• English
  • Login / Register

గోల్డెన్ పీకాక్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ అవార్డు 2015 ను సాధించిన టయోటా కిర్లోస్కర్ మోటార్

జూలై 30, 2015 06:01 pm sourabh ద్వారా ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకెఎం) సంస్థ లో పనిచేసే ఉద్యోగుల ఆరోగ్యం మరియు భద్రత ను మెరుగుపరిచేందుకు గానూ, వీరు ఆక్యుపేషనల్ ఆరోగ్యం మరియు భద్రత లో సమర్ధత ను చూపించి గోల్డెన్ పీకాక్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ అవార్డు (జిపిఓ హెచ్ ఎస్ ఏ) ను సాధించారు. ఈ సంస్థ యొక్క తయారీదారుడు అనేక విమర్శలను పొంది మరియు ఉద్యోగులు భద్రత ఆందోళనలు వైపు  ముదావహం చర్యలు తీసుకొని ఈ పురస్కారాన్ని పొందాడు.  

ఈ అవార్డు, ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ లో సెట్ ప్రమాణాలలో బెంచ్ మార్క్ సాధించినందుకుగానూ వచ్చిందని భావిస్తారు. దీనికి ముందు, 2010 లో టీకెఎం సంస్థ పర్యావరణ మేనేజ్మెంట్ లో ఉత్తమ విధానాలకు గానూ, గోల్డెన్ పీకాక్ పర్యావరణ మేనేజ్మెంట్ అవార్డును కూడా గెలుచుకుంది.

ప్రతిష్టాత్మక అవార్డు పొందిన తర్వాత  టయోటా కిర్లోస్కర్ మోటార్ యొక్క సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ రాజు బి కెట్కలే మాట్లాడుతూ, ఈ విజయాన్ని మేము ఒక స్పూర్తిగా తీసుకుని మా ప్రక్రియలను ఇంకా అభివృద్ధి చేస్తూనే ఉంటాము మరియు భద్రతా పరంగా నాణ్యమైన ఉత్పత్తులను అంతటా చూడడమే ధ్యేయంగా పని చేస్తాము.  విజయం దానితో పాటుగా ప్రతిపుష్టిని అందుకున్నాక భద్రత, ఆరోగ్యం మరియు పర్యావరణం వంటి ఉన్నత ప్రమాణాల వైపు మా నిబద్ధత ఇంకా పెరిగింది. భద్రత కొరకు టొయోటా లోని అన్ని మోడళ్లలో ఎయిర్బ్యాగ్స్ ను అందించి ఆటో మొబైల్ పరిశ్రమలో భద్రతా పరంగా లీడరు గా  గుర్తించబడడం మా ఆశయమని" ఆయన వాఖ్యానించారు.  

సంస్థల యొక్క ఉత్పత్తిని మరియు నాణ్యతను మెరుగు పరిచేందుకు ఈ జాతీయ మరియు ప్రపంచ అవార్డుల సమితి అయిన గోల్డెన్ పీకాక్ అవార్డ్స్ (జిపిఏ) ను ప్రధానం చేస్తారు. ఈ అవార్డు 1991 లో డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ చే స్థాపించబడింది మరియు ఇది ఇప్పుడు కార్పొరేట్ ఎక్సెలెన్స్ బెంచ్ మార్క్ గా భావించబడుతుంది.

మా భద్రతా పద్దతులు, మా కార్యాలయంలో  మరియు మా ఉత్పత్తులలో కలిసి ఉండడం వలన మేము ఈ అవార్డును సాధించగలిగాము. మా టీమ్ లో ప్రతి ఒక్కరు అంకితభావంతో కృషి చేయడం వల్లనే ఇది సాధ్యమైంది. ఇటువంటి స్పూర్తి మరియు గుర్తింపు వలన టయోటా చేసే ప్రతి ఉత్పత్తిలో ప్రపంచ ప్రమాణాలయిన  నాణ్యత, మన్నిక మరియు విశ్వసనీయత కలగలసి ఇంకా అభివృద్ధిని సాధించేందుకు ప్రేరణగా నిలుస్తుందని" ఆయన జోడించారు. 

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience