టాటా జికా నుండి ఆశించేది ఏమిటి?
నవంబర్ 27, 2015 12:52 pm raunak ద్వారా ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
టాటా జికా ప్రస్తుతం నానో మరియు బోల్ట్ మధ్య ఖాళీని పూరించేందుకు ఉంది. ఈ స్థానంలో ఒకప్పుడు ఇండికా (ఇప్పుడు ఇండికా ఎవ్2) ఉండేది. వాహనం అంతర్గతంగా కైట్ సంకేతపదంతో పిలవబడుతుంది.
ఇండికా డిఎన్ఎ ఈ వాహనంలో ఉన్నప్పటికీ ఇండికా కి ప్రత్యేకమైన అభిమానులు లేని కారణంగా , దీని పేరుని జికా కి పెట్టడం జరగలేదు. జికా వాహనం జెస్ట్ మరియు బోల్ట్ వలే ఉండదు. ఇది కొద్దిగా విస్తా ని పోలి ఉంటుంది. జికా వాహనం కొత్త డిజైన్ ని కలిగియుండి ఎటువంటి టాటా కార్లని పోలి ఉండదు. టీజర్ చిత్రాలను చూస్తుంటే, జికా యొక్క సిల్హౌట్ కొత్త ఫోర్డ్ ఫిగో తో పోలి ఉంటుంది.
జికా యొక్క ఆశక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ వాహనం టాటా మోటార్స్ కి మంచి ఫలితాలు అందించలేని నానో మరియు బోల్ట్ మధ్య ఉండడం. కాబట్టి, జికా మార్కెట్ లో విడుదలైన తరువాత ఎటువంటి ఫలితాలు అందిస్తుందో ఎదురు చూడాల్సిందే. ఈ వాహనం డిసెంబర్ మొదటి వారంలో వెల్లడవచ్చు మరియు జనవరి 2016 లో అధికారికంగా వెల్లడి అవుతుంది. జికా వాహనం మారుతి సుజుకి సెలెరియో, చేవ్రొలెట్ బీట్, హ్యుందాయ్ ఐ 10, నిస్సాన్ మైక్రా యాక్టివ్ మరియు ఇతర వాహనాలతో పోటీ పడవచ్చు.
డిజైన్:
టీజర్ చిత్రాలు మరియు వీడియోలు చూస్తుంటే, ఈ వాహనం యొక్క డిజైన్ టాటా యొక్క DesignNext డిజైన్ యొక్క పునరుక్తి కనిపిస్తుంది. దీని గ్రిల్ టాటా సంస్థ దే అయినప్పటికీ పలుచగా సొగసైనదిగా ఉంటుంది మరియు జెస్ట్/బోల్ట్ ని పోలి ఉండదు. ఈ గ్రిల్ నిటారుగా ఉంచబడి కారు యొక్క ముందరి భాగం కొద్దిగా ముందుకు వచ్చినట్టుగా ఉంటుంది. ఈ వాహన ఇతర శ్రేణుల తో పోలిస్తే, ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. టీజర్ చిత్రాలు చూస్తుంటే హెడ్‌ల్యాంప్స్ కొద్దిగా వెనక్కి ఉన్నాయి, వెనుక వైపు టెయిల్‌ల్యాంప్స్ వాహనం యొక్క స్వరూపంతో విలీనం అయ్యి ఉన్నాయి.
ఇంకా చదవండి : మొదటి సారిగా టాటా కైట్ వారి ప్రకటన: ఇందులో లియోనెల్ మెస్సీ కనపడ్డారు
ఇంజిన్స్:
టాటా మోటార్స్ నుండి అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, మార్కెట్ లో ఉన్న సమాచారం ప్రకారం ఈ వాహనం పెట్రోల్ మరియు డీజిల్ మోటార్ల యొక్క కొత్త సెట్ తో అందించబడుతుంది. డీజిల్ ఇంజిన్ 1.05 లీటర్ 3-సిలిండర్ యూనిట్ తో అమర్చబడి 65-70bhp మధ్యలో శక్తిని మరియు 150Nm కంటే తక్కువ టార్క్ ని అందిస్తుంది. ఇది సెలేరియో 800 సిసి 2-సిలిండర్ డీజిల్ యూనిట్ తో పోల్చి చూస్తే మంచి మైలేజ్ సామర్ధ్యాలను అందిస్తుంది. పెట్రోల్ 1.2 లీటర్ యూనిట్ ని కలిగియుండి దేశంలోని ఇతర 1.2 లీటర్ యూనిట్ల తో పోలిస్తే 80bhp శక్తిని మరియు 120Nm టార్క్ ని అందిస్తుంది. టాటా సంస్థ 5-స్పీడ్ MT తో పాటు ఆంట్ ఆటో ఆప్షన్ ని కూడా అందించగలదు అని ఆశిస్తున్నారు.
లక్షణాలు:
జెస్ట్ మరియు బోల్ట్ తరువాత ఎక్కువ అంచనాలతో ఈ కొత్త వాహనం పోటీ విభాగంలో రాణించగలదు. ఈ వాహనంలో బహుశా జెస్ట్ మరియు బోల్ట్ లో ఉన్నటువంటి అదే విధమైన హర్మాన్ ఆధారిత సమాచార వినోద వ్యవస్థ అందించబడవచ్చు. భద్రత పరంగా, ఇది ABS మరియు EBD తో పాటు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ ని కలిగి ఉంటుంది. అయితే, జెస్ట్ మరియు బోల్ట్ వలే CSC- కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ లక్షణాన్ని కూడా కలిగి ఉండవచ్చు.
ఇంకా చదవండి