Rumion MPVని రూ. 10.29 లక్షలతో విడుదలచేసిన Toyota
రూమియన్ అనేది తక్కువ స్టైలింగ్ మార్పులతో కూడిన కొంచెం ఎక్కువ ధర కలిగిన మారుతి ఎర్టిగా యొక్క రీబ్యాడ్జ్ వెర్షన్.
-
రూమియన్ ధరలు రూ. 10.29 లక్షల నుండి రూ. 13.68 లక్షల వరకు ఉంటాయి (ఎక్స్-షోరూమ్).
-
S, G, మరియు V వేరియంట్‌లలో లభిస్తుంది; CNG అలాగే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్లు, దిగువ శ్రేణి వేరియంట్‌లలో అందుబాటులో ఉన్నాయి.
-
ఆటోమేటిక్ AC, క్రూజ్ కంట్రోల్, 7-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు మరియు వెనుక పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.
-
మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో కూడిన 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ అందించబడుతుంది.
టయోటా రూమియన్ భారతదేశంలో ప్రారంభించబడింది. ఇది మారుతి ఎర్టిగా యొక్క రీబ్యాడ్జ్డ్ వెర్షన్, చిన్న డిజైన్ మార్పులతో విభిన్నంగా ఉంటుంది. ఇది ఆటోమోటివ్ తయారీదారుల మధ్య దేశంలో ఐదవ క్రాస్-బ్యాడ్జ్ ఉత్పత్తి. టయోటా రూమియన్ బుకింగ్‌లు ఇప్పుడు మొదలయ్యాయి మరియు డెలివరీలు సెప్టెంబర్ 8 నుండి ప్రారంభమవుతాయి.
వేరియంట్ వారీ ధరలు
వేరియంట్ |
మాన్యువల్ |
ఆటోమేటిక్ |
---|---|---|
S |
రూ.10.29 లక్షలు |
రూ.11.89 లక్షలు |
S CNG |
రూ 11.24 లక్షలు |
- |
G |
రూ 11.45 లక్షలు |
- |
V |
రూ 12.18 లక్షలు |
రూ 13.68 లక్షలు |
CNG ఎంపిక దిగువ శ్రేణి వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మధ్య శ్రేణి G వేరియంట్‌లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ సౌలభ్యం అందించబడలేదు.
ఎర్టిగా మరింత సరసమైన ఎంట్రీ ధరను కలిగి ఉండగా, దాని VXI- రూమియన్ S వేరియంట్‌తో సమానంగా ఉంది.
ఎర్టిగాపై మార్పులు
రూమియన్ మరియు ఎర్టిగా స్టైలింగ్‌ల మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలు కొత్త ఫ్రంట్ ప్రొఫైల్ మరియు విభిన్న అల్లాయ్ వీల్స్. ఫాబ్రిక్ సీట్ల కోసం కొత్త డ్యూయల్-టోన్ షేడ్ మరియు డ్యాష్‌బోర్డ్ కోసం వేరే టోన్ షేడ్‌తో ఇంటీరియర్ కొద్దిగా మార్పు చేయబడింది.
ఫీచర్లు
టయోటా రూమియన్ దాని ఫీచర్ల జాబితాను మారుతి ఎర్టిగాతో పంచుకుంటుంది. ఇందులో ప్రొజక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఆటోమేటిక్ AC, ఇంజిన్ పుష్ స్టార్ట్-స్టాప్ బటన్, క్రూజ్ కంట్రోల్ మరియు ఆండ్రాయిడ్ ఆటో అలాగే ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి.
నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు, ESP తో హిల్ హోల్డ్ అసిస్ట్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్లు మరియు వెనుక పార్కింగ్ కెమెరా వంటి భద్రతా అంశాలు అందించబడ్డాయి.
పవర్‌ట్రెయిన్ వివరాలు
రూమియన్, ఎర్టిగా యొక్క 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది, ఇది 103PS మరియు 137Nm పవర్, టార్క్ లను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. ఈ ఇంజన్, 5-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్లు ట్రాన్స్‌మిషన్ తో విధులను నిర్వహిస్తాయి. 26.11 km/kg వరకు క్లెయిమ్ చేయబడిన సామర్థ్యంతో కూడిన మాన్యువల్ షిఫ్టర్‌తో CNG ఎంపిక కూడా ఉంది.
ప్రత్యర్థులు
టయోటా రూమియన్‌కు ఏకైక నిజమైన ప్రత్యర్థి మారుతి ఎర్టిగా. అయితే, మారుతి MPV వలె, ఇది కియా క్యారెన్స్, రెనాల్ట్ ట్రైబర్ మరియు మహీంద్రా మరాజ్జోలకు ప్రత్యామ్నాయంగా కొనసాగుతుంది.
మరింత చదవండి: టయోటా రూమియన్ ఆన్ రోడ్ ధర