• English
  • Login / Register

'టయోటా ఆక్షన్ మార్ట్' ఆవిష్కరణను ప్రకటించిన టయోటా

సెప్టెంబర్ 14, 2015 12:33 pm manish ద్వారా సవరించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకెఎం), నేడు బెంగుళూర్ లో "టయోటా ఆక్షన్ మార్ట్" ని ప్రారంభించింది. టయోటా చివరకు ఉపయోగించిన కారు వేలం వ్యాపారం చేసే మొట్టమొదటి భారతదేశ వాహన తయారీసంస్థ. టయోటా ఒక నమ్మకమైన మరియు పారదర్శకంగా ఉపయోగించిన కారు పరిశ్రమ అనుభవాన్ని అందిస్తుంది. వాహన తయారీసంస్థ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇటువంటి సేవను అందిస్తుంది. కంపెనీ కర్నాటకలో (బెంగుళూర్ సమీపంలో) బిదాది దగ్గర వేలం సౌకర్యం ద్వారా కార్యకలాపాలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది.

వాహన తయారీదారుడు అన్ని బ్రాండ్లు నుండి కార్లు అమ్మకం చేస్తారు మరియు ఈ కార్లు ఇంటెన్సివ్ సమీక్ష మరియు వివరణాత్మక పరీక్షలకు లోబడి ఉంటాయి. ఈ విధానం వినియోగదారులకు క్యుడి ఆర్ విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలకు (నాణ్యత, మన్నిక & విశ్వసనీయత) పంపిణీ లక్ష్యంగా ఉంది.

ఈ కార్ల కోసం 203 సమగ్ర పాయింట్ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. ఇవి కార్ల కోసం నాణ్యత రేటింగ్ రాబట్టడానికి నిర్వహిస్తారు. ఇది ఇంటెన్సివ్ డాక్యుమెంటేషన్ తో జత చేయబడుతుంది.

టయోటా కిర్లోస్కర్ మోటార్ మేనేజింగ్ డైరెక్టర్, మిస్టర్ నవోమి ఇషీ మాట్లాడుతూ " భారతదేశం యొక్క ఉపయోగించే కార్ల వ్యాపారం ప్రతి సంవత్సరం వేగంగా పెరుగుతూ వస్తుంది ఇంకా ఎక్కువగా అసంఘటితంగా ఉంది. టయోటా ఆక్షన్ మార్ట్ యొక్క ప్రారంభంతో మా వినియోగదారుల కోసం మరింత విశ్వసనీయమైనది మరియు వాడిన కార్ల మార్కెట్ వినియోగదారులకి అభివృద్ధి ప్రయత్నాలు సూచిస్తుంది మరియు భారత సమాజానికి దోహదం చేస్తుంది. టయోటా అనుభంద సంస్థలు ద్వారా ఆక్షన్ లో 45 సంవత్సరాలుగా నిమగ్నమై ఉంది మరియు మేము మా ప్రపంచ అనుభవం మరియు అత్యధిక నాణ్యత, ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లలో వేలం నిర్వహించడం నైపుణ్యం పరపతి ఉంటుంది. మేము నమ్మకమైన మరియు ట్రాన్స్పరెంట్ కార్లను సృష్టించడం పట్ల అంకితభావంతో ఉన్నాము". అని తెలిపారు.

అదనంగా, టయోటా కిర్లోస్కర్ మోటార్, డైరెక్టర్ & సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ ఎన్. రాజా మాట్లాడుతూ" మేము, వినియోగదారులకు వాడిన కార్ మార్కెట్ విశ్వసనీయత, పెంచడం ద్వారా వాడిన కార్ల పరిశ్రమలో విప్లవం చేయడానికి ప్రయత్నిస్తున్నాము. లేకపోతే ఇది భారతదేశం లో చాలా మంది వినియోగదారులకు అవిశ్వసనీయంగా పరిగణించబడుతుంది.

మరింత ఎక్కువగా వినియోగదారులు ముందుకు వచ్చి వ్యవస్థీకృత మార్కెట్లో ఆధారపడి ఉన్నందున, ఇది మా నిర్వహించిన వాడిన కార్ మార్కెట్ విస్తరణకు సహాయం చేస్తుంది. 'టయోటా ఆక్షన్ మార్ట్' ఆవిష్కరణను ప్రకటించిన టయోటా ఉపయోగించిన కార్ల అమ్మకాల ద్వారా ఓఇఎం డీలర్స్ కి అనేక రకాల కొత్త కారు అమ్మకాలు పెంచేందుకు సహాయపడుతుంది. తద్వారా వారు కొత్త కారు అమ్మకాలకు మద్దతు ఇస్తున్నారు. టయోటా కి ఉపయోగించిన కారు వినియోగదారులతో ఉన్న సంబందాన్ని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాము మరియు టయోటా ఆక్షన్ మార్ట్ కు ఈ దిశలో ఒక బలమైన మద్దతు ఉంటుందని మేము నమ్మకంగా ఉన్నాము.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience