టొయోటా మిరై ని 2016 ఆటో ఎక్స్పో లో ప్రదర్శిస్తుంది
ఫిబ్రవరి 04, 2016 05:55 pm saad ద్వారా ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మైదానంలో పెద్ద మీడియా సిబ్బంది తో # first2expo- ఆటో ఎక్స్పో 2016 యొక్క విశేషాలని కార్దేకో అందరికీ విసృతంగా అందిస్తుంది.
జపనీస్ వాహనతయారీసంస్థ టొయోటా కొత్త హైడ్రోజన్ తో శక్తిని పొందే మిరాయి వాహనాన్ని జరుగుతున్న ఆటో ఎక్స్పోలో ప్రదర్శించారు. జపనీస్ భాషలో మిరాయి అంటే భవిష్యత్తు అని అర్ధం. అంటే నిస్సందేహంగా ఇది భవిష్యత్తు కారు అని చెప్పవచ్చు. ప్రత్యేఖంగా ఈ వాహనం హైడ్రోజన్ ని ఇంధనంగా తీసుకొని రాబోయే కార్లలా ఉండబోతుంది.
టొయోటా మిరాయి మారుతున్న నవీకరణలని దృష్టిలో పెట్టుకొని తయారుచేయబడింది. ఈ వాహనం ప్రొద్దున్న పూట కూడా వెలిగి ఉండే LED లైట్లను మరియు LED ఇండికేటర్లను కలిగి ఉంది, విశాలమైన గాలి ఇంటేక్ సెక్షన్లను మరియు 17 అంగుళాల వీల్బేస్ ను కలిగి ఉంటుంది. కారు అంతర్భాగానికి వస్తే టొయోటా మిరాయి ఎన్నో కొత్త అంశాలను కలిగి ఉంటుంది. ఉదాహరణకు 4.2 అంగుళాల HD TFT LED డిస్ప్లే, టచ్ సెన్సిటివ్ నావిగేషన్, 7- అంగుళాల టచ్ వ్యవస్థ, 11 స్పీకర్లతో కూడిన JBLఆడియో వ్యవస్థ కలిగి ఉంటుంది. స్టీరింగ్ వీల్ మల్టీ ఫంక్షనల్ కంట్రోల్ వ్యవస్థను ఇది డ్యుయల్ జోన్ ఎయిర్ కండిషనింగ్ యూనిట్ తో కూడి వస్తుంది.
మెరుగైన భద్రత కొరకు ఈ తరువాతి తరం వాహనంలో ఎన్నో అంశాలు అందజేయడం జరిగింది. ఉదాహరణకు ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్, ప్రీ కొలిజన్ వ్యవస్థ మరియు 8 ఎయిర్బ్యాగులను కలిగి ఉంటుంది. మిరై వాహనం యాంటీ లాక్ బ్రేకింగ్ వ్యవస్థ మరియు డైనమిక్ రాడార్ క్రూజ్ కంట్రోల్ వంటి అంశాలు అందుబాటులో ఉన్నాయి.
యాంత్రికంగా ఈ హైబ్రిడ్ వాహనం 3.7 లీటర్ 90 డిగ్రీ V8 పెట్రోల్ మిల్ ని కలిగి మరియు AISIN AW మరియు DENOముందు మరియు వెనకాతల భాగాలలో కలిగి ఉంటుంది. ఈ హైబ్రిడ్ వాహనం ఒక బలమైన శక్తిని అందిస్తూ 1000ps శక్తిని అందుకుంటుంది. మిరై ఒక హైడ్రోజన్ ద్వారా శక్తి పొందే కారు. అందువలన ఈ వాహనం ట్యాంక్ లో శక్తిని ఆక్సిజన్ తో జోడించుకొని విద్యుత్శక్తిని ఉత్పన్నం చేస్తుంది. ఈ విధంగా వాహనం ఇంధనాన్ని పొంది కారు ని నడపగలుగుతుంది.
0 out of 0 found this helpful