మహీంద్రా మరాజ్జో VS టయోటా ఇన్నోవా క్రిస్టా: ఏ MPV మంచి స్పేస్ ని అందిస్తుంది?
మహీంద్రా మారాజ్జో కోసం dhruv attri ద్వారా జూన్ 17, 2019 11:50 am సవరించబడింది
- 20 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మరాజ్జో మహీంద్రా కోసం అతిపెద్ద 'ఫుట్‌ప్రింట్' కలిగి ఉండవచ్చు. కానీ ఆధిపత్య విజేతని ఓడించటానికి అది సరిపోతుందా?
మహీంద్రా ఈ కొత్త MPV ని నిర్మించామని ప్రకటించినప్పుడు, అది టొయోటా ఇన్నోవా క్రిస్టా కొనుగోలుదారులను ఆకర్షించడానికి ఉద్దేశించినది అని స్పష్టంగా తెలిసింది. ఎందుకంటే ఈ టొయోటా ఇన్నోవా క్రిస్టా కొనుగోలుదారులు ఎక్కువగా ఇతర లక్షణాలు కంటే ఎక్కువగా క్యాబిన్ స్థలానికి మరియు వాస్తవికతకు ప్రాధాన్యమిస్తారు. మీరు వారిలో ఒకరైతే, ఈ రెండిటిలో ఏది అత్యంత విశాలమైనది అని తెలుసుకోవడానికి ఇది అంతా చదవండి.
అంతర్గత స్థలం
ఇన్నోవా క్రిస్టా కారు మరాజ్జో కంటే 21 అడుగుల ఎత్తైనది మరియు 150mm పొడవైనది, దీనివలన ఇది వెలుపల నుండి కొంచెం ఎక్కువగా పెద్దదిగా కనిపిస్తుంది. కానీ మహీంద్రా మరాజ్జో ని కొంచెం ఎక్కువ విశాలంగా ఉండేలా చూసుకుంటుంది, దీనిలో FWD లేఅవుట్ మరియు బాగా అమర్చబడిన ఇంజిన్ కి కృతజ్ఞతలు తెలుపుకోవాలి.
ఇటీవల, మేము రెండు MPV లను మరియు ఒకే విధంగా ధర కలిగినటువంటి వాహనాలను ప్రక్క ప్రక్కన ఉంచి సరైన పోలిక పరీక్ష నిర్వహించాము. ఇక్కడ వీడియోని తనిఖీ చేయండి.
కానీ ప్రస్తుతానికి, కొలత టేప్ ఏమిటి చెబుతుందో చూద్దాం.
ముందు వరుస
మారాజ్జో కారు ముందర భాగం స్పేస్ విషయానికి వస్తే ఇన్నోవా క్రిస్టా ని చిత్తుగా ఓడిస్తుందని చెప్పవచ్చు. ఆరడుగల వ్యక్తులు కూడా లెగ్‌రూం మరియు నీ(మోకాలు) రూం పరంగా ఎటువంటి కొరతను కలిగి ఉండరు. అయినప్పటికీ, టయోటా ఇక్కడ తొడ క్రింద భాగంలో మెరుగైన మద్దతు అందించే విషయంలో ఎక్కువ స్కోర్ చేస్తుందని చెప్పవచ్చు. అయితే మహీంద్రా యొక్క ముందరి వరుస అనేది ఎక్కువగా వెనక్కి స్ట్రెచ్ చేసే విధంగా ఉంటుంది, అయితే ఇన్నోవా యొక్క సీట్లు దూరపు ప్రయాణాల్లో మరింత సౌకర్యవంతంగా ఉంటాయి.
మొదటి-వరుస కొలతలు (mm)) |
హెడ్‌రూం (మిని-మాక్స్) |
లెగ్రూమ్ (మిని- మాక్స్) |
నీ రూం (మిని-మాక్స్) |
సీట్ బేస్ పొడవు |
మరాజ్జో |
925-1025 |
940-1130 |
610-850 |
470 |
ఇన్నోవా క్రిస్టా |
930-1055 |
865-1025 |
515-720 |
486 |
రెండవ వరుస
టయోటా యొక్క కెప్టెన్ సీట్లు ఆరడుగుల వ్యక్తుల కోసం కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. కానీ మరాజ్జో మంచి హెడ్‌రూం ని, షోల్డర్ రూం ని మరియు అత్యధికంగా నీ(మోకాలు) రూం ని కూడా అందిస్తుంది. ఇన్నోవా క్రిస్టా ఒకేఒక్క అంశంలో ఓడుతుంది అదేమిటంటే తొడ క్రింద భాగంలో ఉండే మద్దతు, మీరు ఏవరేజ్ పరిమాణంలో ఉన్నట్లయితే ఇది కూడా పెద్ద ఇబ్బందిగా అయితే ఉండదు.
రెండవ-వరుసల కొలతలు (mm) |
షోల్డర్ రూం |
హెడ్ రూం |
సీట్ బేస్ వెడల్పు (కెప్టెన్ సీట్లు) |
సీట్ బేస్ పొడవు కెప్టెన్ సీట్లు) |
నీ- రూమ్ (మిని-మాక్స్) |
మరాజ్జో |
1460-1470 |
990 |
540 |
490 |
545-885 |
ఇన్నోవా క్రిస్టా |
1445 |
965 |
540 |
520 |
675-875 |
మూడవ వరుస
ఈ రెండు MPV లలో మూడవ వరుస ఎలా ఉపయోగపడుతుందనేదే ఇక్కడ ముఖ్యమైన అంశం. ఇక్కడ మరాజ్జో కారు ఇన్నోవా క్రిస్టా కంటే దాని విశాలమైన సీట్లుతో ఎక్కువ మార్కులు సంపాదిస్తుంది. మొదట, మరాజ్జో యొక్క మూడవ వరుస సీట్లు అనేవి ఇన్నోవా కంటే కూడా 10mm ఎత్తులో ఉంటాయి, దీనివలన మీరు కొంచెం ఎత్తులో కూర్చుంటారు అందువలన మీ మోకాలు అనేది కొంచెం ఎత్తులో ఉన్నట్టుగా ఉంటుంది. దీనికి నీ(మోకాలు)రూం కూడా ఎక్కువే ఉంటుంది, దాని అర్ధం ఏమిటంటే ముందు ఉన్న వరుస మీ మోకాలు అనేది తగలకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీని వలన ఎక్కువసేపు దూరపు ప్రయాణాలు చేయాల్సి వస్తే గనుక సౌకర్యవంతంగా ఉంటుంది.
మూడవ-వరుసల కొలతలు (mm) |
షోల్డర్ రూం |
హెడ్ రూం |
సీట్ బేస్ వెడల్పు |
సీట్ బేస్ పొడవు |
నీ-రూమ్ (మిని-మాక్స్) |
ఫ్లోర్ నుండి సీట్ బేస్ హైట్ |
మరాజ్జో |
1190 |
900 |
1190 |
430 |
620-710 |
290 |
ఇన్నోవా క్రిస్టా |
1335 |
895 |
1200 |
420 |
570-670 |
280 |
ఇన్నోవా క్రిస్టా కారు మారాజ్జోను ఓడిస్తున్న ఏకైక అంశం ఏమిటంటే షోల్డర్ రూం. పేపర్ మీద చూస్తే గనుక ఇన్నోవా క్రిస్టా కారు మరాజ్జో కంటే సౌకర్యవంతంగా ముగ్గురు ప్రయాణికులను కూర్చోబెట్టుకోగలదు అని ఉంది. కానీ మార్జోజో మూడవ వరుసలో ఇద్దరు ప్రయాణీకులకు మరింత సౌకర్యంగా ఉంచగలదు అని మేము అనుకుంటున్నాము.
మొత్తంగా
ఇన్నోవా క్రిస్టా ఒక పెద్ద బూట్ తో పాటు ముందు మరియు రెండవ వరుస అనుభవాన్ని బాగా అందిస్తుంది. ఇది మరాజ్జో కంటే ఒక మంచి ప్రయోజనంగా చెప్పవచ్చు.
కానీ మీకు ఎక్కువ స్పేస్ కావలి మరియు మూడవ వరుసని ఎక్కువ ఉపయోగిస్తే మాత్రం మరాజ్జో ఇక్కడ టాప్ స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. తక్కువ ధర ట్యాగ్ ని గనుక పరిగణలోనికి తీసుకుంటే తక్కువ ధరను కలిగి ఉండడం వలన ఫుల్-సైజ్ SUV గా మరాజ్జో బాగుంటుంది అని చెప్పవచ్చు.
అన్ని దాని ప్రత్యర్థులతో మారాజ్జో యొక్క మా స్పెసిఫికేషన్ పోలిక కోసం ఈ లింక్ చూడండి.
మరింత చదవండి: మరాజ్జో డీజిల్ గురించి