టయోటా ఇన్నోవా 2016 భారత ఆటో ఎక్స్పోలో రాబోతోందని అధికారికంగా ప్రకటించింది.
టయోటా ఇనోవా కోసం manish ద్వారా జనవరి 28, 2016 01:36 pm ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ప్రపంచంలో అతిపెద్ద వాహన తయారీ అయిన MPV, ఇన్నోవా ఎంతగానో ఆశించిన విధంగా ఆటోఎక్స్పోలో రాబోతోందని ప్రత్యేక పేజీలో బహిర్గతం చేసారు. జపనీస్ వాహన తయారీదారులు "ఇన్నోవా హెరిటేజ్" అనే ఒక పోటీని నిర్వహిస్తున్నారు. ఇది టయోటా వినియోగదారులకు ప్రత్యేకంగా అందిస్తున్నారు. ఈ ప్రత్యేక టీజర్ లో ఈ విధంగా కూడా ఉంది. MPV2016 లో జరగనున్న రాబోయే ఆటోఎక్స్పోలో ఫిబ్రవరి 5 నుండి 9 వరకు జరిగే అవకాశం ఉందని కూడా ఉంది.
తదుపరి-తరం టయోటా ఇన్నోవా ఒక బ్రాండ్ కొత్త ఉత్పత్తి. దీనిలో అన్ని కొత్త ఫీచర్లు మరియు కొత్త అంతర్గత లక్షణాలు ఉండబోతున్నాయి. MPV కూడా అదే బుల్లెట్ టయోటా Hilux వేదిక లో ప్రదర్శించబోతోంది. తదుపరి తరం ఫార్చ్యూనర్ SUV కూడా దీనితో పాటూ ఉండబోతోంది. 2.4 లీటర్ GD డీజిల్ ఇంజన్ కలిగి ఉండే అవకాశం ఉంది. ఇన్నోవా ఒక ప్రామాణిక 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపిక ని కలిగి రాబోతోంది.
దీని డీజిల్ ఇంజిన్ 147bhpమరియు 380 ఎన్ఎమ్ల ల శక్తి మరియు టార్క్ లని ఉత్పత్తి చేయగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అంతే కాకుండా ప్రామాణిక ఎ బి ఎస్ మరియు డ్యుయల్-ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ అనే యాంత్రిక నవీకరణలు కూడా ఉండబోతున్నాయి.
తదుపరి తరం టయోటా ఇన్నోవా చాల ఎక్కువ విలాసవంతమైన ఫీచర్లని దాని మునుపటి తరం కంటే ఎక్కువ నవీకరనలని అందించబోతుంది. అంతేకాకుండా వాహనం లో కూర్చున్నవారికి కూడా టచ్స్క్రీన్ వినోద వ్యవస్థ, పరిసర లైటింగ్, డిజిటల్ MID, tiltable స్టీరింగ్ వీల్ అనే అనేక సౌకర్యవంతమయిన ఫీచర్లని అందించబోతోంది.
తదుపరి తరం టయోటా ఇన్నోవా ఈ ఏడాది కొంత సమయం తరువాత ఇండియన్ వీధుల్లో కనిపించనుంది. అందరూ ఎదురుచూస్తున్నటువంటి "కింగ్"suvరావటానికి కొంత సమయం పట్టేలా ఉంది.
ఇది కూడా చదవండి; భారతదేశ ప్రత్యేక తదుపరి తరం ఫార్చ్యూనర్ ను ఇండోనేషియా లో ప్రారంభించిన టయోటా