• English
  • Login / Register

టొయోటా వారు అధికారికంగా 2016 ఇన్నోవా ప్రకటనతో ముందుకొచ్చారు!

టయోటా ఇనోవా కోసం raunak ద్వారా నవంబర్ 04, 2015 11:04 am ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

రెండవ తరం ఇన్నోవా ఈ నెల 23న రాబోతోంది అని వినికిడి, కాకపోతే భారతీయ ఆరంగ్రేటం ఆటో ఎక్స్‌పో  2016 లో జరిగే అవకాశం ఉంది! 

జైపూర్: టొయోటా వారు రెండవ తరం ఇన్నోవా యొక్క  మొదటి అధికారిక ప్రకటన ని 'త్వరలో రాబోతోందీ అనే శీర్షికతో  విడుదల చేశారు. తాజాగా ఈ 2016 ఇన్నోవా కి సంబంధించి ఇండొనేషియా బ్రోషర్ సంఘటనతో సహా అనేక మార్లు వివరాలు వెలువడటం జరిగింది. ఈ నెల 23న ఈ రెండవ తరం ఇన్నోవా విడుదల ఆయే అవకాశం ఉంది.  భారతీయ విడుదల మాత్రం వచ్చే ఏడాది జరగవచ్చు కాకపోతే ఆవిష్కరణ మాత్రం ఆటో ఎక్స్‌పో 2016 న జరగవచ్చును.  

ఇన్నోవా కి కొత్త 2.4-లీటర్ డీజిల్ ఇంజిను రానుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 2393సీసీ 4 సిలిండర్ 149bhp శక్తిని 3400ఆర్పీఎం వద్ద విడుదల చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో జత చేసినప్పుడు 343 టార్క్ 1200-2800ఆర్పీఎం వద్ద మరియూ 6-స్పీడ్ ఆటోమాటిక్ గేర్ బాక్స్ తో జత చేసినప్పుడు 360 టార్క్ 1200-2600ఆర్పీఎం వద్ద ఉత్పత్తి చేయగలదు.  

ఇండొనేషియాలో ఈ వాహనానికి 205/65  R16 మరియూ 215/65 R17 అల్లోయ్ వీల్స్ ఎంపికలతో అందించబడుతోంది. ఈ రెండవ తరం ఇన్నోవా ఇంకా ఫార్చునర్ కి కొత్త డీజిల్ ఇంజిన్లను అమర్చడం జరిగింది. ఇన్నోవా కి కొత్త 2.0-లీటర్ డ్యువల్  VVT-i  పెట్రోల్ ఇంజిను అన్ని ఇతర దేశాలలో ఉండగా, భారతదేశంలో మాత్రం కేవల డీజిల్ ఇంజిను మాత్రమే అందిస్తున్నారు. మరిన్ని వివరాలకై చూస్తూనే ఉండండి! 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Toyota ఇనోవా

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience