• English
  • Login / Register

టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ తో కొత్త ఎతియోస్ ఎక్స్ క్ల్యూజివ్ ను ప్రారంభించిన టయోటా

టయోటా ఇతియోస్ కోసం raunak ద్వారా ఆగష్టు 11, 2015 11:23 am ప్రచురించబడింది

  • 30 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజనులతో, కొత్త నీలం రంగుతో, నావిగేషన్ తో కూడిన టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థతో, కొత్త లెదర్ అపోలిస్ట్రీ తో మరియు వుడ్ డాష్బోర్డ్ అల్లికతో అందుబాటులో ఉంది.

జైపూర్ :

టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకెఎం) లోపల మరియు బయట సూక్ష్మమైన మార్పులతో ఎతియోస్ ఎక్స్ క్ల్యూజివ్ స్పెషల్ ఎడిషన్ ప్రారంభించింది. ఈ ఎతియోస్ ఎక్స్ క్ల్యూజివ్ స్పెషల్ ఎడిషన్ రూ. 782, 215/- ధరతో (1.5ఎల్ పెట్రోల్ వేరియంట్) మరియు రూ. 892, 965 /- ధరతో (1.4ఎల్ డీజిల్ వేరియంట్) ఎక్స్-షోరూమ్ ఢిల్లీ లో ప్రారంభించబడినది.

ఏమిటి కొత్త?

. ఎతియోస్ ఎక్స్ క్ల్యూజివ్ ఎడిషన్, ఎక్స్ క్ల్యూజివ్ బాడ్జింగ్ తో పాటూ కొత్త నీలం మెటాలిక్ రంగును కలిగి ఉంది.
. ఇది బయట వెనుక వీక్షణ అద్దాలపైన క్రోమ్ చేరికలతో పాటు డోర్ సైడ్ విజర్స్ వంటి లక్షణాలను కలిగి ఉంది.
. లోపలివైపు, దీని ఇన్స్ట్రుమెంటేషన్ ప్యానెల్ & ఆర్మ్ రెస్ట్ చుట్టూ వుడ్ గ్రైన్ ఫినిషింగ్, పక్కభాగంలో కొత్త డ్యూయల్ టోన్ అపోలిస్ట్రీ ఉంది.
. దీనిలో చేతి మరియు ఎయిర్ హావభావాలు, బ్లూటూత్ కనెక్టివిటీ, వాయిస్ ఫంక్షన్ & స్మార్ట్ ఫోన్ ఎనేబుల్ నావిగేషన్ వంటి లక్షణాలను కలిగి ఉన్న 'స్మార్ట్ లింక్' టచ్ స్క్రీన్ సమాచారవ్యవస్థ ఉండడం దీనిలో అతి ముఖ్యమైన అంశం.

టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రెవేట్ లిమిటెడ్ యొక్క డైరెక్టర్ & సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) అయిన మిస్టర్ ఎన్.రాజా వాహన ప్రారంభించిన సమయంలో మాట్లాడుతూ " మేము కొత్త ఎతియోస్ ఎక్స్ క్ల్యూజివ్ ని ప్రారంభించినందుకు ఆనందంగా ఉన్నాము. నిరంతరం మారుతున్న జీవనశైలి ప్రాధాన్యతలతో మా వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా నవీకరణలు చేయాలనేదే మా ప్రయత్నం అని అన్నారు. ఈ కొత్త ఎతియోస్ఎక్స్ క్ల్యూజివ్ మరింత దాని మెరుగైన సాంకేతికత మరియు ప్రీమియమ్ తో మా వినియోగదారులకు ఆహ్లాదాన్ని అందిస్తుందని మేము చాలా నమ్మకంగా ఉన్నాము. అని పేర్కొన్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా బ్రాండ్ పై బలమైన నమ్మకం మరియు మంచి స్పందన అందిస్తున్నందుకుగానూ మా వినియోగదారులకు ధన్యవాదాలు. మనందరికీ భద్రత చాలా ముఖ్యమైన లక్షణం. సృజనాత్మకత అనేది సాంకేతిక జ్ఞానానికి మాత్రమే పరిమితం కాదు భద్రతపై కూడా ఉండాలి. అందువలన, ఎతియోస్ ప్రయాణీకుల భద్రతకు కీలకంగా మారుతుంది" అని కూడా మిస్టర్ ఎన్.రాజా తలిపారు.

యాంత్రికంగా ఇంజిన్ లైనప్ ఎటువంటి మార్పులు లేవు. ఈ ఎక్స్క్లూసివ్ ఎడిషన్ అదే 1.5 లీటర్ పెట్రోల్ మరియు 1.4 లీటర్ డి-4డి డీజిల్ శక్తితో రెండూ కూడా 5- స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ సిస్టమ్ తో జతచేయబడినవి. అంతేకాక, ఎతియోస్ రేంజ్ పరంగా ప్రామాణిక డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ ను అందిస్తుంది.

was this article helpful ?

Write your Comment on Toyota ఇతియోస్

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience