్ తో స్మార్ట్ కీ, ఈసిఎం ప్రదర్శన తో వెనుక పార్కింగ్ కెమెరా, హుక్ తో లగేజ్ నెట్స్, క్లాడింగ్ ఫంక్షన్ తో విద్యుత్‌తో కూడిన బయట అద్దాలు ఫోల్డింగ్ మొదలగు లక్షణాలతో అనుసంధానం చేయబడింది. మరోవైపు, దాని హై ఎండ్ ఎస్ఎక్స్ వేరియంట్ డ్రైవర్ సీట్ వెనుక పాకెట్స్, ఆడియో స్క్రీన్ మీద వెనుక పార్కింగ్ కెమెరా ప్రదర్శన, విండ్ స్క్రీన్ కోసం సౌర గ్లాస్, మరియు ఆటోమేటిక్ క్రూజ్ నియంత్రణ వంటి లక్షణాలతో పొందుపరిచారు.ఇవే కాకుండా, ఇది ముందు భాగంలో వెంటిలేషన్ సీట్లతో పాటు 10వే విద్యుత్‌తో సర్దుబాటు చేసుకునే డ్రైవర్ యొక్క సీటు ను కలిగి ఇది కటి మద్దతు విధిని కూడా నిర్వహిస్తుంది. ఇదే సమయంలో, దీని సీట్లు కూడా లెదర్ అపోలిస్ట్రీ తో కప్పబడి ఉంటాయి , ఇది దాని విలాసవంతమైన సూచీ ని మరింత జతచేస్తుంది.

లోపలి కొలతలు:


పైన పేర్కొన్నట్టుగానే, ఈ సెడాన్ లోపల చాలా సౌకర్యవంతంగా మరియు హాయిగా కనీసం ఐదుగురు ప్రయాణీకులు కూర్చునేలా సౌలభ్యంగా ఉంటుంది. ఇది 420 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యం గల ఒక బూట్ కంపార్ట్ మెంట్ తో పాటు భారీగా 56-లీటర్ల ఇంధన ట్యాంక్ ను కలిగి ఉంది.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


ముందు చెప్పినట్లుగా, తయారీదారుడు దాని సాంకేతిక లక్షణాలను ఎటువంటి నవీకరణలను చేయలేదు మరియు అదే పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి. దీని యొక్క పెట్రోల్ వేరియంట్లు ఒక ఆధునిక 1.8 లీటర్ ఎన్ యు పెట్రోల్ ఇంజిన్ తో జత చేయబడి ఉంటాయి. ఈ పెట్రోల్ ఇంజెన్ 4 సిలండర్లను కలిగి ఉంటాయి. మరియు డిఓహెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా 16 వాల్వ్ లను కలిగి ఉన్నాయి. అంతేకాకుండా, ఈ పెట్రోల్ ఇంజెన్ ఒక డ్యూయల్ విటివిటి టెక్నాలజీ తో అందుబాటులో ఉంది. ఈ పెట్రోల్ ఇంజెన్ 1797cc స్థానభ్రంశాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజెన్ 6500rpm వద్ద అత్య్ధికంగా 147.4bhp పవర్ ను ఉత్పత్తి చేస్తాయి. అదే విధంగా టార్క్ విషయానికి వస్తే, అత్యధికంగా 4700rpm వద్ద 177.5Nm గల టార్క్ విడుదల అవుతుంది. ఈ మోటార్ కూడా దాని ఇంధన అభివృద్ధి కోసం ఒక ఎమ్పిఎఫ్ఐ (బహుళ పాయింట్ ఫ్యూయెల్ ఇంజెక్షన్) సరఫరా వ్యవస్థ ను కూడా కలిగి ఉంటుంది. మరోవైపు, డీజిల్ వేరియంట్లు 1582cc స్థానభ్రంశాన్ని కలిగి ఉంటాయి. మరియు ఒక 1.6-లీటర్ మోటార్ బిగించి ఉంటాయి. ఈ ఇంజెన్లు 4 సిలండర్లను కలిగి డిఓహెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా 16 వాల్వ్ లను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఈ ఇంజెన్ లు దాని శక్తి ఉత్పత్తి ని మరింత పెంచడానికి ఒక కామన్ రైల్ ఇంధన ఇంజెక్షన్ వ్యవస్థను కలిగి ఉంటాయి. అంతేకాకుండా, ఒక వేరియబుల్ జియోమెట్రీ టర్బోచార్జర్ తో కలిసి ఉంటుంది. ఈ పెట్రోల్ ఇంజెన్ 4000rpm వద్ద 126.2bhp పవర్ ను ఉత్పత్తి చేయగా 1900 నుండి 2750rpm వద్ద అత్యధికంగా 259.9Nm గల టార్క్ ను విడుదల్ చేస్తుంది. ఈ రెండు ఇంజెన్ లు వాటి టార్క్ ఉత్పత్తులను 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్ ద్వారా వాహనాల ముందు చక్రాలకు పంపబడుతుంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


తయారీదారుడు, ఈ వాహనాలలో 4.3-అంగుళాల టచ్ స్క్రీన్ కలర్ డిస్ ప్లేతో పాటు సమాచార వ్యవస్థ ను కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ వ్యవస్థ ఎఫ్ఎం ట్యూనర్ రేడియో తో పాటు ఒక ఎంపి3 / సీడీ ప్లేయర్ ఆధునిక 2-దిన్ సంగీతం వ్యవస్థ ను కలిగి ఉంది. ఇది బ్లూటూత్, ఆక్స్-ఇన్ , మరియు ఆడియో స్ట్రీమింగ్ కోసం యుఎస్ బి పోర్ట్ వంటి కనెక్టివిటీ ఎంపికలు కలిగి ఉంది. ఇవే కాకుండా వీటిలో ఉన్న రెండు ట్వీటర్లు నాణ్యమైన ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. అదే సమయంలో, స్టీరింగ్ వీల్ బహుళ-ఫంక్షనల్ స్విచ్ లతో మౌంట్ చేయబడింది, ఇది డ్రైవర్ కి వాల్యూం ని అడ్జస్ట్ చేసుకోవడానికి మరియు డిస్ కనెక్ట్ అయిన కాల్స్ ని స్వీకరించడానికి ఉపయోగపడుతుంది. మరోవైపు ఈ ప్రీమియం సెడాన్ కొనుగోలుదారుల అభిరుచులకు తగినట్లుగా ఉంది ముఖ్యంగా దాని బేస్ వెర్షన్ యొక్క యాక్సెసరీస్ ఫ్లోర్ మ్యాట్స్, రెర్ బంపర్ ప్రొటెక్టర్, కార్గో లైనర్, ముందు మరియు వెనుక మట్టి ఫ్లాప్స్, రేర్ స్పాయిలర్ మరియు బాడీ గ్రాఫిక్స్ వంటి లక్షణాలను కలిగి ఉన్నాయి.

వీల్స్ పరిమాణం:


ఈ మోడల్ లోని అన్ని సిరీస్ ల రూపాంతరాలు 10-స్పోక్ డిజైన్ కలిగిన ఒక అందమైన 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ సెట్ తో అమర్చబడ్డాయి. ఈ వీల్స్ అధిక పనితీరు కలిగిన ట్యూబ్ లెస్ రేడియల్ టైర్లతో కప్పబడి ఉంటాయి. ఈ టైర్ల యొక్క పరిమాణం 205/16R16. ఇంత పరిమాణాన్ని కలిగి ఉండటం వలన ఏ రోడ్ల పరిస్థితి లోనైనా ఉన్నతమైన పట్టును అందిస్తుంది మరియు ఈ సెడాన్ యొక్క మొత్తం సామర్ధ్యం మెరుగు పరచడంలో సహాయపడుతుంది.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


ఈ హ్యుందాయ్ ఎలంట్రా మోడల్ వాతావరణ పరిస్థితితో సంబంధం లేకుండా ఉన్నతమైన బ్రేకింగ్ యంత్రాంగంతో అసాధారణమైన ప్రదర్శనను కనబరిచే లక్షణాన్ని కలిగి ఉంది. దాని అన్ని చక్రాలు పటిష్టమైన డిస్క్ బ్రేక్ ల సెట్ తో అమర్చబడి మరియు ఉన్నతమైన బ్రేక్ క్యాలిపర్స్ తో లోడ్ చేయబడి ఉన్నాయి. తయారీధారుడు, ఈ విధానంను మరింత మెరుగుపరచడానికి యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ లను అమర్చారు. దీనియొక్క ముందు ఆక్సిల్, మక్ఫెర్సొన్ స్ట్రట్ తో కూడిన కాయిల్ స్ప్రింగ్ తో బిగించబడి ఉంటుంది మరియు దీని వెనుక ఆక్సిల్ టోర్షన్ బీం సస్పెన్షన్ అమర్చబడి ఉంటుంది. ఈ సస్పెన్షన్ సిస్టమ్ ముఖ్యంగా ఎగుడుదిగుడుగా ఉన్న రోడ్లలో వాహనం యొక్క స్థిరత్వం మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.కార్ల తయారీ సంస్థ ఈ వాహన స్థిరత్వం యొక్క నిర్వహణ కలిగిన దాని ఎస్ఎక్స్ రకాలతో పాటు దాని సామర్థ్యాన్ని ఒక ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ను అందుబాటులో ఉంచారు. ఇది మనకి ఇంకా అత్యంత ప్రతిస్పందించే శక్తి సహాయక స్టీరింగ్ సిస్టమ్ ను కలిగి ఉంది, ఈ సిస్టమ్ ఖచ్చితమైన స్పందన అందిస్తూ మరియు నిర్వహణ సులభతరం చేస్తుంది.

భద్రత మరియు రక్షణ:


ఈ స్టైలిష్ సెడాన్ బేస్, ఎస్, ఎస్ ఎక్స్ మరియు ఎస్ఎక్స్ (ఎటి) వంటి అనేక ట్రిమ్ స్థాయిల్లో అందుబాటులో ఉంది. దాని బేస్ ట్రిమ్ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో కూడిన యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, రేర్ పార్కింగ్ సెన్సార్స్, సెన్సింగ్ డోర్ అన్ లాక్ మరియు క్లచ్ లాక్ లతో అనుసంధానించబడిన కీలకమైన భద్రతా లక్షణాలను కలిగి ఉంది. ఇది ఇంకా వెనుక డిస్క్ బ్రేక్ లు, ఇగ్నిషన్ కీ రిమైండర్, టైమర్ తో కూడిన రేర్ డీఫాగర్ మరియు ఎత్తు సర్దుబాటు సీటు బెల్ట్ వంటి అంశాలను కలిగి ఉంది. ఇవే కాకుండా దాని మధ్య శ్రేణి ఎస్ ట్రిమ్, పార్కింగ్ కోసం దృశ్యపరమైన సహాయాన్ని అందించే ఎలక్ట్రో-క్రోమిక్ అద్దాలను కలిగి ఉంది. మరోవైపు, దాని ఎస్ఎక్స్ ట్రిమ్ ఆటోమేటిక్ హెడ్ లైట్ నియంత్రణ, వాహనం స్థిరత్వ నిర్వహణ, వేగం గ్రహించే ఆటోమేటిక్ డోర్ లాక్స్, సైడ్ మరియు కర్టైన్ ఎయిర్ బ్యాగ్స్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటి లక్షణాలను కలిగి ఉంది.

అనుకూలాలు:


1. బయట మరియు లోపల ఒక కొత్త రీఫ్రెష్ లుక్ కనపడుతుంది.
2. ప్రొజెక్టర్ ల్యాంప్స్ అన్ని వైవిధ్యకరమైన ప్రమాణాలను కలిగి ఉన్నాయి.
3. పెట్రోల్ ఇంజిన్ యొక్క పనితీరు ఒక గొప్ప గుర్తింపుని పొందింది.
4. డ్రైవర్ సీట్, ఇప్పుడు 10-వే ఎలక్ట్రిక్ అడ్జెస్ట్ మెంట్ ఫెసిలిటీ తో అందజేయబడుతుంది.
5.టీవీ వ్యవస్థ 4.3 అంగుళాల టచ్ స్క్రీన్ తో ఒక కొత్త లుక్ ను అందిస్తుంది.

ప్రతికూలాలు:


1.బూట్ పరిమాణము మరియు గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువగా ఉంది.
2. ధర పరిధి ఇప్పటికీ ఖరీదైనగానే ఉంది.
3.ఇంధన వ్యవస్థ కూడా బలహీనంగా ఉంది.
4.సాంకేతిక వివరణలలో ఎలాంటి కొత్తదనం లేదు.
5.మరింత భద్రతకు ఇంకా కొన్ని లక్షణాలను జోడించాల్సి ఉంది.