• English
  • Login / Register

CNG ధరలను వెల్లడించిన టయోటా హైరైడర్!

టయోటా hyryder కోసం tarun ద్వారా జనవరి 31, 2023 11:22 am ప్రచురించబడింది

  • 70 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

హైరైడర్ కాంపాక్ట్ SUV మిడ్-స్పెక్ S మరియు G వేరియెంట్‌లతో CNG కిట్ؚను ఎంచుకోవచ్చు

Toyota Hyryder CNG

  • CNG హైరైడర్ ధర రూ.13.23 లక్షల నుండి రూ.15.29 లక్షలుగా ఉంది, ఇది పెట్రోల్ వేరియెంట్ؚలతో పోలిస్తే రూ.95,000 వరకు అధికం.

  • ఇది 26.6km/kg సామర్ధ్యం, 88PS పవర్‌తో 1.5-లీటర్ పెట్రోల్-CNG ఇంజన్ؚను కలిగి ఉంది. 

  • CNG వేరియెంట్ؚలలో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్. ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, వెనుక కెమెరా మరియు LED హెడ్ ల్యాంపులు ఉన్నాయి. 

  • గ్రాండ్ విటారా CNGతో పోలిస్తే రూ.45,000 వరకు ఖరీదైనది. 

టయోటా హైరైడర్ మారుతి గ్రాండ్ విటారా విభాగంలో చేరి దేశంలో అందుబాటులో ఉన్న రెండవ CNG-ఆధారిత SUVగా నిలిచింది. దీని మిడ్-స్పెక్ S మరియు G వేరియెంట్‌లు CNG ఎంపికను కలిగి ఉన్నాయి, వాటి ధరలు క్రింది విధంగా ఉన్నాయి:

వేరియెంట్ లు

CNG 

పెట్రోల్-MT

గ్రాండ్ విటారా CNG

రూ. 13.23 లక్షలు

రూ. 12.28 లక్షలు

రూ. 12.85 లక్షలు

G

రూ. 15.29 లక్షలు

రూ. 14.34 లక్షలు

రూ. 14.84 లక్షలు

CNG వేరియెంట్ؚల ధర పెట్రోల్-మాన్యువల్ వేరియెంట్‌ల ధరలతో పోలిస్తే రూ.95,000 ఎక్కువగా ఉన్నాయి. ఇదే విభాగంలో ఉన్న మారుతి వేరియెంట్ؚతో పోలిస్తే, వేరియెంట్‌ ను బట్టి హైరైడర్ CNG ధర రూ.45,000 ఎక్కువగా ఉంది.

Toyota Hyryder CNG

టయోటా హైరైడర్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ؚ CNG ఎంపికతో కూడా వస్తుంది, ఇది గ్రీన్ ఫ్యూయల్ తో నడుస్తున్నప్పుడు 88PS మరియు 121.5Nmను అందిస్తుంది. దీని సామర్ధ్యం 26.6km/kgగా చెప్పవచ్చు, 27.97kmpl మైలేజ్ ను అందించే హైబ్రిడ్‌ తో పోలిస్తే ఇది కొంత వరకు తక్కువ. సంబంధిత శక్తివంతమైన హైబ్రిడ్ వేరియెంట్ؚల ధర, CNG ఎంపికల కంటే సుమారు రూ. 2 లక్షల వరకు ఎక్కువగా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: మారుతి గ్రాండ్ విటారా CNG బూట్ స్పేస్ؚను మొదటిసారి పరిశీలించండి

CNG వేరియెంట్‌లؚలో ఆటోమ్యాటిక్ LED హెడ్ؚల్యాంపులు, 9-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమ్యాటిక్ AC, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, ఆరు ఎయిర్ؚ బ్యాగ్ؚలు, రేర్ పార్కింగ్ కెమెరా, హిల్ హోల్డ్ కంట్రోల్ ఉన్నాయి. 

హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, నిసాన్ కిక్స్, స్కోడా కుషాక్, MG ఆస్టర్, వోక్స్ؚవాగన్ టైగూన్ వంటి వాటితో హైరైడర్ పోటీ పడుతుంది. ఈ విభాగంలో బలమైన హైబ్రిడ్ؚలను, CNGలను రెండిటిని అందించేవి కేవలం టయోటా మరియు మారుతి మాత్రమే.

ఇక్కడ మరింత చదవండి: అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఆన్ రోడ్ ధర

was this article helpful ?

Write your Comment on Toyota hyryder

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience