Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

ఇటీవల అనధికారిక బహిర్గతమయిన చిత్రాల ప్రకారం టాటా కాంపాక్ట్ సెడాన్ బహుశా రాబోయే ఆటో ఎక్స్పో లో ప్రారంభం కావచ్చు.

జనవరి 12, 2016 11:43 am saad ద్వారా ప్రచురించబడింది

పట్టణాలలో టాటా జైకా యొక్క ప్రస్తుత చర్చ ఏమిటంటే ఇది ఇంతకుముందు స్తిరంగా ఉండి ఇప్పుడు దాని ఉత్పత్తిని విడుదల చేయబోతోంది. దీనితో పాటూ టాటా సంస్థ ఇదివరకే తెలిపినట్టు ఈ జైకా కంపాక్ట్ సెడాన్ ఆధారంగా రాబోతోంది. దీని అనాదికార చిత్రాలని చూస్తుంటే ఈ వాహనాన్నిటాటా త్వరలోనే విడుదల చేయబోతోంది అని తెలుస్తుంది. ఈ కారు మహారాష్ట్ర సతారా నగరంలో పరీక్ష మ్యూల్ చేయించుకుంటున్న సందర్బంలో దీని అనధికార చిత్రాలు వెల్లడయ్యాయి. దీని ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే ఈ కారు 2016 రాబోయే ఆటో ఎక్స్పో వద్ద ప్రపంచానికి పరిచయం కాబోతోంది అని విశ్వశిస్తున్నారు.

టాటా నుంచి రానున్న కాంపాక్ట్ సెడాన్ ఈ విధంగా పిలవ బడుతుంది అనే పుకార్లు వినిపించాయి . అది ఏమిటంటే' శ్వే' అనగా దీని అర్ధం ' ప్రభావము ' అనగా' గెలవటానికి ' అనే అర్ధాలు ఉన్నాయి. కానీ ఇవి కేవలం పుకార్లు మాత్రమే. ఎందుకంటే కంపనీ నుండి ఎటువంటి అధికారిక ప్రకటనలు లేవు. అయితే టాటా తన కార్ల కోసం ప్రత్యేక నామావళి ని అనుసరిస్తూ ఉంటుంది. కనుక ఇది ఈ సిరీస్ లో మరొక ముఖ్యమయినది కావచ్చు.

అయితే అనధికారిక చిత్రాల విషయానికి వస్తే ఈ చిత్రాలు పూర్తిగా కనిపించేలా లేవు. ఎందుకనగా అది పూర్తిగా కప్పబడి ఉంది. కానీ దాని ఫ్రంట్ గ్రిల్ ని పరిశీలిస్తే జైకా హాచ్బాక్ ప్రొఫైల్ కి కొంచెం మ్యాచ్ అయ్యింది. వెనుక భాగం ఈ తరగతి లోని ఇతర కాంపాక్ట్ సెడాన్ల లాగా స్తబ్బీగా చిన్నగా ఉంది. ఇక దీని లోపలి భాగాల విషయానికి వస్తే కొన్ని మినహాయింపులతో టాటా జైకా నుండి కొన్ని లక్షణాలు కూడా భాగస్వామ్యంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంకా లోపల హర్మాన్ ఆధారిత సమాచార వినోద వ్యవస్థ 8 స్పీకర్లను కలిగి ఉంటుంది. మరియు ఆధునిక AC, 3-స్పోక్ స్టీరింగ్ వీల్, డ్యుయల్ ఎయిర్బ్యాగ్స్ మరియు ABS వంటి ఫీచర్స్ తో పాటూ భద్రతా లక్షణాలని కూడా కలిగి ఉండబోతోంది.

దీని యొక్క పవర్ ట్రైన్లు తయారీదారుడు ప్రత్యేక స్వదేశీ పరిజ్ఞానం తో తయారు చేసాడు. దీనిలో 1.2 లీటర్ 3-సిలిండర్ రెవోట్రోన్ పెట్రోల్ ఇంజిన్ ఉండి 85ps శక్తిని మరియు 114నం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. 1.05 లీటరు Revo Torq మోటారు డీజిల్ ఇంజిన్ ని కలిగి ఉండి 70ఫ్శ్ శక్తిని మరియు 140Nm టార్క్ ని కలిగి ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజిన్లు కూడా ఇంజిన్లు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడుతాయి. మరియు ఇది తరువాత దశలలో ఎ ఎం టి ఎంపికను కలిగి ఉంటుంది.

టాటా రాబోయే కాంపాక్ట్ సెడాన్ మారుతి స్విఫ్ట్ డిజైర్, హోండా అమెజ్, హ్యుందాయ్ ఎక్స్సెంట్ మరియు ఫోర్డ్ ఫిగో ఆస్పిరే వంటి ప్రత్యర్ధి వాహనాలతో పోటీ పడబోతోంది. ఇది ప్రారంభం కాబోయే ఆటో ఎక్స్పో రోజు దగ్గరపడుతుంది.

ఇది కూడా చదవండి;

Share via

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
Rs.8.95 - 10.52 సి ఆర్*
కొత్త వేరియంట్
Rs.18.90 - 26.90 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.21.90 - 30.50 లక్షలు*
Rs.9 - 17.80 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.11.82 - 16.55 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర