టయోటా భారతదేశంలో ల్యాండ్ క్రూయిజర్ ని నిలిపివేయడానికి సన్నాహాలు చేస్తుంది
ఫిబ్రవరి 05, 2020 12:32 pm dhruv ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మీరు పిగ్గీ బ్యాంక్ ల్యాండ్ క్రూయిజర్ LC200 కోసం డబ్బులు ఏమైనా దాచుకున్నారా? అయితే ఇప్పుడు వాటితో ముంబైలోని 1BHK ని కొనుక్కోండి
- రాబోయే BS6 ఉద్గార నిబంధనల కారణంగా ల్యాండ్ క్రూయిజర్ యొక్క రెండు మోడల్స్ తొలగించబడ్డాయి.
- రెండింటినీ CBU దిగుమతులుగా దేశంలోకి తీసుకువచ్చారు.
- ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో 3.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను ఉపయోగిస్తూ, ఇది 173PS / 410Nm ఉత్పత్తి చేసేది.
- ల్యాండ్ క్రూయిజర్ LC200 4.5-లీటర్ V8 ను ఉపయోగిస్తూ, ఇది 265PS మరియు 650Nm ను ఉత్పత్తి చేసేది.
- కొత్త తరం ల్యాండ్ క్రూయిజర్ కోసం పని జరుగుతుంది.
భారతదేశంలో బలమైన స్థావరం ఉన్నప్పటికీ, టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో లేదా ల్యాండ్ క్రూయిజర్ LC200 పెద్దగా అమ్మకాలకు గురి కాలేదు. ఎందుకంటే ఈ రెండు SUV లు డిజిటల్ యుగంలో అనలాగ్ యోధులు. టెక్ పరంగా వారు అదేవిధంగా ధర గల కార్లతో పోటీని తట్టుకోలేకపోయాయి మరియు వాటిని BS6-కంప్లైంట్ చేయడానికి సమయం వచ్చినప్పుడు, టయోటా వాటిని భారతదేశంలో నిలిపివేయాలని నిర్ణయించుకుంది.
ఈ రెండు SUV లు చౌకగా లేవు. అవి నిలిపివేయబడడానికి ముందే చిన్న ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో రూ .96.27 లక్షలకు వెళ్ళగా, పెద్ద ల్యాండ్ క్రూయిజర్ LC 200 ధర రూ .1.47 కోట్లు (ఎక్స్-షోరూమ్ ఇండియా) ఉంది. మీకు తెలుసు, ఎందుకంటే అవి రెండూ CBU దిగుమతులు.
ప్రాడో తన బోనెట్ కింద 3.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంది, అది కేవలం 173Ps పవర్ మరియు 410Nm టార్క్ ను అందిస్తుంది, ఇవి తక్కువ సంఖ్యలనే కలిగి ఉంది, అయితే భారీ SUV కి ఇవి సరిపడే సంఖ్యలు కావనే చెప్పాలి. దాని పెద్ద తోబుట్టువు LC200 బోనెట్ క్రింద పెద్ద 4.5-లీటర్ V8 ను కలిగి ఉంది, ఇది 650Nm టార్క్ సామర్థ్యాన్ని కలిగి ఉంది, కానీ, మళ్ళీ, పవర్ ఫిగర్ అసమాన 265Ps అందించబడుతుంది. ల్యాండ్ క్రూయిజర్ యొక్క ఈ వెర్షన్ దాని సామర్థ్యానికి సరిపడేది కాదని చెప్పుకోవడం ఉత్తమం.
ఈ SUV లు వాటి పరిమాణం మరియు చివరి వరకూ మోసే సామర్ధ్యం వంటి వాటి కోసం ప్రసిద్ది చెందాయి. ఇంకా టయోటాస్ కావడంతో, భద్రత అగ్రస్థానంలో ఉంది. ప్రాడోకు ఏడు ఎయిర్‌బ్యాగులు లభించగా, పెద్ద LC 200 కి 10 ఎయిర్‌బ్యాగులు వచ్చాయి!
టొయోటా కొత్త తరం ల్యాండ్ క్రూయిజర్ పై పని చేస్తుంది, ఇది LC 200 ను భర్తీ చేస్తుందని మరియు ఇది హైబ్రిడ్ అవుతుందని పుకార్లు వస్తున్నాయి. అయితే భవిష్యత్తులో ఇది భారతదేశానికి ఎప్పుడు వస్తుందనేది స్పష్టంగా తెలియదు.
0 out of 0 found this helpful