Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

విడుదలకు ముందు డీలర్ షిప్ؚల వద్ద చేరుకున్న నవీకరించబడిన టయోటా ఇన్నోవా క్రిస్టా

టయోటా ఇనోవా క్రైస్టా కోసం ansh ద్వారా మార్చి 13, 2023 07:33 pm ప్రచురించబడింది

మార్పులు చేసిన ముందు ప్రొఫైల్ؚతో, ఈ MPV కేవలం డీజిల్-మాన్యువల్ ఇంజన్ తో వస్తుంది.

  • నవీకరించబడిన ఇన్నోవా క్రిస్టాను టయోటా ఈ నెలలోనే విడుదల చేయనుంది.

  • ఇది కేవలం 5-స్పీడ్‌ల మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో జత చేయబడిన 2.4-లీటర్ డీజిల్ ఇంజన్ؚతో వస్తుంది.

  • రీడిజైన్ చేసిన ఫ్రంట్ ప్రొఫైల్ؚను మినహాయించి గమనించదగిన మార్పులు ఉండవు.

  • ఏడు ఎయిర్ బ్యాగులు మరియు లెదర్ అప్ؚహోల్ؚస్ట్రీ వంటి ఫీచర్‌లతో, నాలుగు వేరియెంట్ؚలలో అందుబాటులో ఉంటుంది.

  • దీని ధర రూ.20 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతుందని అంచనా.

టయోటా ఇన్నోవా క్రిస్టా MPV విభాగంలో ఎంతో ప్రాచుర్యం పొందింది, ఈ వాహన బుకింగ్‌లను ప్రారంభించిన తరువాత దీన్ని త్వరలోనే తిరిగి మార్కెట్‌లోకి ప్రవేశ పెట్టడానికి కారు తయారీదారు సిద్ధం అవుతున్నారు. కానీ దాని కంటే ముందు, ఈ MPV యూనిట్‌లు కొన్ని డీలర్ؚషిప్ؚల వద్దకు ఇప్పటికే చేరుకున్నాయి, టెస్ట్ డ్రైవ్ؚల కోసం అందుబాటులో ఉన్నాయి.

క్రిస్టాలో ఏమి ఉన్నాయి

ఈ MPV వెర్షన్ నాలుగు వేరియెంట్‌లలో వస్తుంది: G, GX, VX మరియు ZX. పై చిత్రంలో ఉన్న యూనిట్, ఈ MPV బేస్ వేరియెంట్ కంటే తదుపరి ‘GX’ వేరియెంట్ؚలా కనిపిస్తోంది. దీనిలో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్ؚమెంట్ డిస్ప్లే, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, మాన్యువల్ AC, స్టీరింగ్‌కు అమర్చిన కంట్రోల్స్, మూడు ఎయిర్ బ్యాగ్ؚలు, EBDతో ABS, వెహికిల్ స్టెబిలిటీ కంట్రోల్ (VSC) మరియు ప్రయాణీకులు అందరి కోసం మూడు-పాయింట్‌ల సీట్ బెల్ట్ؚలు ఉన్నాయి.

మరిన్ని ఫీచర్‌లు

ఇన్నోవా క్రిస్టా అగ్ర శ్రేణి వేరియెంట్‌లలో ఆటోమ్యాటిక్ LED ప్రాజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎనిమిది విధాలుగా సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్, ఆరు-స్పీకర్‌ల సౌండ్ సిస్టమ్, ఆటోమ్యాటిక్ క్లైమేట్ కంట్రోల్. USB ఫాస్ట్ ఛార్జింగ్ మరియు క్లైమేట్ కంట్రోల్ ఫీచర్‌లు ఉంటాయి. ప్రయాణీకుల భద్రత విషయానికి వస్తే, టయోటా దీన్ని ఏడు ఎయిర్ బ్యాగ్ؚలు, రేర్ డిఫోగర్, రేర్ వ్యూ కెమెరా మరియు ISOFIX యాంకర్‌లతో అందిస్తుంది.

సంబంధించినది: 2023 టయోటా ఇన్నోవా క్రిస్టా వేరియెంట్ؚల వివరాలు

పవర్‌ట్రెయిన్

ఇన్నోవా క్రిస్టా ఇప్పుడు డీజిల్ వెర్షన్‌గా మాత్రమే అందిస్తున్నారు, దీన్ని 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో జత చేయబడి 150PS పవర్ మరియు 343Nmల టార్క్‌ను అందించే 2.4-లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. విడుదల సమయంలో ఈ MPVలో ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ ఉండదు.

ధర మరియు పోటీదారులు

ఇన్నోవా క్రిస్టాను రూ.20 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో టయోటా ఈ నెలలో విడుదల చేస్తుందని భావిస్తున్నాము. కొత్త-జనరేషన్ ఇన్నోవా హైక్రాస్ؚకు ఇది చవకైన ప్రత్యామ్నాయం అవుతుంది, మహీంద్రా మరాజో మరియు కియా కేరెన్స్ వంటి వాటి కంటే పై స్థానంలో ఉంటుంది.

ఇది కూడా చదవండి: ఫిబ్రవరి 2023లో అత్యధికంగా అమ్ముడైన 10 కార్ బ్రాండ్‌లు ఇవి

a
ద్వారా ప్రచురించబడినది

ansh

  • 41 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన టయోటా ఇనోవా Crysta

V
vikramsinh balkrishna nipane
Mar 14, 2023, 4:20:42 PM

Excellent car

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర