టయోటా-మారుతి స్క్రాపేజ్ ప్లాంట్ ని 2021 కంటే ముందే నిర్మించి పనులు ప్రారంభించనున్నారు
నవంబర్ 11, 2019 03:46 pm dhruv attri ద్వారా ప్రచురించబ డింది
- 30 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ వాహనాల యొక్క ఉపసంహరణ మరియు రీసైక్లింగ్ యూనిట్ ప్రధాన కార్యాలయం ఉత్తర ప్రదేశ్ లోని నోయిడాలో ఉంటుంది
- మారుతి మరియు టయోటా యొక్క స్క్రాప్ ప్లాంట్లలో మొదటిది 2020 చివరి నాటికి కార్యకలాపాలు ప్రారంభించనున్నది.
- మారుతి, ఇతర డీలర్లతో పాటు వ్యక్తుల నుండి కార్లు సేకరించబడతాయి.
- పూర్తిగా కూల్చివేయవడిన కొన్ని పార్ట్స్ ని భవిష్యత్తులో అవసరం అయితే ఉపయోగించుకొనేలా చేయడం జరుగుతుంది.
- యజమానులు వారి సమీప RTO వద్ద డీ-రిజిస్ట్రేషన్ కోసం ఉపయోగించగల డిస్ట్రక్షన్ సర్టిఫికెట్ ని పొందగలరు.
భారతదేశంలో మారుతి సుజుకి మరియు టయోటా భాగస్వామ్యం కేవలం కొత్త కార్ల అభివృద్ధికి మాత్రమే పరిమితం చేయబడకుండా, కార్లను రీ-సైక్లింగ్ చేయడానికి ఒక క్రమ పద్దతిలో ఉండేలా చూసుకోవడానికి కూడా సన్నాహాలు చేస్తుంది. పాత కార్ల కోసం ప్రభుత్వం ఇంకా సరైన స్క్రాపేజ్ విధానాన్ని రూపొందించకపోగా, ఇద్దరు తయారీదారులు 50:50 జాయింట్ వెంచర్‌లో తమ సొంత స్క్రాపేజ్ ప్లాంట్ తో రానున్నారు. 2020 చివరిలో కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.
ఈ జాయింట్ వెంచర్ టయోటా గ్రూప్ యొక్క అనుబంధ సంస్థ, టొయోత్సు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL) మధ్య ఉంది. ఈ JV ఫలితంగా వచ్చే సంస్థను మారుతి సుజుకి టొయోత్సు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (MSTI) అని పిలుస్తారు మరియు ఇది ప్రభుత్వ రహదారులపై నడపడానికి ఉపయోగపడని కార్లను సేకరించడం మరియు కూల్చివేసే బాధ్యతని కలిగి ఉంటుంది.
భారతీయ చట్టాలు మరియు ప్రపంచ పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా ఘన (లోహం, బ్యాటరీలు) అలాగే ద్రవ వ్యర్థాలను (నూనెలు, కూలెంట్స్) పారవేయడానికి తగిన విధానాన్ని అనుసరిస్తారు. స్క్రాప్ విక్రయించబడుతుంది, ట్రీట్ చేయబడిన మెటల్ అనేది కొత్త వాహనాల ఉత్పత్తిలో ఉపయోగపడుతుంది. భారతదేశమంతటా వీటిలో మరిన్నింటిని ప్రవేశపెట్టాలని JV అనుకుంటున్నది, దీనిలో నోయిడా ఫెసిలిటీ మొదటిది.
ఈ సేవను ఎంచుకున్న వినియోగదారులకు ప్రాంతీయ రవాణా కార్యాలయంలో డీ- రిజిస్ట్రేషన్ కోసం ఉపయోగించబడే డిస్ట్రక్షన్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది.
ఇంతకుముందు, మహీంద్రా పాత కార్ల యజమానులకు సరసమైన ధరను పొందాలనే ఉద్దేశ్యంతో పాత కార్ స్క్రాపేజ్ ప్లాంట్‌ను కూడా తీసుకువచ్చింది. 15 సంవత్సరాల కంటే పాత కార్ల భవిష్యత్తును వివరించే పథకాలతో మరియు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పునరుద్ధరణ మరియు దిగుమతి చేసుకున్న వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజుతో సహా స్క్రాపేజ్ పాలసీ పై ప్రభుత్వం త్వరలో చట్టాలను ఆమోదించాలని భావిస్తున్నారు.
0 out of 0 found this helpful