• English
  • Login / Register

వాడిన కార్ల వేలం వ్యాపారాన్ని భారతదేశంలో ప్రారంభించనున్న టయోటా

ఆగష్టు 11, 2015 11:26 am manish ద్వారా ప్రచురించబడింది

  • 24 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

ప్రపంచవ్యాప్తంగా వాడిన కార్లను వేలం వేస్తున్న టయోటా మోటార్ కార్పొరేషన్ ఇప్పుడు భారతదేశంలో కూడా అదే పద్ధతిని ఆచరిస్తోంది. ఇక్కడ తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి టయోటా ఇక్కడ కూడా వేలం పద్ధతిని ఆచరణలతో అమలు చేస్తోంది. ఎందుకంటే, టయోటా భారతదేశంలో గత రెండు దశాబ్దాల నుండి తమ లక్ష్యాలను అధిగమించేలా వ్యాపారాన్ని కొనసాగించలేక పోయింది.

దీని గురించి కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ "టయోటా యొక్క లక్ష్యం ఏమిటనగా, భారతదేశంలోని వినియోగదారులకు వాడిన కారు పరిశ్రమ మరింత నమ్మకమైనదిగా మరియు పారదర్శకమైనదిగా అందించడం. ఈ ఉద్దేశ్యంతోనే మేము బెంగళూరు లో సెప్టెంబర్ 2015 లో టయోటా వేలం మార్ట్ ను ప్రారంభిస్తున్నాము. దీనిలో అన్ని బ్రాండ్ల నుండి వాడిన ప్రతి కారును టయోటా ద్వారా శిక్షణ పొందిన నిపుణులు పరీక్షిస్తారు మరియు వేలానికి ముందు ధృవీకరించి వినియోగదారులకు అందిస్తారు" అని ఆయన అన్నారు.
 
వాడిన కార్లను విక్రయించే విషయంలో టయోటా, జపాన్ లో టయోటా ఆటో వేలం, చుబు ఆటో వేలం మరియు తైవాన్ హొతాయి ఆటో వేలం వంటి దాని సంస్థలను ఉపయోగిస్తుంది. సెకండ్ హ్యాండ్ మార్కెట్ ఇప్పుడు తయారీదారులకు ఒక తాజా ఆదాయ వనరుగా మారింది అందువలన గత రెండు సంవత్సరాల నుండి కొత్త కార్ల యొక్క అమ్మకాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. వినియోగదారులకు వారి యొక్క వాడిన కార్ల వేలం పై అంతిమ అధికారం ఉంటుంది మరియు ఈ విధానం వారిలో ఒక విశ్వాసాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది.

ఇతర ప్రధాన ఆటోమొబైల్ కంపెనీలైన మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటార్, వోక్స్ వ్యాగన్, హోండా మరియు లగ్జరీ కార్ల తయారీ కంపెనీలయినటువంటి ఆడి, బిఎండబ్ల్యూ మరియు మెర్సిడెస్-బెంజ్ వంటి సంస్థల తరహాలోనే టయోటా కూడా టయోటా యు-ట్రస్ట్ నిర్వహణ క్రింద వ్యాపారాన్ని ప్రారంభించింది.

సమర్థవంతమైన కార్యకలాపాలను ప్రోత్సహించడానికి టయోటా కిర్లోస్కర్ మోటార్స్ బిడాది లో కూడా ఒక ప్రత్యేక వేలం సౌకర్యం ఏర్పాటు చేశారని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. బిడాది పట్టణం బెంగళూరు-మైసూర్ ఎక్స్ ప్రెస్ మార్గంలో ఉంది.

టయోటా, యు-ట్రస్ట్ ను 2007 లో ప్రారంభించింది మరియు ఇది 19 రాష్ట్రాలలో 56 మార్కెట్లలో అమలులో ఉంది. సంస్థ దాని అమ్మకాల నిశ్చలత్వాన్ని అలాగే కొనసాగించాలనుకుంటుంది. కంపెనీ ఇంజనీర్లు, వేలం కోసం కార్ల విలువ మరియు ధరను అంచనా వేసి 203 పారామితుల ఆధారంగా అన్ని కార్లు రేటింగ్ ను నిర్ణయించవలసి ఉంటుంది. ఈ పాత కార్ల కొనుగోలు విధానం, ప్రస్తుత విధానానికి భిన్నంగా ఉంటుంది మరియు ఒక వృత్తి నిపుణత లేని సంస్థల యొక్క కార్ల వ్యాపారాన్ని ఇది అధిగమిస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
 
2001 లో 'ట్రూ వ్యాల్యూ' అను బ్రాండ్ పేరుతో మారుతి దీని వాడిన కార్ల యొక్క వ్యాపారాన్ని ప్రారంభించింది. ఇప్పుడు ఇది భారతదేశంలో విక్రయించే 1.1 మిలియన్ కొత్త కార్ల యొక్క వార్షిక ఉత్పత్తులలో, వాడిన కార్ల ఉత్పత్తి నాలుగో భాగంగా ఉంటుంది. భారతదేశంలో వాడిన కార్ల యొక్క మార్కెట్, ఆశాజనకమైన విస్తరణను మరియు రాబడిని అందించే అవకాశాలు ఉన్నాయి.

పరిశ్రమల యొక్క నిపుణుల ప్రకారం, వాడిన కార్ల వ్యాపారం ప్రతీ సంవత్సరం భారతదేశం లో అమ్మిన 2.5 మిలియన్ కొత్త కార్లు కంటే 1.3 రెట్లు ఎక్కువగా మరియు వృద్ధి రేటు వేగవంతంగా ఉంది. మహీంద్రా సంస్థ ప్రకారం, ఇది భారత మార్కెట్లో వాడిన కార్ల విక్రయంలో అతిపెద్ద మల్టీబ్రాండ్ గా చెప్పవచ్చు. ఈ సంస్థవి దేశంలో 3 మిలియన్ వాడిన కార్ల అమ్మకాలు జరిగాయి. టయోటా మరింత తీవ్రంగా వాడిన కారు మార్కెట్ లోకి ప్రవేశించడం ద్వారా దేశీయ అమ్మకాలు విస్తరిపజేసేందుకు ప్రణాళికలు చేస్తుంది. ఇది 2015 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ లో 141.347 వాహనాల అమ్మకాలు జరిపి 5% వాటా పొందింది. సంస్థ 34,300 వాహనాలను ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో విక్రయించి, మునుపటి సంవత్సరం కన్నా 9% వృద్ధి రేటును పొందింది.ఈ వేలంపాట బహుశా వాడిన కారు మార్కెట్ కి మరింత నమ్మకమైన మరియు పారదర్శకమైనదిగా ఉంటుందని తెలుస్తుంది.

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience