టియువి300 : మహీంద్రా యొక్క కాంపాక్ట్ కారు విభాగంలో తదుపరి షాట్!

ఆగష్టు 19, 2015 11:08 am అభిజీత్ ద్వారా ప్రచురించబడింది

జైపూర్:

మేము ఇటీవల చూసిన కాంపాక్ట్ సెగ్మెంట్ కార్లలో, ఆటో పరిశ్రమలో కొత్తగా ప్రారంభించబడిన ఫోర్డ్ ఫిగో ఆస్పైర్, మారుతి ఎస్ - క్రాస్ లేదా హ్యుందాయ్ క్రెటా ప్రతి ఒక్కటి ఈ రంగంలో సంక్షోభాన్ని సృష్టించాయి. కాంపాక్ట్ ఎస్యూవి విభాగంలో మరియు కాంపాక్ట్ సెడాన్ విభాగంలో స్వల్ప వ్యవధిలోనే కొత్త కొత్త వాహనాలను పరిచయం చేస్తున్నారు మరియు ఈ కొత్త వాహానాలన్నీ కూడా ఖచ్చితంగా వాటి సంబంధిత వర్గం లో గట్టి పోటీని ఇస్తూ గొప్ప స్థానంలో ఉన్నాయి. మహీంద్రా కాంపాక్ట్ కారు సెగ్మెంట్లో అడుగుపెట్టేందుకు చాలా కాలం నుండి ప్రయత్నిస్తూ ఉంది. కంపెనీ, తమ యొక్క తాజా కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో లక్ష్యంగా టియువి300 (300 మూడు డబుల్ 'ఓ' గా పలుకుతారు) ని తయారు చేశారు. ఈ కారు చాలా ఆశాజనకంగా కనిపిస్తుంది. కనుక ఇది మహీంద్రాను కాంపాక్ట్ కార్ల విభాగంలో ఎంతగా పేరు పొందడానికి సహాయంగా ఉంటుందో మనము చూద్దాము.

టియువి 300 ముందు, కాంపాక్ట్ కార్ల విభాగంలో మహీంద్రా గతం లో ఒక కారు ని విడుదల చేసింది. అది మహింద్ర యొక్క మొదటి కారు, దీనిని రెనాల్ట్ సహకారంతో లోగాన్ అను పేరు తో విడుదల చేశారు, కానీ అది దీర్ఘ కాలం నిలువలేదు. పర్యవసానంగా, రెండు సంస్థల మధ్య జాయింట్ వెంచర్ ముగిసింది . ఆ తర్వాత వెంటనే, వెరిటో ను ప్రవేశపెట్టారు. లోగాన్ ను రీబ్యాడ్జ్ చేసి ప్రవేశపెట్టారు. ఈ సమయంలో, వెరిటో వాహనాలు అమ్మకాలు జరిపినప్పటికీ లోగాన్ వాహనం వలే విజయాన్ని చేరుకోలేకపోయింది. ఇప్పటికీ ఈ వాహనం విక్రయించబడుతుంది. కానీ, ఈ వాహనాల సంఖ్య చాలా తక్కువ. అలాగే, వెరిటో వైబ్ హాచ్బాక్ కూడా అనుకున్న దాని వలే పని చేయటంలేదు.

తదుపరి మహీంద్రా క్వాంటో, ఇది కాంపాక్ట్ ఎస్యూవి విభాగంలో ఊహించినన్ని ఫలితాలు అందించలేకపోయింది. ఎందుకనగా దీని లుక్ అంత ఆకర్షణీయంగా లేదు. ఇది జైలోను 4మీటర్లు కత్తిరించి చూస్తే ఎలా ఉంటుందో ,ఈ క్వాంటో రూపం అలా ఉంటుంది. కానీ ఒక పెద్ద కారు కోసం చూస్తున్న వారికి ఇది ఒక మంచి వాహనంగా అందించబడుతుంది మరియు దాని ప్రత్యర్థులతో పోలిస్తే దీని ధర కూడా సరసమైనదిగా ఉంటుంది. కాలక్రమేణా, అది ఈ సెగ్మెంట్లో చిన్న కారల దగ్గర కూడా నెగ్గ లేకపోయింది. ఎందుకంటే, అదే సమయంలో మహీంద్రా ఎకోస్పోర్ట్, డస్టర్, క్రెటా మరియు ఎస్- క్రాస్ వంటివి పోటీగా వచ్చాయి.

మహింద్రా విషయానికి వస్తే, ఎస్యువి కార్ల తయారీదారిగా మంచి గుర్తింపును పొందుతుంది. అలానే ఇది టియువి 300 తో రావడం ఒక ఉత్తమమైన విషయం.

టియువి300 ఏమిటి కాదు !

ఇది ఒక కట్ చేసి పేస్ట్ చెసే పని కాదు: మహీంద్రా డిజైన్ లేదా పరీక్ష లేదా ఇంజన్ ను మొదటి నుండి చేసింది. ఈ వాహనంను ఇటాలియన్ డిజైన్ సంస్థ పినిన్ఫారినా నుండి తీసుకువచ్చిన ఇన్పుట్లతో మహీంద్రా వారిచే సొంతంగా రూపొందించారు.

టియువి300 ఏమిటి?

ఇది సి-సెగ్మెంట్ సెడాన్ కారు తో పోలిస్తే, ఇది ఒక చిన్న కారులా ఉంటుంది. చూడడానికి మాత్రం ఇది ఎస్యువి లా కనిపిస్తుంది.

టియువి300 యొక్క రూపకల్పన ఒక యుద్ధ ట్యాంక్ నుండి ప్రేరణగా తీసుకుని రూపొందించినట్లు తెలుస్తుంది. ఇది ఒక నిలువు గీతల లక్షణాలతో మరియు బాక్సీ ఆకారంతో కూడి వెనుక వైపు ఒక అదనపు వీల్ తో జత చేయబడి ఉంది.

ఈ వాహనం లోపలి వైపు ఆకర్షణీయమైన డాష్ మరియు పానెలింగ్, వినోద వ్యవస్థ మరియు మెరుగైన నాణ్యత పదార్ధాలు వంటి స్వదేశీ తయారీసంస్థ యొక్క ఆధునిక లక్షణాలు కనిపిస్తాయి.

హుడ్ కింద, ఇది ఒక ఎం హాక్ 80 మోటార్ మరియు ఇది 1.5 లీటర్ డీజిల్ తో 80బిహెచ్ పి శక్తిని అందిస్తుంది.

టియువి 300 వాహనం 4 మీటర్ల కంటే తక్కువ ఉంటుంది. ఇది ఆకర్షణీయమైన ధరతో దాని పోటీ దారులకు గట్టి పోటీ ఇవ్వవచ్చు. అదే కాని జరిగినట్లైతే, ఇది నిజంగా దాని పోటీ దారులకు ఒక దుర్వార్త కావచ్చు. ఎందుకంటే, మహీంద్రాకి భారతదేశంలో పూర్తి బలమైన డీలర్ నెట్వర్క్ ఉంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience