• English
  • Login / Register

టొయోటా వారి రాబోయే కార్లు - చూడండి!

నవంబర్ 05, 2015 01:21 pm manish ద్వారా ప్రచురించబడింది

  • 21 Views
  • 1 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

టొయోటా, ప్రపంచంలో అతిపెద్ద ఆటోమొబైల్ తయారీసంస్థ మరియు అత్యుత్తమ సమర్పణలు అందించడం ద్వారా భారత ఆటోమోటివ్ రంగంలో తనకు తాను నిరూపించుకున్న సంస్థ. ఈ వాహన తయారీసంస్థ కొరెల్ల, ఇన్నోవా మరియు లగ్జరీ సెడాన్ క్యామ్రీ వంటివి అందించి అపారమైన విజయం సాధించింది. కాబట్టి, ఇక్కడ టొయోటా వారి రాబోయే అద్భుతమైన కార్ల యొక్క జాబితాను మీ ముందు ఉంచడం జరిగింది. వాటిని చూడండి!    

టొయోటా ఇన్నోవా:

జాబితాలో మరొక అత్యద్భుతమైన ఉత్పత్తి టొయోటా ఇన్నోవా. ఇటీవల వెల్లడైన నివేధిక ప్రకారం, ఈ కారు ఒక క్రొత్త 2.4 లీటర్ డీజిల్ ఇంజన్ ని కలిగియుండి 3400rpm వద్ద 149ps శక్తిని మరియు 1200 నుండి 2800rpm వద్ద 343Nm టార్క్ ని అందిస్తుంది. ఈ పవర్ ప్లాంట్స్  5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటాయి. ఈ కారు ఫిబ్రవరి 2016 లో భారత ఆటో ఎక్స్పో వద్ద ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. ఇన్నోవా బహుశా రూ. 12.5 లక్షల నుండి 18 లక్షల పరిధిలో ఉండవచ్చు.   

టొయోటా వియోస్ :

తదుపరిది టొయోటా యొక్క సి-సెగ్మెంట్ సెడాన్ ఎంట్రీ వియోస్. ఈ కారు ఢిల్లీ ఆటో ఎక్స్పో వద్ద ఫిబ్రవరి 2016 లో భారత కారు మార్కెట్ లోనికి ప్రవేశించవచ్చు. వియోస్ వాహనం సియాజ్, సిటీ మరియు వెర్నా వంటి వాటికి పోటీగా ఉండవచ్చు మరియు ఎతియోస్ నుండి 1.5 పెట్రోల్ ఇంజన్ లేదా కరోల్లా నుండి  1.4 లీటర్ డి-4డి డీజిల్ ఇంజిన్ ని కలిగి ఉండవచ్చు. ఈ కారు రూ. 7.5 నుండి ధర పరిధిలో ఉండవచ్చు.   

టొయోటా  రష్

టొయోటా  యొక్క సి-సెగ్మెంట్ ఎంట్రీ అనుసరించిన ఇంకొక ఉత్పత్తి దాని  కాంపాక్ట్ ఎస్యువి టొయోటా  రష్. ఈ కారు కరోల్లా ఆల్టిస్ మరియు ఎతియోస్ సెడాన్ లో కనిపించే అదే 1.4 లీటర్ డి4-డి డీజిల్ ఇంజన్ ని  మరియు 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్ ని భారతదేశ మార్కెట్ కొరకు కలిగి ఉంది. ఈ కారు యొక్క ఊహాజనిత ధర రూ.8-12 లక్షలు.   

టొయోటా హైస్:

జపనీస్ వాహన తయారీసంస్థ యొక్క మరొక మొదటి కొత్త విలాసవంతమైన ప్రయాణికుల వాహనం హైస్. ఈ బస్సు వరుస 4 ఆకృతీకరణ లో (డ్రైవర్ సీట్ తో సహా) 10 మంది ప్రయాణికులు కూర్చునే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అన్ని సీట్లు రిక్లైనింగ్ ఫంక్షన్ ని కలిగి ఉన్నాయి మరియు వెనుక ఏ/సి వెంట్లు, యుఎస్బి కనెక్టివిటీ తో  6 స్పీకర్ ఆడియో సిస్టమ్ వంటి లక్షణాలను కలిగి ఉంది. భద్రత పరంగా, బస్సు డ్యూయల్ ఫ్రంట్ ఎస్ఆరెస్ ఎయిర్బ్యాగ్స్, ఏబిఎస్, రియర్ పార్కింగ్ కెమెరా, రియర్ విండో డీఫాగర్ మరియు ఇల్యుమినేటెడ్ ఎంట్రీ వ్యవస్థను కలిగి ఉంటుంది. పవర్ ప్లాంట్స్ ని పరిగణలోనికి తీసుకుంటే, హైస్  ఒక 3.0-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ ని కలిగియుండి 134.1bhp శక్తిని మరియు 300Nm టార్క్ ని అందిస్తుంది. హైస్ రూ. 40 లక్షల నుండి రూ.45 లక్షల పరిధిలో ఉండవచ్చు మరియు బహుశా  జనవరి 2016 లో విడుదల కావచ్చు.  

టొయోటా ఫార్చ్యూనర్ :

చివిరిగా, టొయోటొ యొక్క తదుపరి వాహనంగా టయోటా ఫార్చ్యూనర్ ప్రీమియం ఎస్యూవి రాబోతున్నది. ఈ కారు నాలుగు సిలిండర్ డైరక్ట్ ఇంజెక్టెడ్ టర్బో-డీజిల్ ఇంజిన్ ని కలిగియుండి  174.3bhp శక్తిని మరియు 450Nm టార్క్ ని గరిష్టంగా  అందిస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ యొక్క ఎంపికతో ఒక 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ కారు 2016 చివరి నాటికి ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు మరియు ధర రూ. 24 నుండి 29 లక్షల పరిధిలో ఉండవచ్చు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience