• English
  • Login / Register

పెరుగుతున్న వెయిటింగ్ పీరియడ్ؚ కారణంగా, రూమియన్ CNG బుకింగ్ؚలను తాత్కాలికంగా నిలిపివేసిన Toyota

టయోటా రూమియన్ కోసం rohit ద్వారా సెప్టెంబర్ 26, 2023 01:14 pm ప్రచురించబడింది

  • 37 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

“అత్యధిక డిమాండ్” ఉన్న ఈ SUV వెయిటింగ్ సమయాన్ని తగ్గించడానికి రూమియన్ CNG బుకింగ్ؚలను నిలిపివేసినట్లు టయోటా వెల్లడించింది.

Toyota Rumion

  • టయోటా, మారుతి ఎర్టిగా-ఆధారిత రూమియన్ؚను భారతదేశంలో ఆగస్ట్ 2023లో ప్రవేశపెట్టింది.

  • ఈ MPV మూడు విస్తృత వేరియెంట్ؚలలో అందించబడుతుంది: S, G మరియు V.

  • టయోటా రూమియన్ؚ 88PS పవర్ 1.5-లీటర్ పెట్రోల్-CNG పవర్‌ట్రెయిన్ؚతో వస్తుంది.

  • దీని ఫీచర్‌లలో మాన్యువల్ AC, కీలెస్ ఎంట్రీ మరియు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ؚలు ఉన్నాయి.

  • పెట్రోల్ వేరియెంట్‌ల బుకింగ్ؚలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

మారుతి ఎర్టిగా-ఆధారిత టయోటా రూమియన్ భారతదేశంలో ఆగస్ట్ 2023లో విడుదల అయింది, ఇది మూడు విస్తృత వేరియెంట్ؚలలో విక్రయించబడుతుంది: S, G మరియు V. క్రాస్-బ్యాడ్జ్ ఉత్పత్తి అయినందున, ఈ MPV, CNG కిట్ ఎంపికతో సహా అవే పవర్ؚట్రెయిన్ ఎంపికలను పొందింది. అయితే, దీనికి ఉన్న అధిక డిమాండ్ కారణంగా వెయిటింగ్ పీరియడ్ మరింతగా పెరిగింది, అందువలన టయోటా రూమియన్ CNG వేరియెంట్ బుకింగ్ؚలను అంగీకరించడం తాత్కాలికంగా నిలిపివేసింది. పెట్రోల్ వేరియెంట్ؚల కోసం బుకింగ్ؚలు కొనసాగుతున్నాయి.

ఈ విషయంపై టయోటా చేసిన ప్రకటన 

“సరికొత్త టయోటా రూమియన్ؚను మేము ఈ సంవత్సరం ఆగస్ట్ؚలో విడుదల చేశాము మరియు B-MPV విభాగంలో టయోటా వాహనం కోసం ఎదురుచూస్తున్న మా వినియోగదారుల నుండి ఆశించిన ప్రతిస్పందనను అందుకున్నాము. సరికొత్త టయోటా రూమియన్ కోసం అధిక సంఖ్యలో వస్తున్న ఎంక్వైరీలు మరియు బుకింగ్ؚలను చూసి మేము చాలా ఆనందిస్తున్నాము. దీని డిమాండ్ మా అంచనాలను మించి పోయింది, ఫలితంగా అన్నీ వేరియెంట్ؚలకు, ప్రత్యేకించి CNG ఎంపికకు, సుదీర్ఘమైన డెలివరీ సమయం పడుతోంది. సుదీర్ఘ వెయిటింగ్ పీరియడ్ కారణంగా వినియోగదారులకు కలుగుతున్న అసౌకర్యాన్ని నివారించడానికి మాత్రమే మేము CNG ఎంపిక కోసం బుకింగ్ؚలను తాత్కాలికంగా నిలిపివేయవలసి వచ్చింది. అయితే, టయోటా రూమియన్ పెట్రోల్ వేరియెంట్ؚల బుకింగ్ؚలను మాత్రం అంగీకరిస్తున్నాము.”

రూమియన్ CNG సంక్షిప్త వివరణ

Toyota Rumion

టయోటా, రూమియన్ CNGని కేవలం బేస్-స్పెక్ S వేరియెంట్ؚలో మాత్రమే అందిస్తోంది, అయితే దీని డోనర్ వాహనం రెండు వేరియెంట్ؚలలో లభిస్తుంది. రూమియాన్ S CNGలో హాలోజెన్ ప్రొజెక్టర్ హెడ్ؚలైట్‌లు మరియు LED టెయిల్‌లైట్‌లు, పూర్తి వీల్ కవర్‌లు, మాన్యువల్ AC, 4-స్పీకర్‌ల మ్యూజిక్ సిస్టమ్ మరియు కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్‌లు ఉన్నాయి.

ప్రయాణీకుల భద్రత కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ؚలు, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్ؚలు (రెండవ వరసకు మాత్రమే), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం (ESP) మరియు హిల్-హోల్డ్ అసిస్ట్ ఉన్నాయి. ఈ CNG MPV ధర రూ.11.24 లక్షలు మరియు దీని డోనర్ మోడల్ అయిన మారుతి ఎర్టిగా CNG మినహా దీనికి ప్రత్యక్ష పోటీదారు ఎవరు లేరు.                         

ఇది కూడా చదవండి: టయోటా కామ్రీ Vs ఫార్చ్యూనర్ లెజెండర్: తేడాలు మరియు ప్రత్యేక ఫీచర్ ల వివరణ 

పవర్ؚట్రెయిన్ సారాంశం

టయోటా రూమియన్ S CNG సాధారణ వేరియెంట్ؚలలో ఉండే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚతో వస్తుంది, అయితే ఇందులో ఈ యూనిట్ హరిత ఇంధనంతో 88PS పవర్ మరియు 121.5Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. 5-స్పీడ్ MTతో జోడించబడుతుంది మరియు 26.11కిమీ/కిగ్రా ఇంధన సామర్ధ్యాన్ని క్లెయిమ్ చేస్తుంది. 

సాధారణ పెట్రోల్ వేరియెంట్‌లలో, ఇది 103PS పవర్ మరియు 137Nm టార్క్‌ను విడుదల చేస్తుంది, మరియు 6-స్పీడ్ ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ ఎంపికను పొందుతుంది.

గతంలో కూడా జరిగిన ఇలాంటి సంఘటన 

తమ MPVలలో ఒకదాని బుకింగ్ؚలను టయోటా నిలిపివేయడం ఇది మొదటిసారి కాదు. ఆగస్ట్ 2022లో కూడా, టయోటా డీజిల్-ఆధారిత ఇన్నోవా క్రిస్టా ఆర్డర్‌లను అంగీకరించడం నిలిపివేసింది, 2023 మొదట్లో MPV నవీకరించిన వర్షన్ؚను విడుదల చేసిన తరువాత తిరిగి ప్రారంభించింది. 

ఇది కూడా చదవండి: ఇంకా ఉనికిలో ఉన్న”టయోటా ఫ్రాంక్స్”, 2024లో రావచ్చు! 

ఇక్కడ మరింత చదవండి: రూమియన్ ఆన్ؚరోడ్ ధర

was this article helpful ?

Write your Comment on Toyota రూమియన్

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience