2026 నాటికి భారతదేశంలో మూడవ ఉత్పత్తి కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్న Toyota

నవంబర్ 22, 2023 04:04 pm sonny ద్వారా ప్రచురించబడింది

  • 86 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

కొత్త కర్మాగారాన్ని సుమారు రూ.3,300 కోట్ల అంచనా పెట్టుబడితో కర్ణాటకలో నిర్మించనున్నారు

Toyota Hycross front

భారతదేశంలో అత్యధికంగా ప్రజాధరణ పొందిన జపనీస్ కార్‌ల తయారీదారు సంస్థ, టయోటా, తాజా పెట్టుబడులతో తన కార్యకలాపాలను విస్తరించడానికి ఇటీవల కర్ణాటక ప్రభుత్వంతో ఒక అవగాహనా ఒప్పందంపై సంతకం చేసింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ సరికొత్త తయారీ కర్మాగారాన్ని సుమారు రూ.3,300 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేయడానికి సిద్ధం అవుతోంది.

ఇది భారతదేశంలో టయోటా మూడవ ప్లాంట్, ఇది ప్రస్తుతం ఉన్న రెండు ప్లాంట్ؚలకు దగ్గరగా బెంగళూరు శివార్లలో బీదడిలో ఏర్పాటు చేయనున్నారు. తద్వారా ఈ కారు తయారీదారు ఉత్పత్తి సామర్ధ్యo సంవత్సరానికి 1 లక్ష యూనిట్ల వరకు పెరగనుంది మరియు ఇది 2026 నాటికి పూర్తి కానుంది. ఈ కొత్త ప్లాంట్ؚలో తయారయ్యే మోడల్‌ల గురించి ఇంకా నిర్ధారించలేదు కానీ, టయోటా ఇన్నోవా హైక్రాస్ వీటిలో ఒకటి అని తెలుస్తుంది. మిగిలిన కార్‌ల తయారీ దారుల విధంగా భారతదేశంలో EVల గురించి టయోటా ఉత్సాహం చూపించకపోయినా, ఈ మోడల్‌లను తప్పనిసరిగా పరిచయం చేయాలి కాబట్టి కొత్త ప్లాంట్ؚ వీటిని ఉత్పత్తి చేసే సామర్ధ్యం తప్పక ఉంటుందని అంచనా.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, టయోటా కిర్లోస్కర్ మోటార్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్  ఆఫీసర్ మసజాకు యోషిముర, ఇలా అన్నారు, “కంపెనీ తరఫు నుండి “మేక్-ఇన్-ఇండియా”కు మరింత సహకారం అందించేందుకు TKM ఉత్పత్తి సామర్ధ్యాన్ని 1,00,000 యూనిట్లకు పెంచడానికి, సుమారు 2,000 కొత్త ఉద్యోగాలను జోడించడానికి కొత్త పెట్టుబడులను పెడుతున్నామని ప్రకటించడానికి సంతోషిస్తున్నాము. ఈ కొత్త అడుగు సప్లయర్ ఎకోసిస్టమ్ؚలో మరింత అభివృద్ధి సామర్ధ్యాన్ని తీసుకువస్తుంది. TKM భారతదేశంలో 25 సంవత్సరాలను పూర్తి చేసుకుంది, ఈ ప్రయాణం, మా టయోటా టీమ్ మరియు అనేక మంది వాటాదారుల ఉత్సాహం, కృషి మరియు అంకితభావాలకు రుజువు. ఎవరూ వెనకబడిపోకుండా, ప్రతి ఒక్కరి కోసం స్థిరమైన భవిష్యత్తును నిర్మించడానికి తమ విలువైన సహకారాన్ని అందించిన ప్రతి ఒక్కరికి నేను అభినందిస్తున్నాను మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.”

టయోటా, భారతదేశంలో అర్బన్ క్రూయిజర్ హైరైడర్ SUV, హైక్రాస్ MPV, క్యామ్రీ ప్రీమియం సెడాన్ మరియు వెల్ؚఫైర్ లగ్జరీ MPV వంటి బలమైన హైబ్రిడ్ పవర్ؚట్రెయిన్ؚలను అందిస్తూ, తమకు అంటూ బలమైన మార్కెట్‌ను సొంతం చేసుకుంది. ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్ వంటి ఐకానిక్ మోడల్‌లు బలమైన ఫాలోయింగ్ؚను కలిగి ఉన్నాయి. అదనంగా, మారుతి సుజుకిؚతో షేర్ చేసుకోబడిన గ్లాంజా హ్యాచ్ؚబ్యాక్, రుమియాన్ MPV వంటి మోడల్‌లు, రాబోయే ؚ మారుతి ఫ్రాంక్స్ ఆధారిత క్రాస్ఓవర్ వంటివి దీని మార్కెట్ షేర్ పెరగడానికి వీలు కల్పిస్తున్నాయి. ఉత్పత్తి సామర్ధ్యాన్ని అదనంగా పెంచడం వలన, భవిష్యత్తులో టయోటా అధిక వెయిటింగ్ పీరియడ్ؚలను అధిగమించడానికి వీలు కలుగుతుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience