5-door Mahindra Thar వరుస రహస్య చిత్రాలు, మళ్ళీ ముసుగులోనే కనిపించిన రేర్ ప్రొఫైల్

మహీంద్రా థార్ 5-డోర్ కోసం ansh ద్వారా అక్టోబర్ 26, 2023 09:58 pm ప్రచురించబడింది

  • 189 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

పొడిగించిన మహీంద్రా థార్ؚలో అదనపు డోర్‌లు మరియు పొడవైన వీల్ؚబేస్ మాత్రమే కాకుండా, మరిన్ని ఫీచర్‌లతో కూడా వస్తుంది

Mahindra Thar 5-door Spied

  • నాజూకైన లైట్ ఎలిమెంట్‌లతో దృఢమైన రేర్ ప్రొఫైల్ؚను పొందనుంది. 

  • కొత్త క్యాబిన్ థీమ్ మరియు సన్‌రూఫ్‌తో సహా కొన్ని కొత్త ఫీచర్‌లతో వస్తుంది అని అంచనా.

  • 2-లీటర్ పెట్రోల్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజన్‌లతో అందించవచ్చు.

  • రూ.15 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో వచ్చే సంవత్సరం విడుదల అవుతుందని అంచనా

వచ్చే సంవత్సరం విడుదలకు ముందు, 5-డోర్‌ల మహీంద్రా థార్ؚను కారు తయారీదారు విస్తృతంగా పరీక్షిస్తున్నారు మరియు ఈ ఆఫ్-రోడర్ కొత్త రహస్య చిత్రాలు తరచుగా ఆన్ؚలైన్ؚలో కనిపిస్తున్నాయి. ఇటీవల కనిపించిన టెస్ట్ మోడల్‌లో LED కొత్త హెడ్ؚల్యాంపులు మరియు DRL సెట్అప్ؚలతో ఫ్రంట్ ప్రొఫైల్ కనిపించింది, దీని వెనుక ప్రొఫైల్ ప్రస్తుతం మరింత వివరంగా కనిపించింది. ఈ భారీ మహీంద్రా థార్ గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని విషయాలు ఇక్కడ అందించాము. 

ధృడమైన డిజైన్

Mahindra Thar 5-door Rear

ఆఫ్-రోడర్ అయినందున, 3-డోర్ మహీంద్రా థార్ ధృఢంగా మరియు భారీగా కనిపిస్తుంది, దీని 5-డోర్‌ల వర్షన్ కూడా ఇంత కంటే మెరుగ్గా ఉండేలా కనిపిస్తుంది. వెనుక ప్రొఫైల్ నాజూకైన LED టెయిల్‌లైట్ؚలతో కనిపించింది, ప్రామాణిక 3-డోర్‌ల వాహనంతో పోలిస్తే ఇవి భిన్నంగా ఉంది, ప్రొడక్షన్‌కు సిద్ధంగా ఉన్న 5-స్పోక్ؚ ఆలాయ్ వీల్స్ కూడా ఇక్కడ చూడవచ్చు.

Mahindra Thar 5-Door

దీని సైడ్ ప్రొఫైల్ దాదాపుగా అదే విధంగా కనిపించింది అయితే వీల్ؚబేస్ పొడవుగా ఉంది మరియు రెండు అదనపు డోర్‌లు ఉన్నాయి. ముందు భాగం కూడా మరింత ధృఢంగా కనిపించింది, 6-స్లాట్ؚ గ్రిల్ మరియు గుండ్రని LED లైటింగ్ సెట్అప్ ఉన్నాయి. అలాగే, ఈ వర్షన్ సింగిల్-పెన్ సన్‌రూఫ్ؚతో వస్తుంది.

భారీ థార్ లోపల

మహీంద్రా ఎక్స్‌టీరియర్‌లో మాత్రమే కాకుండా ఇంటీరియర్‌లో కూడా మార్పులు చేసింది. ఇటీవలి రహస్య చిత్రాలలో ఒకటి, సెంటర్ కన్సోల్‌లో భారీ టచ్ؚస్క్రీన్ ఉన్నట్లు కనిపించింది, అంతేకాకుండా క్యాబిన్ థీమ్ కూడా కొత్తగా ఉండవచ్చు.

ఇది కూడా చదవండి: టాటా సఫారీ ఫేస్ؚలిఫ్ట్‌తో పోలిస్తే మహీంద్రా XUV700 అదనంగా అందించే 5 అంశాలు

దీని ఫీచర్‌ల జాబితాకు సంబందించి, భారీ టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు సన్ؚరూఫ్ మాత్రమే కాకుండా, ఇది డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు రేర్ AC వెంట్ؚలను కూడా పొందవచ్చు. ప్రయాణీకుల భద్రత కోసం 6 వరకు ఎయిర్ బ్యాగ్ؚలు, EBDతో ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), హిల్ హోల్డ్ మరియు డిసెంట్ కంట్రోల్ మరియు రేర్ పార్కింగ్ కెమెరాలను మహీంద్రా అందించవచ్చు. 

దీనికి శక్తిని అందించేది ఏమిటి?

Mahindra Thar Engine

పొడిగించిన థార్ؚకు శక్తిని అందించడానికి మహీంద్రా 3-డోర్‌ల వర్షన్‌లో ఉన్నట్లుగానే ఇందులో కూడా 2-లీటర్ పెట్రోల్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ ఎంపికలను అందించవచ్చు. ఈ ఇంజన్‌లు మరింత సమర్ధవంతంగా ఉండవచ్చు మరియు 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ ఎంపికతో అందించవచ్చు. ప్రామాణిక థార్ విధంగానే, 5-డోర్‌ల వర్షన్ కూడా రేర్-వీల్-డ్రైవ్ (RWD) మరియు 4-వీల్-డ్రైవ్ (4WD) సెట్అప్ؚలు రెండిటిలో అందించవచ్చు.

ఇది కూడా చూడండి: మళ్ళీ కనిపించిన మహీంద్రా XUV300 ఫేస్‌లిఫ్ట్, కనిపించిన కొత్త ఆలాయ్ వీల్స్ & కనెక్టెడ్ LED టెయిల్ؚల్యాంప్ؚలు

విడుదల, ధర & పోటీదారులు

Mahindra Thar 5-door

5-డోర్‌ల థార్ నిర్దిష్ట విడుదల తేదీని మహీంద్రా వెల్లడించలేదు, అయితే ఇది 2024 మార్చిలో విడుదల అవుతుందని అంచనా. దీని ధర 3-డోర్‌ల వర్షన్ కంటే ఎక్కువగా మరియు రూ.15 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు. ఇది మారుతి జీమ్నీ మరియు 5-డోర్‌ల ఫోర్స్ గూర్ఖాకు పోటీ కావొచ్చు. 

ఇక్కడ మరింత చదవండి: థార్ ఆటోమ్యాటిక్

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మహీంద్రా థార్ 5-Door

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience